కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్ | Kerala youth Cold Coffee making video went viral | Sakshi
Sakshi News home page

కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్

May 28 2017 6:29 PM | Updated on Aug 25 2018 6:37 PM

కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్ - Sakshi

కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్

ఓ కేరళ యువకుడి నైపుణ్యానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తిరువనంతపురం: ఓ కేరళ యువకుడి నైపుణ్యానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక్కో వ్యక్తికి ఏదో ఒక పనిలో టాలెంట్ ఉంటుంది. అలాగే ఈ కేరళ యువకుడికి కోల్డ్ కాఫీని తనదైన శైలిలో చేయడం అలవాటుగా మారింది. అతడు కోల్డ్ కాఫీ చేస్తుంటే నాశిక్ కు చెందిన చంద్రశేఖర్ గల్ గాలే తన మొబైల్ లో తీసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

ఈ వీడియోను కొందరు యూట్యూబ్ లో పోస్ట్ చేయగా అక్కడ కూడా యువకుడిపై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. జేమ్స్ బాండ్ కూడా నీ కోల్డ్ కాఫీని లవ్ చేస్తాడు.. ఏ మాత్రం ఆలోచించకుండా తాగేస్తాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏం చేసినా సరే మొత్తానికి అద్భుతమైన కోల్డ్ కాఫీని నీ శైలిలో చేశావ్ బాస్.. అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్లో ఈ వీడియో విపరీతమైన లైక్స్ తో పాటు రీట్వీట్లు సంపాదించుకుంది. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కాఫీ చేసిన యువకుడి వివరాలు వెల్లడించలేదు. పేరు తెలియకున్నా ఆ యువకుడి నైపుణ్యానికి ప్రశంసలు దక్కేలా చేశాడు చంద్రశేఖర్ గల్ గాలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement