
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి అంకిత రైనా శుభారంభం చేసింది. లండన్‌లో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో అంకిత 6–2, 6–1తో మయా లమ్స్‌డెన్ (బ్రిటన్)పై విజయం సాధించింది.
రెండో రౌండ్‌లో ప్రపంచ 134వ ర్యాంకర్ వితాలియా దియాత్‌చెంకో (రష్యా)తో అంకిత ఆడుతుంది. పురుషుల డబుల్స్‌లో విష్ణు వర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్), జీవన్ నెడున్‌చెజియాన్ (భారత్)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీలు మరో మ్యాచ్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాయి.