ప్రస్తుతం మనదేశంలో చాలమంది టీనేజర్లు అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి పదిమందిలో ఐదుగురు అధిక బరువు సమస్యతో బాధపుతున్నారంటే..పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అయితే జపాన్, కొరియా లాంటి దేశాల్లో అమ్మాయిలు బొమ్మల్లా, భలే అందంగా ఉంటారు. పెళ్లి అయ్యిందో లేదో కూడా చెప్పలేం అంత స్లిమ్‌గా యవ్వనంగా కనిపిస్తారు. మరీ వాళ్లు అంతలా ఉండేందుకు గల ఫిటెనెస్ సీక్రెట్ ఏంటో చూద్దామా..!.
ఏం చేయాలంటే..
జపాన్ వాళ్లు నాజుగ్గా ఉండేందకు కఠినమైన ఆహార నియమావళిని ఫాలో అవుతారట. ఇది వారికి ఆరోగ్యంగా ఉండేదుకే గాక దీర్ఘాయువుతో ఉండటానికి ఉపయోగపడుతుందట.
వాళ్లు కడుపు నిండుగా అస్సలు తినరట. భోజనం చేసేటప్పుడు ఉదర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తింటారట. కేలం 80 శాతమే తిని మిగతా భాగం సాఫీగా అరిగిపోయేందుక వీలుగా ఖాళీగా ఉంచుతారట. అందువల్ల జీర్ణ సమస్యలు ఉండువు, బానపొట్టలా రాదు కూడా.
అలాగే వాళ్లు ఫుడ్ ప్లేట్‌లు చిన్నవే ఎంచుకుంటారట. ఇలా చేస్తే ఆహారం ప్లేటు నిండుగా ఉన్న ఫీల్ తోపాటు ఎక్కువ తింటున్నాం అనే అనుభుతి కలగడంతో తక్కువగానే తింటామని వారి నమ్మకం. అలాగే రెండోసారి వేసుకుని తినడానికి ఆలోచిస్తారట. నచ్చిందని గమ్మున వేసుకుని తినేయరట.
అదీగాక భోజనం చేసేటప్పుడూ మొబైల్స్, టీవీ, కంప్యూటర్‌లు చూస్తు అస్సలు తినరు. భోజనంపై ధ్యాస ఉంచి తినడానికి ప్రాధాన్యత ఇస్తారట. అలాగే నమిలినమిలి మైండ్‌ఫుల్‌నెస్‌తో తింటారట. ఇలా చేయడం వల్ల మంచిగా ఆహారం జీర్ణమవ్వడమే గాక అధిక బరువు వంటి సమస్యలను ఎదుర్కొనరు. పైగా నాజుగ్గా అందంగా ఉంటారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరీ..!.
(చదవండి: 'లైట్‌హౌస్ పేరెంటింగ్': పిల్లలు ప్రయోజకులయ్యేందుకు ది బెస్ట్!)
Comments
Please login to add a commentAdd a comment