రొమాంటిక్ కామెడీ కథగా 'రాజయోగం'.. టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ | Young Hero Vishwak Sen Released Rajayogam Movie Teaser | Sakshi
Sakshi News home page

Rajayogam Movie: ఫుల్ రొమాంటిక్ మూవీగా 'రాజయోగం'.. టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Published Mon, Nov 7 2022 9:06 PM | Last Updated on Mon, Nov 7 2022 9:09 PM

Young Hero Vishwak Sen Released Rajayogam Movie Teaser - Sakshi

సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రాజయోగం'. నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు.  రామ్ గణపతి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను యంగ్ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'రోనక్‌ ఇచ్చిన మాట ప్రకారమే ఇక్కడికి వచ్చా. సాయి రోనక్ నాలాగే పక్కా హైదరాబాద్ కుర్రాడు. టీజర్ బాగుంది. ఇద్దరు హీరోయిన్స్ ఇంప్రెసివ్‌గా ఉన్నారు. పాటలు బాగున్నాయి. టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ చెబుతున్నా.' అని అన్నారు.  

నిర్మాత మణి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. 'మా చిత్ర టీజర్ విడుదల కార్యక్రమానికి అతిథిగా  వచ్చిన హీరో విశ్వక్ సేన్‌కు కృతజ్ఞతలు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే చిత్రమిది. మా టీమ్ అందరికీ రాజయోగం తెస్తుందని ఆశిస్తున్నాం. రెండు గంటల పాటు ఇంటిల్లిపాదీ నవ్వుకునేలా సినిమా ఉంటుంది. మేము అనుకున్నట్లుగా ఔట్ పుట్ వచ్చింది.' అని అన్నారు.

దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ..'రొమాంటిక్ కామెడీ కథతో ఈ సినిమాను రూపొందించాను. ఈ సినిమాలో రోనక్ పర్మార్మెన్స్ సూపర్. ఇద్దరు హీరోయిన్స్ బాగా నటించారు. అంకిత క్యారెక్టర్ కొద్దిగా గ్రే షేడ్‌లో ఉంటుంది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ, అరుణ్ మురళీధరన్ సంగీతం హైలైట్ అవుతాయి. ఈ సినిమాలో పడిందే అని సాగే ఒక స్పెషల్ సాంగ్ ఉంది. మూవీని ఎంజాయ్ చేస్తారు. డిసెంబర్ 9న థియేటర్‌కు రండి.' అని అన్నారు.

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ..'మా కార్యక్రమానికి వచ్చిన విశ్వక్ అన్నకు థాంక్స్. మా సినిమాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఒక డబుల్ మసాలా బిర్యానీ లాంటి సినిమా ఇది. నాకు ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం లక్కీ. నాకు ఫైట్స్, డాన్స్ చేయడం ఇష్టం. ఆ అవకాశం ఇంతవరకు రాలేదు. ఈ సినిమాలో డాన్స్, ఫైట్స్ ఎంజాయ్ చేస్తూ చేశా. రెండు గంటలు ఎంటర్ టైన్ అవుతారు.' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement