వెయిట్ లాస్ జర్నీ అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే బరువు పెరగడం ఈజీగానీ తగ్గడమే బహు కష్టం. పోనీ వర్కౌట్‌లు, డైటింగ్‌లు చేసి బరువు తగ్గించుకోగలమా అంటే.. అంత ఈజీ కాదు. కొన్ని రోజుల చేశాక వామ్మో..! అని స్కిప్ చేసేస్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం జస్ట్ 90 రోజుల్లో ఏకంగా 14 కిలోల బరువు తగ్గి చూపించాడు. ఇంతకీ అతడు అన్ని కిలోల బరువు ఎలా తగ్గాడు? ఏంటీ అతడి ఫిట్‌నెస్ సీక్రెట్ అంటే..
పులక్ బాజ్‌పాయ్ జస్ట్ రెండు నెలల్లోనే 14 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలోవుతూ బరువు తగ్గడం విశేషం. అతడి వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..ప్రతిరోజూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకునేవాడట. రాత్రి పదిగంటలకు తేలికపాటి ఆహారాన్ని తీసుకునేవాడనని చెబుతున్నాడు పులక్. చక్కెరకు, అందుకు సంబంధించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. అలాగే బయటి ఆహారం, జంక్‌ఫుడ్ కూడా తీసుకోలేదని తెలిపాడు.
పండ్లు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిని మాత్రం తీసుకున్నట్లు వివరించాడు. ఐతే వారంలో ఒక రోజు మాత్రం ఈ కఠిన డైట్‌కి విరామం ఇచ్చి వెజ్ శాండ్‌విచ్, తేలికపాటి చక్కెరతో కూడిన కోల్డ్ కాఫీ మాత్రం తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకున్నాడు పులక్. దీంతోపాటు సాధారణ వ్యాయామం, సైక్లింగ్ తప్పనిసరిగా చేసేవాడు. రెగ్యులర్ వ్యాయామం, సైక్లింగ్ ఆహార నియంత్రణ, కేలరీలను బర్న్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగిపడిందని అంటున్నాడు పులక్.
చివరిగా పులక్.. "నిలకడగా బరువు తగ్గాలనే నిర్ణయంపై స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ఆహార నియంత్రణ తోపాటు తీసుకునే విషయంలో శ్రద్ధ వహించడం వంటివి చేస్తే ప్రభావవంతంగా బరువు తగ్గుతాం". అని చెబుతున్నాడు. అంతేగాదు సదా మసులో తాను బరువు తగ్గుతున్నాను, బరువు తగ్గాలి వంటి పాజిట్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటే ఆటోమెటిక్‌గా మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిచడం మొదలు పెట్టి డైట్‌ని స్కిప్ చేయాలనే ఆలోచన రానివ్వదని చెప్పుకొచ్చాడు పులక్.
(చదవండి: ఆమె స్థైర్యం ముందు..విధే చిన్నబోయింది..! ఆస్తమాతో పోరాడుతూ..)
Comments
Please login to add a commentAdd a comment