బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయాపై కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు మాలవీయాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాలవీయా ఓ వీడియోను పోస్టు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు రగిలించడమే మాలవీయా ఉద్దేశమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, తనపై కర్ణాటకలో కేసు నమోదు కావడంపై మాలవీయా ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ ఓ పావు అని విమర్శించారు. మాలవీయాపై కేసు పెట్టడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment