Indrani Trailer: విజువల్ వండర్‌లా ‘ఇంద్రాణి’ | Indrani Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Indrani Trailer: విజువల్ వండర్‌లా ‘ఇంద్రాణి’

Published Sun, Jun 2 2024 4:53 PM | Last Updated on Sun, Jun 2 2024 4:53 PM

Indrani Movie Trailer Out

యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

'ఇండియన్ సూపర్ ఫోర్స్' గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్‌ ప్రారంభమైన ఈ ట్రైలర్‌.. అద్భుతమైన విజువల్స్ తో ఆద్యంతం అద్భుతంగా సాగింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇంద్రాణి' ఓ విజువల్ వండర్. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మెస్మరైజింగా వుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ .. ఇవన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.  

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..'ఇంద్రాణి' ఒక ఎపిక్ లాంటి సినిమా. చాలా అద్భుతమైన కంటెంట్ వుంది ఇందులో. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ వుండబోతుందో ఇందులో చూపించడం జరిగింది. వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇందులో సరికొత్తగా చూపించడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement