Cold coffee
-
వినూత్నం.. వియత్నాం కాఫీ
పొద్దున లేవగానే కాఫీ తాగనిదే చాలామందికి తెల్లారదు. కప్పులో అలా వేడి వేడి కాఫీ మన ముందుంటే ఆ పొగలతో వచ్చే ఆ వాసన చూస్తుంటే మనల్ని మనమే మైమరిచి పోతాం. పొట్టలో ఓ కప్పు కాఫీ పడితే ఉంటుంది గురూ.. ఆ లెవలే వేరు. మెదడు కూడా అంత వేగంగా పనిచేస్తుంది. చకచకా పనులు అయిపోతాయంతే.. ఇంక వేరే మాటే ఉండదు. కొందరికేమో ఇన్స్టంట్ కాఫీ అంటే ప్రాణం. మరికొందరు ఫిల్టర్ కాఫీ అంటే పడి చచి్చపోతారు. ఇంకొందరికేమో కోల్డ్ కాఫీ అంటే పిచ్చి. ఇలా జిహ్వకో రుచి అన్నట్టు.. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన టేస్ట్.భాగ్యనగరం అంటేనే పలు రుచులకు కేరాఫ్ అడ్రస్. ప్రపంచ దేశాల్లో దొరికే అనేక రుచులు మన నగరవాసులకు దొరుకుతాయనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇటీవల మన నగరంలో ఓ కొత్త రుచి క్రేజ్‌ను సంతరించుకుంటోంది.. దీంతో పాటు నగర ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటోంది.. దాని గురించి తెలుసుకుందాం.. వరల్డ్ ఫేమస్ హైదరాబాద్.. కోల్డ్ కాఫీ నగరంలో ఇటీవల ప్రాచుర్యం పొందుతోంది. అందులోనూ వియత్నాం కాఫీ నగరంలో మరింత ఫేమస్ అయిపోతోంది. నగర యువత ఈ కాఫీని లొట్టలేసుకుంటూ తాగేస్తోంది. ఒకప్పుడు ఇరానీ చాయ్.. ఇప్పుడు కోల్డ్ కాఫీ.. అప్పటికీ.. ఇప్పటికీ ప్రియమైన పానీయం టీ, కాఫీలే అయినా.. వైవిధ్యమైన రుచి ఆస్వాదించాలి అనుకునే వారికి మాత్రం ఇది పర్ఫెక్ట్ టేస్టీ చాయిస్ అని చెప్పొచ్చు. విభిన్న రుచులు.. వియత్నాం కాఫీలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఎగ్ కాఫీ, యోగర్ట్ కాఫీ, కోకోనట్ వియత్నమీస్ కాఫీ, వైట్ కాఫీ, కాఫెసురా, ఐస్డ్ బ్లాక్ కాఫీ, వియెట్ కాఫీ, లైబేరికా కాఫీ, కులీ కాఫీ, చెర్రీ కాఫీ ఇలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కోల్డ్ కాఫీల్లో కూడా కుకుంబర్ టానిక్, యాపిల్ కాఫీ యేల్, కివీ టానిక్ కాఫీ, స్పానిష్ లాటే ఇలా విభిన్నమైన రుచులు అందుబాటులోకి తెచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వాలనుకున్నా.. గర్ల్ ఫ్రెండ్‌తో జాలీగా గడపాలనుకున్నా ఎంచక్కా మాంచి కాఫీ షాప్‌కి వెళ్లి రెండు వియత్నాం కాఫీలు ఆర్డర్ చేసి లాగించేయండి. అథ్లెట్స్, జిమ్ చేసే వారికి తక్షణ శక్తిని అందిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి చిటికెలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఏదైనా సరే రోజుకు ఓ మోతాదులో తీసుకుంటేనే మంచిదని, అతి ఏదైనా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వియత్నాం కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. శక్తిని పెంచడమే కాకుండా రన్నింగ్, జాగింగ్, వ్యాయామాలు మరింత ఎక్కువగా చేసేందుకు దోహదపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. యాంగ్జయిటీని తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతతో పాటు మెదడుకు మంచి చేస్తుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగితే సెరటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ జ్ఞాపక శక్తి పెంచుతుంది. దీంతోపాటు ఎక్కువ విషయాలు నేర్చుకునేలా చేయడం, మానసిక సంతోషాన్ని ఇవ్వడంతో పాటు డిప్రెషన్ తగ్గించడం, శారీరక ఉష్ణోగ్రతను నియంత్రించడంతో, నిద్ర సరిగ్గా పట్టడంలో తోడ్పడుతుంది.నా సోల్‌మేట్.. కాఫీ అంటేనే అద్భుతం. ఇక కోల్డ్ కాఫీ అంటే మహా అద్భుతం. ఒంటరిగా ఉన్నప్పుడు కాఫీ తాగితే నన్ను నేనే మైమరిచిపోతాను. కాఫీ తాగిన తర్వాత అరగంట వరకూ ఏమీ తినను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆస్వాదించాలనేది నా భావన. చల్లచల్లటి కాఫీ తాగుతుంటే మస్తు మజా వస్తుంది. మంచి లొకేషన్లో కాఫీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు. స్నేహితులు తోడైతే అనుభూతి వేరే లెవల్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కాఫీ నా సోల్‌మేట్. బేగంపేటలోని పంచతంత్ర కాఫీ షాప్‌కి వారానికోసారి వెళ్లి కాసేపు కూర్చుని కాఫీ తాగుతుంటే భలే సరదాగా ఉంటుంది. :::మంజీర ఆరెట్టి, ప్రకాశ్‌నగర్, బేగంపేట స్వచ్ఛమైన కాఫీ అందించాలని.. కాఫీ ప్రియులకు అచ్చమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వచ్ఛమైన కాఫీ అందించాలనే ఆలోచనతో పంచతంత్ర కేఫ్ ఏర్పాటు చేశాం. కాఫీతో పాటు యాంబియెన్స్ కూడా బాగా ఉండేలా ప్రయత్నించాం. కస్టమర్లకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడమే మా ప్రాధాన్యం. ::: విక్రమ్, పంచతంత్ర కేఫ్ -
వెయిట్ లాస్ స్టోరీ: జస్ట్ 90 రోజుల్లోనే ఏకంగా 14 కిలోలు..!
వెయిట్ లాస్ జర్నీ అనేది ఎప్పటికీ ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే బరువు పెరగడం ఈజీగానీ తగ్గడమే బహు కష్టం. పోనీ వర్కౌట్లు, డైటింగ్లు చేసి బరువు తగ్గించుకోగలమా అంటే.. అంత ఈజీ కాదు. కొన్ని రోజుల చేశాక వామ్మో..! అని స్కిప్ చేసేస్తాం. కానీ ఈ వ్యక్తి మాత్రం జస్ట్ 90 రోజుల్లో ఏకంగా 14 కిలోల బరువు తగ్గి చూపించాడు. ఇంతకీ అతడు అన్ని కిలోల బరువు ఎలా తగ్గాడు? ఏంటీ అతడి ఫిట్నెస్ సీక్రెట్ అంటే..పులక్ బాజ్‌పాయ్ జస్ట్ రెండు నెలల్లోనే 14 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలోవుతూ బరువు తగ్గడం విశేషం. అతడి వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..ప్రతిరోజూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకునేవాడట. రాత్రి పదిగంటలకు తేలికపాటి ఆహారాన్ని తీసుకునేవాడనని చెబుతున్నాడు పులక్. చక్కెరకు, అందుకు సంబంధించిన ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని చెప్పాడు. అలాగే బయటి ఆహారం, జంక్‌ఫుడ్ కూడా తీసుకోలేదని తెలిపాడు. పండ్లు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిని మాత్రం తీసుకున్నట్లు వివరించాడు. ఐతే వారంలో ఒక రోజు మాత్రం ఈ కఠిన డైట్‌కి విరామం ఇచ్చి వెజ్ శాండ్విచ్, తేలికపాటి చక్కెరతో కూడిన కోల్డ్ కాఫీ మాత్రం తీసుకునేలా డైట్ ప్లాన్ చేసుకున్నాడు పులక్. దీంతోపాటు సాధారణ వ్యాయామం, సైక్లింగ్ తప్పనిసరిగా చేసేవాడు. రెగ్యులర్ వ్యాయామం, సైక్లింగ్ ఆహార నియంత్రణ, కేలరీలను బర్న్ చేసేందుకు అద్భుతంగా ఉపయోగిపడిందని అంటున్నాడు పులక్. చివరిగా పులక్.. "నిలకడగా బరువు తగ్గాలనే నిర్ణయంపై స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే ఆహార నియంత్రణ తోపాటు తీసుకునే విషయంలో శ్రద్ధ వహించడం వంటివి చేస్తే ప్రభావవంతంగా బరువు తగ్గుతాం". అని చెబుతున్నాడు. అంతేగాదు సదా మసులో తాను బరువు తగ్గుతున్నాను, బరువు తగ్గాలి వంటి పాజిట్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటే ఆటోమెటిక్‌గా మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిచడం మొదలు పెట్టి డైట్‌ని స్కిప్ చేయాలనే ఆలోచన రానివ్వదని చెప్పుకొచ్చాడు పులక్.(చదవండి: ఆమె స్థైర్యం ముందు..విధే చిన్నబోయింది..! ఆస్తమాతో పోరాడుతూ..) -
కోల్డ్ కాఫీ కోసం కేఫ్‌ల చుట్టూ తిరగకుండా.. ఈ డివైజ్‌తో ఇంట్లోనే.. ధర మాత్రం!
Cold Drip Coffee Machine: కాఫీల్లో కోల్డ్ కాఫీనే అదుర్స్ అంటుంటారు చాలామంది కాఫీ ప్రియులు. అందుకోసం కేఫ్‌ల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటి వారికి ఈ డివైజ్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని కాఫీ చక్కటి రంగు, రుచి, సువాసనలను మీ కాఫీ మగ్‌లో ఒలకబోస్తుంది. బోరోసిలికేట్ గాజుతో తయారైన ఈ డివైజ్.. 600 ఎమ్ఎల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనిలోని ఫిల్టర్, లిడ్(మూత) వంటివి తుప్పు పట్టకుండా అధిక నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందాయి. డివైజ్‌ని ఆన్ చేసినప్పుడు.. పైభాగంలో ఐస్ ముక్కలు వేసుకుంటే.. ఒక్కో చుక్కా కింద ఉన్న కాఫీ పౌడర్‌లో పడుతూ కింద మగ్లోకి కోల్డ్ కాఫీ వచ్చి చేరుతుంది. అయితే ఐస్ ముక్కల నుంచి వచ్చే వాటర్ వేగాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని డబుల్ లేయర్ ఫిల్టర్.. ఎటువంటి అవశేషాలను వదలకుండా పూర్తిగా ఫిల్టర్ చేయగలుగుతుంది. హ్యాండ్ బ్రూ కాఫీ కోసం.. కింద ఉన్న మగ్ను షేరింగ్ పాట్‌గా కూడా ఉపయోగించవచ్చు. అలాగే దీనిలో వేడి వేడి టీ కూడా పెట్టుకోవచ్చు. ఈ డివైజ్‌లోని మగ్ సైజ్ రిఫ్రిజిరేటర్కు అనుకూలంగా ఉంటుంది. దాంతో కోల్డ్ కాఫీని నిలవ ఉంచుకోవడం కూడా సులభమే. ధర -77 డాలర్లు (రూ.5,949 ) చదవండి👉🏾All In One Cooker: చికెన్, మటన్.. పాస్తా, కేక్.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే! ధర ఎంతంటే! చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర? -
రోడ్‌సైడ్ స్టాల్లో బార్టెండింగ్ స్కిల్స్
-
అతడు గ్లాస్ తిప్పుతుంటే చూడాలి..
సోషల్‌మీడియాలో నయా సంచలనం 'టిక్ టాక్' వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ వీడియో షేరింగ్ యాప్ ద్వారా పలువురు తమలోని కళలను వివిధ రూపాలలో ఇతరులతో పంచుకుంటున్నారు. ఈ యాప్‌తో పలువురు చిన్నపాటి స్టార్లుగా మారిపోతున్నారు. కొందరికైతే విపరీతమైన పాపులారిటీ వచ్చింది. వీడియో నచ్చితే చాలు నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా కేరళలో రోడ్‌సైడ్ స్టాల్లో ఉన్న వ్యక్తి కోల్డ్ కాఫీ తయారు చేసిన విధానం వైరల్‌గా మారింది. కోల్డ్ కాఫీ తయారు చేసేటప్పుడు అతడు ప్రదర్శించిన బార్టెండింగ్ స్కిల్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్లాసును గాల్లో తిప్పడం, పాలు మిశ్రమంలో కలిసిపోయేలా చాలా ఎత్తు నుంచి పోయడం చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అతనిలోని ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. టిక్ టాక్‌లో వ్యూస్ అధికంగా రావడంతో.. ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది. అయితే కొంత మంది మాత్రం ఇటువంటి యాప్‌లను చెడు కోసం వినియోగిస్తున్నారు. -
కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్
తిరువనంతపురం: ఓ కేరళ యువకుడి నైపుణ్యానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక్కో వ్యక్తికి ఏదో ఒక పనిలో టాలెంట్ ఉంటుంది. అలాగే ఈ కేరళ యువకుడికి కోల్డ్ కాఫీని తనదైన శైలిలో చేయడం అలవాటుగా మారింది. అతడు కోల్డ్ కాఫీ చేస్తుంటే నాశిక్ కు చెందిన చంద్రశేఖర్ గల్ గాలే తన మొబైల్ లో తీసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోను కొందరు యూట్యూబ్ లో పోస్ట్ చేయగా అక్కడ కూడా యువకుడిపై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. జేమ్స్ బాండ్ కూడా నీ కోల్డ్ కాఫీని లవ్ చేస్తాడు.. ఏ మాత్రం ఆలోచించకుండా తాగేస్తాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏం చేసినా సరే మొత్తానికి అద్భుతమైన కోల్డ్ కాఫీని నీ శైలిలో చేశావ్ బాస్.. అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్లో ఈ వీడియో విపరీతమైన లైక్స్ తో పాటు రీట్వీట్లు సంపాదించుకుంది. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కాఫీ చేసిన యువకుడి వివరాలు వెల్లడించలేదు. పేరు తెలియకున్నా ఆ యువకుడి నైపుణ్యానికి ప్రశంసలు దక్కేలా చేశాడు చంద్రశేఖర్ గల్ గాలే. -
చల్లని కాఫీ
ఇంతలో బేరర్ వచ్చాడు. ఆమె మెనూ అంతా తరచి చూసి, ‘డెవిల్స్ ఓన్’ కోల్డ్ కాఫీ వన్ బై టు ఆర్డర్ చేయడంతో బేరర్ నిష్ర్కమించాడు. కాసేపు సమయంపై మౌనం స్వారీ చేసింది. ‘‘ఏ లాట్ కెన్ హాపెన్ ఓవర్ ఏ కాఫీ’’ - కాఫీ తాగే వ్యవధిలో గానీ, ఇక్కడ కాఫీ తాగటం వల్ల గానీ చాలా జరగవచ్చును అని పైవాక్యం తర్జుమా చేసుకుంటూ సదరు కాఫీషాపులోనికి అడుగపెట్టావు. నీకు కాఫీ తాగటం కొత్త కాదు. కాఫీ డే లాంటి ఖరీదైన కాఫీ షాపులూ కొత్త కాదు. కానీ, ఒక్కడివే రావడం కొత్త. ఒక స్త్రీ రమ్మంటే కాఫీ షాపుకి రావడం కొత్త. వచ్చి, ఆమెకోసం ఎదురుచూస్తూ కూర్చోవడం మరీ కొత్త! ఆమెను నువ్వు ఏడాదిగా ఎరిగినప్పటికీ ఏనాడూ ఆమెను కాఫీ షాప్‌కు నువ్వు తీసుకుని వెళ్లలేదు. నీ హాస్పిటల్లో ఓ నర్సుగా పరిచయమైన ఆమెను, నువ్వు చాలా గాఢంగా ప్రేమించావు. ఆమె కూడా నీ ప్రేమను అర్థం చేసుకుంది. ఇద్దరూ ఒకటౌదామనుకున్నారు. కానీ ఒకటవ్వగలరా? ఖాళీగా కూర్చుంటే బాగుండదని ‘బెల్జియం ఛాకో షాట్’ ఆర్డర్ ఇచ్చావు. ఈరోజు ఆదివారం సాయంత్రం కావడం చేత కాఫీడే యువతీ యువకులతో కళకళలాడుతుంది. ఒక్కసారి కాఫీ షాప్‌లో కూర్చున్నవారందరినీ పరిశీలనగా చూశావు. లింగ భేదం చూసే కళ్లకే గానీ జీన్స్ ప్యాంట్లకు, టీ షర్టులకు ఉండదు. నేటి ట్రెండ్‌కు ప్రతిబింబాలైన క్యాప్షన్లేవో టీషర్టులపై కొలువుదీరి నీవంటి రసజ్ఞుల చూపులను తమవైపునకు లాక్కుంటున్నవి. లెవీస్, పెపె, కిల్లర్, లీ కూపర్ తదితర జీన్సుల చిరుగుల్లోంచి నవీన నాగరికత ఉబికి పొంగుతోంది. నియాన్ బల్బుల కాంతి, చెవి పోగుల మెరుపును మరింత మెరుగ్గా చూపుతుంది. తలకు పెట్టిన బ్రెలిక్రీం స్పైక్స్‌ను బలంగా నిలబెట్టేందుకు మరింత దోహదపడుతుంది. హెయిర్ స్ప్రేల గుబాళింపో, డియోడ్రెంట్ల పరిమళమో తెలియదు గానీ వేల తుమ్మెదల దప్పిక తీర్చే సౌరభమేదో కాఫీ షాప్‌ను ఆవరించుకుంది. నిత్యం తెల్లకోటు వేసుకుని, మెడలో స్టెతస్కోపు పెట్టుకు తిరిగే నీకు, వీళ్ల వేషధారణ కృత్రిమంగా తోచడంలో వింత లేదు. మందులు, ఇంజెక్షన్లు, సెలైన్లు, స్పిరిట్ల వాసనలు నిండిన నీ ముక్కుపుటాలు ఈ సుగంధ వీచికలను ఎక్కించుకుంటాయా? ఏదో ఆలోచనల్లో ఉన్న నువ్వు, నువ్వార్డరిచ్చిన ‘బెల్జియన్ చాకో షాట్’ రాకతో ఈ లోకంలోకి వచ్చావు. ఇంకా ఆమె రాలేదు. అసహనంగా నీ ఐఫోన్‌ను అన్‌లాక్ చేసి మెసేజ్ ఇన్‌బాక్స్ తెరిచావు. ‘‘సారీ రామ్! మూడు రోజులుగా నిన్ను కలవడం గానీ, ఫోన్లో మాట్లాడటం గానీ, నీకు మెసేజ్ చేయడం గానీ కుదర్లేదు. రేపు సాయంత్రం ఆరింటికి గచ్చిబౌలి కాఫీడేకి రా. నీతో చాలా విషయాలు మాట్లాడాలి’’ ఆమె పంపిన అదే మెసేజ్‌ను నిన్నటి నుండి ఎన్నిసార్లు చదువుకున్నావో లెక్కేలేదు. టైం ఏడైంది. ఆమె ఇంకా రాలేదన్న అసహనంతో నీకు బీపీ పెరుగుతుండగా కాఫీడే తలుపు, నీ గుండె గవాక్షం ఒకే మాటు తెరుచుకున్నవి. రోమన్ల ప్రేమదేవత వీనస్, కాపర్ సల్ఫేట్ రంగు చీర కట్టుకుని వస్తున్నట్లుగా ఆమె ముగ్ధలా నడుస్తూ వచ్చి నీ టేబుల్లో నీ ముందు సీటుని ఆక్రమించుకుంది. ఆమె దర్శనంతో నీ బీపీ నార్మల్కు చేరింది. కళ్లు అరమోడ్పులయ్యాయి. ఆమె ఇంట్లో ఏం జరిగి ఉంటుందో నువ్వు ఊహించగలిగినా ‘‘ఏం జరిగిం’’దని ప్రశ్నించావు. ఆమె మౌనం వహించడంతో మళ్లీ అదే ప్రశ్న సంధించావు. ‘‘మన విషయం మా ఇంట్లో తెలిసిపోయిం’’దని చెప్పింది. ‘‘ఓస్! అంతేనా! ఎప్పటికైనా తెలియాల్సిందే కదా’’ అని తేలికపడ్డావు. ‘‘నన్ను ఎన్నెన్ని మాటలన్నారో తెలుసా?’’- నీ నిర్లిప్తత ఆమెకు నచ్చలేదు. ‘‘మా ఇంట్లోవాళ్లు నన్ను అంతకంటే ఎక్కువ అన్నారు. నేనేమైనా నీలా బాధపడ్డానా?’’ ఆమె పట్ల నీలో ఏ సానుభూతీ లేదు.‘‘అంటే! మీ ఇంట్లో కూడా మన విషయం తెలిసిపోయిందా?’’ ఆమె అమితమైన ఆశ్చర్యం ఒలకబోసింది. ‘‘తెలిసిపోవడమేవిటి? తెలియజెప్పాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు ఇంట్లోవాళ్లందరినీ పిలిచి చెప్పాను’’ - నీ ముఖంలో ఏ భావమూ లేదు. ‘‘అప్పుడే ఎందుకు చెప్పావు? కొన్నాళ్లు ఆగి చెప్పాల్సింది’’ - మెనూ చూస్తూ ఆమె మెల్లగా పలికింది. ‘‘ఇంకెన్నాళ్లు? మనం పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. ఈ ఒంటరి జీవితం నావల్ల కాదు’’ - నీ దవడ కండరం బిగుసుకుంది. ‘‘ఇంతకూ మన విషయం తెలిశాక మీ ఇంట్లోవాళ్లు ఏమన్నారు?’’ - ఆమెలో ఆసక్తి వెల్లివిరిసింది. ‘‘మా ఇంటి పరువు తీశానన్నారు. నా ఆస్తి కోసం నువ్వు నన్ను వలలో వేసుకున్నావన్నారు. ఇకపై నలుగురిలో వాళ్లు తల ఎత్తుకు తిరగలేమన్నారు. ఇంకా చాలానే అన్నార్లే’’ - ముఖం వికారంగా పెట్టావు. ‘‘మా ఇంట్లో కూడా సేమ్ టు సేమ్’’ - ఆమె గలగలా నవ్వేసరికి నువ్వు కూడా శృతిగా నవ్వావు. ఇంతలో బేరర్ వచ్చాడు. ఆమె మెనూ అంతా తరచి చూసి, ‘డెవిల్స్ ఓన్’ కోల్డ్ కాఫీ వన్ బై టు ఆర్డర్ చేయడంతో బేరర్ నిష్ర్కమించాడు. కాసేపు సమయంపై మౌనం స్వారీ చేసింది. నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ టేబుల్‌పై నువ్వు దరువేస్తుంటే ఆమె - ‘‘శేఖర్ కూడా ఇలాగే దరువేసేవాడు’’ అంది. ‘‘శేఖర్ పోయి ఇన్నేళ్లయినా నీకు అతను ఇంకా గుర్తున్నాడా?’’ అడగకూడని ప్రశ్న అడిగి తప్పుచేశావు. ‘‘ఏం? నీకు నీరజ గుర్తులేదా?’’ ఆమె ఈ ప్రశ్న నిన్ను అడుగుతుందని నీకు తెలుసు. ‘‘ఎందుకు గుర్తులేదు? ఆమె ఉన్నన్ని రోజులు నా జీవితం కలర్ఫుల్గా ఉండేది. దురదృష్టవశాత్తూ ఆమెను దేవుడు తీసుకుపోయాడు. తర్వాత నువ్వు పరిచయమయ్యావు. నీలో ఆమెను వెతుక్కుంటున్నాను’’ వెర్రిగా నవ్వావు. ‘‘నాకు కూడా అంతే! శేఖర్ అచ్చం నీలాగే ఉండేవాడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, శేఖర్ చనిపోలేదు. నీ రూపంలో బతికే ఉన్నాడని’’ - అనురాగం నిండిన ఆమె చూపులు నీ గుండెల్లో నాటుకున్నాయి. ‘‘అందుకే మనం పెళ్లి చేసుకోవాలి. మనం కోల్పోయిన ప్రేమను తిరిగి పొందాలి’’ నీ చెయ్యి ఆమె చేతిని సుతారంగా నిమిరింది. ‘‘మరి మన ఇళ్లలో ఒప్పుకోవడం లేదు!’’ అమాయకత్వం నింపుకున్న ఆమె కళ్లు నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. ‘‘ఒప్పుకోకపోతే పోనీ! మన అవసరాలు వాళ్లకు అక్కర్లేకపోతే వాళ్లూ మనకు అక్కర్లేదు’’ నిశ్చయంగా ధ్వనించిన నీ గొంతులో ఏదో చిన్న వణుకు. ఆమె ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీ బేరర్ చేతుల్ని రెక్కలుగా చేసుకుని ఎగిరివచ్చి నీ టేబుల్‌పై వాలింది. ‘‘శేఖర్‌కు కూడా నీలాగే కోపం ఎక్కువ కానీ మనసు మంచిది. నీకంటే ముందు నా జీవితంలో నన్ను అతను ప్రేమించినంత ఇంకెవ్వరూ ప్రేమించలేదు’’ కాఫీ సిప్ చేస్తూ అంది. ‘‘మా ఇంట్లోనూ అంతే! నీలాగా నన్నెవరూ ప్రేమించలేదు. అందరికీ నేను తెచ్చే డబ్బే కావాలి. నేను తిన్నానా, లేదా? ఉన్నానా, పోయానా ఎవరికీ అక్కర్లేదు. కనీసం నాతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడే తీరిక కూడా ఎవరికీ ఉండదు’’ - కాఫీలో షుగర్‌తో పాటుగా కోపం కూడా కలుపుతూ చెప్పావు. ‘‘రేపు మన పెళ్లయ్యాక కూడా నామీద ఇలాగే కోప్పడతావా?’’ ఆమె సందేహం సబబుగానే తోచింది నీకు. ‘‘ఛ! ఛ! నీమీద ఎందుకు కోప్పడతాను? నీతో చాలా సరదాగా ఉంటాను. వారానికి రెండు సినిమాలు చూద్దాం. రోజు విడిచి రోజు రెస్టారెంట్‌కు వెళ్దాం. నెలకోసారి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్దాం’’ - ఆమె ఇష్టంతో పనిలేనట్లుగా చెప్పుకుంటూ పోతున్నావు. ‘‘సరే. నీ ఇష్టం. కానీ నువ్వు స్మోకింగ్ మానెయ్యాలి. ఆదివారం మాత్రమే వోడ్కా తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. నేను చేసిన వంట ఎలా ఉన్నా మెచ్చుకుంటూ తినాలి’’ ఆమె స్వరంలో అధికారం ధ్వనించడం నీకు నచ్చింది. ‘‘సరే మేడమ్! నువ్వు ఎలా చెప్తే అలా. నీ సీరియళ్లు నువ్వు రోజూ చూసుకోవచ్చు. కానీ క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం నీకు రిమోట్ ఇవ్వను. ఇంతకూ మనం ఏ టీవీ కొందాం? కొత్తగా వస్తున్న ఎల్ఈడీ కొందామా?’’ - ఆమె సమాధానం కోసం నీ చెవులు ఎదురుచూస్తున్నాయి. ‘‘ఆలూ లేదు. చూలూ లేదు. అప్పుడే టీవీ గురించి ఎందుకు?’’ - ఆమె తియ్యగా విసుక్కుంది. ‘‘ఆలి ఉంది. ఆ రెండోది కూడా.’’ మిగిలిన వాక్యం పూర్తిచెయ్యకుండా కాఫీతో పాటు మింగేశావు. ‘‘ఛీ ఛీ! సిగ్గులేకపోతే సరి. పెళ్లీడుకొచ్చిన మనవలను పెట్టుకుని కూడా ఇలాంటి ఆలోచనలేవిటో!’’ నువ్వు మర్చిపోయినా ఆమె నీ వయస్సును గుర్తుచేసింది. సరే మేడమ్! నువ్వు ఎలా చెప్తే అలా. నీ సీరియళ్లు నువ్వు రోజూ చూసుకోవచ్చు. కానీ క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం నీకు రిమోట్ ఇవ్వను. ఇంతకూ మనం ఏ టీవీ కొందాం? కొత్తగా వస్తున్న ఎల్ఈడీ కొందామా? ‘‘అబ్బా! అక్కడికి తమరేదో యవ్వన ప్రాదుర్భావ దశలో ఉన్నట్లు! నీకు ఇంజనీరింగ్ చదువుతున్న ముగ్గురు మనవరాళ్లున్నారన్న సంగతి మర్చిపోయావేమో!’’ ఆమెను ఉడికిద్దామన్న నీ ప్రయత్నం ఫలించింది. కాఫీడేలో అందరూ మిమ్మల్నే గమనిస్తున్నారని నువ్వు చూడలేదు. నీకు అక్కర్లేదు కూడా. ఆమెతో ఉన్నంతసేపూ అనవతరంగా ఆమె ప్రేమను పొందాలన్న ఆబ నీది. ‘‘ఏవిటో! మన రోజుల్లో కాఫీ చల్లారిపోతే డబ్బులిచ్చేవాళ్లం కాదు. ఈ రోజుల్లో డబ్బు ఇచ్చి మరీ కోల్డ్ కాఫీ కొంటున్నాం! హా! హా! హా!’’ నీ హాస్య చతురతకి ఆమె పెదవులు విచ్చుకున్నాయి. ‘‘ఇంక వెళ్దామా? తొమ్మిది కావస్తుంది’’ బిల్ కట్టేసి ఆమె వాచీ చూసుకుంది. రెండు మూడు గంటలుగా కూర్చోడం మూలాన నీ కాళ్లు పట్టేసినా నెమ్మదిగా లేచి నుంచునే ప్రయత్నం చేశావు. నీ నడక మొదలైంది. ఊతం లేనిదే నీవు నడవలేవు! ఓ చెయ్యి నీ చేతి కర్రపైన! రెండవది ఆమె భుజంపైన! నీ నడక సాగుతుంది. నీదే కాదు, తోడున్న ఏ నడకా ఆగిపోదు... శతమానం భవతిః - రిషి శ్రీనివాస్