
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి అంకిత రైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. పారిస్‌లో మంగళవారం పదో సీడ్ రొడీనా (రష్యా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అంకిత 3–6, 6–7 (2/7)తో ఓటమి చవిచూసింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడు సార్లు బ్రేక్ చేసింది.
52 అనవసర తప్పిదాలు చేసిన అంకిత నెట్‌వద్ద 15 పాయింట్లు సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి నలుగురు బరిలోకి దిగారు. ప్రజ్నేశ్ రెండో రౌండ్‌కు చేరుకోగా... అంకిత, సుమీత్, రామ్‌కుమార్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment