తాజాగా కేరళలో రోడ్‌సైడ్ స్టాల్‌లో ఉన్న వ్యక్తి కోల్డ్ కాఫీ తయారు చేసిన విధానం వైరల్‌గా మారింది. కోల్డ్ కాఫీ తయారు చేసేటప్పుడు అతడు ప్రదర్శించిన బార్‌టెండింగ్ స్కిల్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్లాసును గాల్లో తిప్పడం, పాలు మిశ్రమంలో కలిసిపోయేలా చాలా ఎత్తు నుంచి పోయడం చూసేవారిని ఇట్టే ఆకర్షిస్తుంది. అతనిలోని ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.