f i r
-
అమిత్ మాలవీయాపై కర్ణాటకలో కేసు నమోదు
బెంగళూరు/న్యూఢిల్లీ: బీజేపీ ఐటీ విభాగం అధ్యక్షుడు అమిత్ మాలవీయాపై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ నేత రమేశ్ బాబు ఫిర్యాదు మేరకు మాలవీయాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని అభ్యంతరకరంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో మాలవీయా ఓ వీడియోను పోస్టు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేషాలు రగిలించడమే మాలవీయా ఉద్దేశమని ఆరోపించారు. ఇదిలా ఉండగా, తనపై కర్ణాటకలో కేసు నమోదు కావడంపై మాలవీయా ట్విట్టర్లో ప్రతిస్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో రాహుల్ గాంధీ ఓ పావు అని విమర్శించారు. మాలవీయాపై కేసు పెట్టడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. -
మరో నకిలీ టీడీడీ వెబ్‌సైట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
-
ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సెల్ టవర్ ఎక్కాడు
తడ (నెల్లూరు) : తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి ఏకంగా సెల్‌టవర్ ఎక్కి కూర్చున్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తడ మండలం అనపగుంట గ్రామానికి చెందిన రుబీ(50) అనే వ్యక్తి తమ్ముడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీనిపై రుబీ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే సోమవారం సాయంత్రం వరకూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో రుబీ ఆవేదనతో మద్యం సేవించి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. ప్రస్తుతం అతడిని కిందకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఎస్పీ పర్యటన హడావిడిలో ఉండడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, మాట్లాడదామని చెప్పి పంపామని పోలీసులు తెలిపారు.