అంకితా గొరాయా..
డెంటిస్ట్రీ చదివి, నటన మీదున్న ఇష్టంతో యాక్టింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. వెండితెర, వెబ్‌తెర నటిగా రాణిస్తోంది.
డాక్టరా ..
యాక్టరా అని ఆలోచించినప్పుడు యాక్టింగ్‌కే మనసు ఓటేసింది. అందుకే ముంబై వచ్చేసి మెథడ్ యాక్టింగ్‌లో జాయిన్ అయ్యాను. సినిమా, సిరీస్ ఏదైనా సరే.. భిన్నమైన పాత్రలు పోషించాలనుంది!
– అంకితా గోరయా
👉అంకితా పుట్టి, పెరిగింది చండీగఢ్‌లో. తండ్రి.. బల్‌జిందర్ గొరాయా, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తల్లి.. కిరణ్ గొరాయా, ఆర్టిస్ట్. అంకితా.. డాక్టర్ హర్‌వంశ్ సింగ్ జడ్జ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పిటల్‌లో బీడీఎస్
చేసింది.
👉నటనంటే ఆసక్తి ఉండటంతో చదువైపోగానే ముంబైకి వెళ్లింది. అక్కడే ‘ద జెఫ్ గోల్డ్‌బర్గ్ స్టూడియో’లో మెథడ్ యాక్టింగ్‌లో డిప్లొమా చేసింది. ఆ సమయంలోనే యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రదర్శించిన సుప్రసిద్ధ ఇటాలియన్ నాటకం ‘సిక్స్ క్యారెక్టర్స్ ఇన్ సర్చ్ ఆఫ్ యాన్ ఆథర్’లో నటించింది. అంతేకాదు అస్సి థియేటర్ వాళ్ల ‘బాయ్స్ లైఫ్’లోనూ ప్రధాన భూమిక పోషించింది.
👉రంగస్థలం మీద ఆమె ప్రతిభను చూసి వెండితెర వెల్‌కమ్ చెప్పింది. ‘సెక్షన్ 375’, ‘పతి పత్నీ ఔర్ వో’, ‘శేర్షా’ సినిమాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించింది అంకితా.
‘ద యెల్లో డైరీ’ మ్యూజిక్ బ్యాండ్ రిలీజ్ చేసిన ‘రబ్ రాఖా’ మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది.
👉ఇప్పుడు ఓటీటీలోకీ అడుగుపెట్టింది ‘ఇండస్ట్రీ’ అనే వెబ్ సిరీస్‌తో. అందులో ‘గాయత్రీ షా’గా అభినయించి, మెప్పిస్తోంది. ఇది అమెజాన్ మినీటీవీలో స్ట్రీమ్ అవుతోంది.
👉ఇన్‌స్టా, ఎక్స్, యూట్యూబ్‌లోనూ అంకితా యాక్టివ్‌గా ఉంటుంది.
కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్‌ల పుత్రరత్నం తైమూర్‌కి, తన హాఫ్ సిస్టర్ సారా అలీ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇద్దరికీ మంచి బాండింగ్ ఉందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! సారాను తైమూర్ ‘గోల్’ అని పిలుస్తాడట. ఆ పిలుపునకు సారా మురిసి ముక్కలవుతుందట. గోల్ అంటే హిందీలో ‘గుండ్రం’ అని అర్థం. లావుగా ఉన్నవాళ్లను హిందీలో ‘గోల్’ అంటూ ఆటపట్టిస్తుంటారు. ఒకప్పుడు సారా చాలా లావుగా ఉండేది. అప్పుడు ఆమెను ఇంట్లో అదే పేరుతో ఆటపట్టించేవారట. ‘బహుశా పెద్దవాళ్ల ద్వారా తైమూర్ ఆ మాటను విని ఉన్నాడేమో అందుకే నన్ను ‘గోల్’ అని పిలుస్తాడు’ అంటూ సంబరపడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment