పండుగ పూట విషాదం
విడపనకల్లు, కణేకల్లు : విడపనకల్లు వుండలం వి.కొత్తకోట గ్రావూనికి చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం బళ్లారి జిల్లా బెండెట్టి గ్రావుం వద్ద హెచ్చెల్సీలో గల్లంతయ్యూరని తెలియగానే వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి కోసం కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితుల బంధువులు, గ్రావుస్తులు తెలిపిన మేరకు.. వి.కొత్తకోట గ్రావూనికి చెందిన మోజెస్, సుజాతలు ఉపాధ్యాయుులు. కణేకల్లు వుండలం వూల్యంలో మోజెస్ ప్రైవురీ పాఠశాల హెచ్‌ఎంగా, సుజాత కణేకల్లులో ఎస్జీటీ టీచర్లుగా పనిచేస్తున్నారు.
వీరి ఇద్దరి కుమారులు రవితేజ (20) అతని సోదరుడు కమల్‌తేజ (17) సంక్రాంతి కోసం ఇంటికి వచ్చారు. మోజెస్ అన్న కుమార్తె లక్ష్మి వీరిని పండుగ కోసం అని మంగళవారం సాయంత్రం బళ్లారికి తీసుకెళ్లింది. బుధవారం వీరు బహిర్భూమికి వెళ్లారు. బాటిల్‌లో నీరు నింపుకుంటూ కమల్ తేజ్ కాలు జారి పడిపోయూడు. అతన్ని కాపాడటం కోసం చేరుు అందిస్తూ రవితేజ సైతం నీట మునిగాడు. కొద్ది దూరంలో దుస్తులు ఉతుకుతున్న మహిళలు చీరలు వేసి వీరిని రక్షేంచుకు విఫలయత్నం చేశారు. మహిళల అరుపులతో స్థానికులు, పోలీసులు వచ్చి గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికొచ్చిన పిల్లలు (ఒకరు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్, మరొకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్) ఇలా గల్లంతయ్యూరని బంధువులు, గ్రామస్తులు కంట నీరు పెట్టారు. ప్రవూద విషయం తెలుసుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాయుదుర్గం వూజీ ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి, విడపనకల్లు జెడ్పీటీసీ సభ్యుడు సింగాడి తిప్పయ్యు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లారు. సంఘటనపై ఆరా తీశారు. ఎక్కడో ఒక చోట గట్టుకు చేరి ఉంటారని తల్లిదండ్రులకు, బంధువులకు ధైర్యం చెప్పారు. అనంతరం కర్ణాటక అధికారులతో వూట్లాడి గల్లంతు అరుున విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేరుుంచారు.
విద్యార్థుల గల్లంతు, కర్ణాటక పోలీసులు, విషాదం,
Students missing, Karnataka police, the tragedy