బాధితురాలికి నగదు ఇప్పిస్తున్న దృశ్యం
కృష్ణరాజపురం : ఇండోనేషియా దేశ రాజధాని జకార్త నగరానికి చెందిన మహిళ డీజే బెంగళూరు నగర పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కొత్త సంవత్సరం వేడుకల్లో సంగీత విభావరి (డీజే) కోసం బాణసవాడిలోని యునైటెడ్ టాలెంట్ అనే సంస్థ నిర్వాహకులు జకార్త నగరానికి చెందిన మహిళ డీజే కేసా అయ్‌రెస్‌ను తీసుకువచ్చారు. సంగీత విభావరి కోసం తీసుకువచ్చిన కేసా రానుపోను విమాన ఛార్జీలు, హోటల్లో బస కూడా ఏర్పాటు చేశారు. సంగీత విభావరి ముగిసిన అనంతరం రెండు రోజుల్లో ఖాతాలోకి పారితోషకం పంపిస్తామంటూ నిర్వాహకులు నమ్మించారు. జకార్తకు వెళ్లి రోజులు గడుస్తున్నా పారితోషకం పంపించకపోవడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా నిర్వాహకులు స్పందించలేదు.
కార్యక్రమ నిర్వాహకుల తీరుతో విసుగు చెందిన కేసా ఇదేనెల 8న బెంగళూరుకు వచ్చి పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్‌ను కలుసుకొని తన సమస్య వివరించారు. స్పందించిన కమిషనర్ సునీల్‌కుమార్ కేసా సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ డీసీపీ రాహుల్‌కుమార్‌ను ఆదేశించారు. వివరాలు తెలుసుకున్న డీసీపీ రాహుల్ కుమార్ బాణసవాడి ఎస్‌ఐ మురళికి కేసా సమస్య గురించి వివరించి పరిష్కరించాలంటూ ఆదేశించారు. కేసా ఫిర్యాదుతో విచారణ జరిపిన బాణసవాడి పోలీసులు కేసాకు రావాల్సిన 600 డాలర్ల పారితోషికంతో కేసా విమాన ఛార్జీలు కూడా ఇప్పించి జకార్తకు పంపించారు. తమ సమస్యపై వెంటనే స్పందించి పరిష్కరించి తమకు రావాల్సిన పారితోషికం ఇప్పించినందుకు సంతోషం వ్యక్తం చేసిన కేసా పోలీసుల పనితీరును ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment