ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని సెల్ టవర్ ఎక్కాడు | man boarded cell tower | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని సెల్ టవర్ ఎక్కాడు

Published Mon, May 4 2015 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

man boarded cell tower

తడ (నెల్లూరు) : తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి ఏకంగా సెల్‌టవర్ ఎక్కి కూర్చున్నాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తడ మండలం అనపగుంట గ్రామానికి చెందిన రుబీ(50) అనే వ్యక్తి  తమ్ముడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీనిపై రుబీ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే  సోమవారం సాయంత్రం వరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంతో రుబీ ఆవేదనతో మద్యం  సేవించి  రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. ప్రస్తుతం అతడిని కిందకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఎస్పీ పర్యటన హడావిడిలో ఉండడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, మాట్లాడదామని చెప్పి పంపామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement