the tragedy
-
జయలలిత సమాధి దగ్గర విషాదం
-
వీఆర్ సిద్ధార్థలో విషాదం
కానూరు (పెనమలూరు) : ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి ఘటన కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో తీవ్ర విషాదం నింపింది.కాలేజీలో సరదాగా ఉండే ఇంజనీరింగ్ మొదటి ఏడాది ఐటీ చదువుతున్న చింతలపూడి మనోజ్‌దార్గాసాయిశ్రీకాంత్, దేవినేని జయనాగసాయికృష్ణ,పోతన సుభాష్‌లు నదిలో మునిగి చనిపోయారనే వార్తను సహ విద్యార్థులు, అధ్యాపకులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోలీ అయినప్పటికీ కళాశాల బుధవారం యథావిధిగా పనిచేసింది. ఆ ముగ్గురూ తరగతులకు హాజరైనా బతికేవారేమోనని మిత్రులు కంటతడి పెట్టారు. గత ఏడాది ఘటన మరవక మందే... గత ఏడాది ఇదే కాలేజీకి చెందిన ముగ్గురు సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఫైనల్ విద్యార్థులు కృష్ణానదిలో మునిగి చనిపోయారు.వారు కంకిపాడు మండలం మద్దూరు వద్ద నదిలో చెక్ డ్యామ్ నిర్మాణంపై పరిశోధనకు వెళ్లి ఇసుక తవ్విన గుంతలో పడి నీట మునిగి చనిపోయారు. అది మరవక మందే ఇప్పుడు ఈ ఘటన జరగడంతో అందరు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రద్ధాంజలి ఘటించిన విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు చనిపోవటంతో కాలేజీలో డీన్ పాండురంగారావు ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు.విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై రెండు నిమిషాలు మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని మౌనం పాటించారు. కాలేజీకి సెలవు ప్రకటించారు. బాధ్యతతో ఉండాలి: డీన్ పాండురంగారావు ఇంజినీరింగ్ విద్యార్థులపై చాలా బాధ్యత ఉందని, వారు జీవితాన్ని తేలికగా తీసుకోరాదని డీన్ బావినేని పాండురంగారావు అన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారని, దీన్ని విద్యార్థులు గుర్తించాలని కోరారు. -
బంతి తగిలి మరోక్రికెటర్ మృతి
కరాచీ: క్రికెట్ మైదానంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం ఇంకా మదిలో ఉండగానే పాకిస్థాన్‌లో టీనేజ్ క్రికెటర్ కూడా బంతి తగిలి ప్రాణాలు వదిలాడు. ఆదివారం ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే కుర్రాడు.. ప్రత్యర్థి పేసర్ వేసిన బంతి బలంగా ఛాతీకి తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బంతి తగలడంతోనే గుండె తీవ్ర ఒత్తిడికి గురైందని, తమ దగ్గరికి వచ్చే సరికే మృతి చెందినట్టు డాక్టర్ సమద్ తెలిపారు. క్రికెటర్ తల్లిదండ్రులు మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారని, ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. -
సెలవులకు అని వెళ్లి కానరాని లోకాలకు..
సంక్రాంతి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి సరదాగా గడిపిన చిన్నారులు, వారిని తీసుకురావడానికి వెళ్లిన తండ్రి, చిన్నానలను రోడ్డు ప్రమాదం కబలించింది. సోమవారం హైదరాబాద్‌లో ఉల్లాసంగా గడిపి అర్ధరాత్రి గోదావరిఖని వస్తున్న వారికి అదే ఆఖరి ప్రయాణమైంది. మెదక్ జిల్లా కొండపాక మండలం వెలికట్ట వద్ద మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడడం గోదావరిఖనిలో విషాదాన్ని నింపింది. - గోదావరిఖని గోదావరిఖని: గోదావరిఖని అడ్డగుంటపల్లి ప్రాంతానికి చెందిన ముజీబుద్దీన్(48), ఆయన సోదరుడు రజీయోద్దీన్(45) స్థానిక మేదరిబస్తీ రోడ్డులో రాయల్ స్వీట్‌హౌస్‌ను నిర్వహిస్తున్నారు. ముజీబుద్దీన్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా, రజీయోద్దీన్కు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ముజీబుద్దీన్ భార్య షహనాజ్ హైదరాబాద్‌లోని పుట్టినింటికి తన నలుగురు పిల్లలతో పాటు రజీయోద్దీన్ ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది. సెలవులు ముగియడంతో వారిని తీసుకువచ్చేందుకు మరో సోదరుడు ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉంటున్న మోహిజోద్దీన్తో కలిసి ముగ్గురు అన్నదమ్ములు సోమవారం తమ సొంత వాహనంలో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం 4గంటలకు అత్తగారింటి నుంచి పిల్లలను తీసుకుని మొత్తం తొమ్మిది మంది వ్యాన్‌లో బయల్దేరారు. రాత్రి 11గంటల వరకు హైదరాబాద్‌లోనే ఎగ్జిబిషన్‌ను తిలకించి ఉల్లాసంగా గడిపారు. అనంతరం ముజీబోద్దీన్ తన బావమరిది అనీస్‌కు ఫోన్ చేసి తాము గోదావరిఖనికి వెళ్తున్నట్టు చెప్పాడు. ఇంత రాత్రి సమయంలో వద్దని అతడు వారించినా వినకుండా అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. వాహనాన్ని రజీయోద్దీన్ నడుపుతున్నాడు. మెదక్ జిల్లా సిద్దిపేట సమీపంలోని కొండపాక మండలం వెలికట్ట గ్రామం వద్దకు వచ్చేసరికి వ్యాన్ అదుపుతప్పి రాజీవ్ రహదారిపైనున్న కల్వర్టును ఢీకొట్టింది. వాహనం ఎనిమిదిసార్లు పల్టీలు కొట్టి రోడ్డుపక్కనున్న గుంతలో బోల్తాపడింది. మంగళవారం వేకువజామున 2.30-3గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న ముజీబుద్దీన్, అతడి తమ్ముడు రజీయోద్దీన్, ముజీబుద్దీన్ కుమారుడు తాలీబ్(18), కూతురు ముస్కాన్(13) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ముజీబుద్దీన్ మరో ఇద్దరు కుమార్తెలు రంషా, సుమయ, రజీయోద్దీన్ కుమార్తెలు సనా, సుమన్, ముజీబోద్దీన్ అన్న మోహిజోద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుకునూరుపల్లి ఎస్సై కృష్ణ నేతృత్వంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమయ, మోహిజోద్దీన్ పరిస్థితి విషమంగా మారడంతో క్షతగాత్రులందరినీ హైదరాబాద్‌కు తరలించారు. గోదావరిఖనిలోని కుటుంబసభ్యులు, బంధువులు ఉదయం 6గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిద్దిపేట ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను సాయంత్రం గోదావరిఖని తీసుకొచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడడం, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడడంతో వారి బంధువులు, సన్నిహితులు విషాదానికి లోనయ్యారు. సంఘటన విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అడ్డగుంటపల్లిలోని మృతుల నివాసానికి తండోపతండాలుగా తరలివచ్చి విలపించారు. రంజాన్‌కు ప్రత్యేక రుచులు.. కాగజ్‌నగర్‌కు చెందిన ముజీబుద్దీన్ కుటుంబం ముప్పై ఏళ్ల క్రితం గోదావరిఖనికి వలస వచ్చింది. ముజీబోద్దీన్ తన సోదరులతో కలిసి కలిసి స్థానిక శివాజీనగర్‌లో పోచమ్మగుడి వద్ద స్వీట్‌హౌస్ నిర్వహిస్తూ జిలేబీ తయారు చేసేవారు. తర్వాత దుకాణాన్ని మేదరిబస్తీ రోడ్డుకు మార్చారు. గోదావరిఖనిలో ప్రత్యేకంగా జిలేబీ, మిర్చి తయారు చేస్తూ ప్రతీ రంజాన్ పండుగకు హరీస్, హలీమ్ రుచులను ఖనివాసులకు అందించేవారు. సోదరుడు మసీయోద్దీన్ ఆరు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించగా... ఆయన ముగ్గురు కూతుళ్లకు మంగళవారం మరణించిన ముజీబుద్దీన్, రజీయోద్దీన్లే వివాహాలు జరిపించి అక్కున చేర్చుకున్నారు. విద్యాసంస్థలు, దుకాణాలు బంద్ ముజీబుద్దీన్, రజీయోద్దీన్ మరణించడంతో సంతాప సూచకంగా స్వీట్షాపులతో పాటు పలు దుకాణాలను వ్యాపారస్తులు మూసివేశారు. గాంధీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న తాలీబ్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ముస్కాన్ మృతికి సంతాపంగా విద్యాసంస్థలను మూసివేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, విద్యాసంస్థల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వ్యాపారస్తులు మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
పండుగపూట విషాదం
తాండూరు రూరల్: సంక్రాంతి పండుగపూట ఆ ఇంట్లో విషాదం నెలకొంది. పండుగ సామగ్రి తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన తాండూరు పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసముండే అయినపురం మొగులప్ప(52) స్థానికంగా ఓ కిరాణం దుకాణం నిర్వహిస్త్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఆయన తాండూరుకు వచ్చి పండుగ సామగ్రి కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో ఇందిరాచౌక్ వద్ద రోడ్డు దాటుతుండగా తాండూరు నుంచి డిపోకు వెళ్తున్న వికారాబాద్ ఆర్టీసీ డిపో బస్సు(ఏపీ 28జడ్2598) ఆయనను ఢీకొంది. దీంతో బస్సు టైర్ల కిందపడిన మొగులప్ప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ వెంటనే వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. మొగులప్ప మృతి విషయం తెలుసుకున్న ఆయన కుటుంబీకులు, బంధువులు రాజీవ్‌కాలనీవాసులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని, మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఎస్ఐ అభినవ చతుర్వేది వారికి నచ్చజెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పట్టణ ఇన్చార్జి సీఐ శివశంకర్, ఎస్ఐలు నాగార్జున, ప్రణయ్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఘటనా స్థలానికి రావాలని, రూ.10 లక్షల పరిహారం ఇచ్చి మృతుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సీఐ శివశంకర్ వారికి సర్దిచెప్పారు. నష్టపరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మృతుడి బంధువులు శాంతించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీకాంత్ తాండూరు ఆస్పత్రికి చేరుకొని మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. సంస్థ నుంచి పరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. మృతుడికి భార్య శకుంతల, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు.. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శి కృష్ణముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. -
పండుగ పూట విషాదం
విడపనకల్లు, కణేకల్లు : విడపనకల్లు వుండలం వి.కొత్తకోట గ్రావూనికి చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం బళ్లారి జిల్లా బెండెట్టి గ్రావుం వద్ద హెచ్చెల్సీలో గల్లంతయ్యూరని తెలియగానే వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి కోసం కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితుల బంధువులు, గ్రావుస్తులు తెలిపిన మేరకు.. వి.కొత్తకోట గ్రావూనికి చెందిన మోజెస్, సుజాతలు ఉపాధ్యాయుులు. కణేకల్లు వుండలం వూల్యంలో మోజెస్ ప్రైవురీ పాఠశాల హెచ్ఎంగా, సుజాత కణేకల్లులో ఎస్జీటీ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరి ఇద్దరి కుమారులు రవితేజ (20) అతని సోదరుడు కమల్‌తేజ (17) సంక్రాంతి కోసం ఇంటికి వచ్చారు. మోజెస్ అన్న కుమార్తె లక్ష్మి వీరిని పండుగ కోసం అని మంగళవారం సాయంత్రం బళ్లారికి తీసుకెళ్లింది. బుధవారం వీరు బహిర్భూమికి వెళ్లారు. బాటిల్లో నీరు నింపుకుంటూ కమల్ తేజ్ కాలు జారి పడిపోయూడు. అతన్ని కాపాడటం కోసం చేరుు అందిస్తూ రవితేజ సైతం నీట మునిగాడు. కొద్ది దూరంలో దుస్తులు ఉతుకుతున్న మహిళలు చీరలు వేసి వీరిని రక్షేంచుకు విఫలయత్నం చేశారు. మహిళల అరుపులతో స్థానికులు, పోలీసులు వచ్చి గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికొచ్చిన పిల్లలు (ఒకరు ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్, మరొకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్) ఇలా గల్లంతయ్యూరని బంధువులు, గ్రామస్తులు కంట నీరు పెట్టారు. ప్రవూద విషయం తెలుసుకున్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాయుదుర్గం వూజీ ఎమ్మెల్యే కాపు రావుచంద్రారెడ్డి, విడపనకల్లు జెడ్పీటీసీ సభ్యుడు సింగాడి తిప్పయ్యు హుటాహుటిన ఘటనా స్థలానికి తరలివెళ్లారు. సంఘటనపై ఆరా తీశారు. ఎక్కడో ఒక చోట గట్టుకు చేరి ఉంటారని తల్లిదండ్రులకు, బంధువులకు ధైర్యం చెప్పారు. అనంతరం కర్ణాటక అధికారులతో వూట్లాడి గల్లంతు అరుున విద్యార్థుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేరుుంచారు. విద్యార్థుల గల్లంతు, కర్ణాటక పోలీసులు, విషాదం, Students missing, Karnataka police, the tragedy -
ఓరి దేవుడా..
మాటలకందని విషాదమిది.. చీకలగురికి గ్రామం ఉలిక్కిపడింది.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగురు.. పైగా ఒకే కుటుంబానికి చెందిన వారు.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తామని చెప్పి పొలానికి వెళ్లిన వారు ఇక శాశ్వతంగా రారని తెలిస్తే జీర్ణించుకోవడం ఎవరితరమవుతుంది? ఎవరికే అన్యాయం చేయని మాకు ఆ దేవుడు ఎందుకింత పెద్ద శిక్ష వేశాడని ఆ కుటుంబ సభ్యులు పొగిలి పొగిలి ఏడుస్తుంటే ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.. ఘటనా స్థలానికి వచ్చిన వారిలో కంట తడి పెట్టనోళ్లు లేరు. విడపనకల్లు/ఉరవకొండ/ఉరవకొండ రూరల్ : కరెంటు తీగలు మృత్యుపాశాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని వెంటతీసుకెళ్లాయి. ‘జీవితాంతం మాకు తోడుగా ఉంటారనుకున్నాం.. ఇలా చేశావేంటయ్యా భగవంతుడా.. మాపై ఇంత కచ్చకట్టినావా.. ఇంటోళ్లందరినీ తీసుకెళ్లిపోయావే.. ఇంక మాకు దిక్కెవరయ్యా’ అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. బోరు మరమ్మతు కోసం వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలియగానే వారి రోదన వర్ణణాతీతమైంది. ఎప్పుడూ తమతో హాయిగా ఉండే వాళ్లు ఇక లేరని తెలియగానే ఊరుఊరంతా విషాదంలో నిండిపోయింది. శుక్రవారం విడపనకల్లు మండలం చీమలగురికి గ్రామంలోని పొలంలో బోరు మరమ్మతు చేయడానికి ఇనుప పైపు బయటకు తీస్తుండగా పట్టు తప్పి పైనున్న విద్యుత్ తీగలు తగలడంతో రైతు కురుబ రేవణ్ణ (65), అతడి కుమారులు ఎర్రిస్వామి (36), బ్రహ్మయ్య (30), మనవడు రాజశేఖర్ (18), సమీప బంధువు, వన్నూరుస్వామి-రాజమ్మ దంపతుల కుమారుడు వరేంద్ర (29) అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలియగానే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు కంటతడిపెట్టారు. మృతదేహాలపై పడి కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ‘మేమేం పాపం సేశామని మాకింత పెద్ద సిచ్చవేశావురా దేవుడా.. మేం ఎలా బతకాలి.. ఇక మాకు దిక్కెవరు’ అంటూ రేవర్ణ భార్య లక్ష్మిదేవి గుండెలవిసేలా రోదించింది. ఇద్దరు కోడళ్లను గట్టిగా పట్టుకుని ‘ఇక మనకెవరు దిక్కమ్మా’ అంటూనే స్పృహ కోల్పోయింది. ‘‘పిల్లలను బాగా సదివిద్దామంటివే.. వాళ్లకి మంచి జీవితాన్నిద్దామని రోజూ సెప్తాంటివి. ఇంతలోనే నీతో పాటు నీ కొడుకునూ తీసుకెళ్తివా అయ్యా.. ఓరి దేవుడా’’ అంటూ ఎర్రిస్వామి భార్య పుష్పావతి భర్త, కొడుకు మృతదేహాల వద్ద విలపించింది. ‘తొందరగా బోరు రిపేరి సేసి బిరీన బువ్వ తీనేకి ఇంటికొత్తానని సెప్తివే.. నీకేమైందయ్యా..లెయ్.. పిల్లలు నిన్ను అడుగుతాండారు.. ఏం సెప్పేది.. అత్తమ్మా.. నాకు, నా పిల్లలకు ఇంక దిక్కెవరమ్మా..’ అంటూ బ్రహ్మయ్య భార్య నాగవేణి అత్తను హత్తుకుని కన్నీరుమున్నీరైంది. ‘పుట్టింటికి పోయిండే నీ పెళ్లాం వచ్చినాక అడిగితే నేనేం సెప్పల్రా కొడకా.. ఇంత ఘోరంగా పోతివే.. పెళ్లై సంవత్సరం దాటేకే లేదు.. ఇంతలోనే పెళ్లాం కొడుక్కి దిక్కు లేకుండా చేశావే’ అంటూ వరేంద్ర తల్లిదండ్రులు కొడుకు మృతదేహంపై పడి విలపిస్తుంటే వారిని ఆపడం అక్కడున్న వారి తరం కాలేదు. ఇక గ్రామస్తులైతే విషాదం నిండిన హృదయంతో సంఘటన స్థలాన్ని చూస్తూ అలాగే ఉండిపోయారు. ఎవర్ని కదిపినా ‘అయ్యో పాపం.. ఎంత ఘోరం జరిగిందయ్యా.. ఉన్న పొలంలోనే అందరూ కలిసిమెలసి వెవసాయం సేత్తాండ్రి.. కట్టపడి బతికేటోళ్లు. ఎవర్నీ ఏ రోజూ పల్లెత్తు మాట అనేటోళ్లు కాదు.. ఇలాంటి కుటుంబానికి దేవుడు ఇంత శిచ్చ వేశాడు’’ అంటూ భగవంతుడిని నిందించారు. ప్రభుత్వానికి నివేదిక పంపిన కలెక్టర్ అనంతపురం ఎడ్యుకేషన్ : విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో పొలంలో బోరు వేస్తూ ఐదుగురు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టరు సొలమన్ ఆరోగ్యరాజ్ శుక్రవారం రాత్రి ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఘటనపై ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరడంతో ఆఘమేఘాలమీద సిద్ధం చేసి పంపారు. ఘటన జరగిన తీరు, కారణాలు తదితర అంశాలను సమగ్రంగా నివేదించారు. రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అనంతపురం సిటీ : మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుదాఘాతంలో ఐదుగురు మృత్యువాత పడడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అనంతపురం అర్బన్ : మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికి విద్యుత్ శాఖ నుంచి రూ.2.50 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.2.50 లక్షలు పరిహారంగా అందివ్వాలన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని, వైఎస్ఆర్సీపీ తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.