kerala youth
-
పోలాండ్‌లో భారతీయ యువకుడి హత్య..
వార్సా: పోలాండ్‌లో భారతీయ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని ఒల్లూర్‌కు చెందిన సూరజ్(23) పోలాండ్లోని ఓ ప్రైవేటు సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అయితే జార్జియా దేశానికి చెందిన ఓ ముఠా సూరజ్, అతని స్నేహితులతో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో సూరజ్‌ను జార్జియా దేశస్థులు కత్తితో పొడిచిచంపారు. అతని స్నేహితులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సూరజ్ మృతిని వార్సాలోని ఇండియన్ ఎంబసీతో పాటు అతని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. అయితే ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఎందుకు జరిగిందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. కొద్దిరోజుల క్రితం కేరళ పాలక్కడ్‌కు చెందిన ఇబ్రహీం షరీఫ్ అనే యువకుడు కూడా పోలాండ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఇతడ్ని ఓనరే క్రూరంగా చంపాడు. పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే ఎందుకు హత్య చేశాడనే విషయం మాత్రం తెలియరాలేదు. చదవండి: ఒక్క నిమిషం పట్టదు.. పుతిన్‌పై సంచలన ఆరోపణలు -
రెండు రోజులుగా చావు అంచున వేలాడుతూ, చివరికి..
ఊహించని రీతిలో చావు అంచున వేలాడుతూ రెండు రోజులు గడిపాడు ఆ వ్యక్తి. అధికారులు ప్రయత్నించినా.. అతన్ని కాపాడడం వీలు కాలేదు. ఇక తన ప్రాణం పోవడం ఖాయం అనుకుంటూ ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఆ తరుణంలో భారత్ ఆర్మీ ఎంట్రీతో సీన్ మారింది. ఆ కేరళ యువకుడి ప్రాణాలు నిలిచాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లా చేరాడు సమీపంలో చేరాట్ కొండలున్నాయి. వీటిని అధిరోహించాలనుకున్న ఆర్.బాబు (23), తన స్నేహితులు సోమవారం నాడు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కొండ అలా ఉండడంతో కష్టంగా అనిపించడంతో ఇద్దరు స్నేహితులు మధ్యదాకా వెళ్లి కిందకు వచ్చేశారు. కానీ, బాబు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి కొండపైకి చేరుకున్నాడు. కానీ, తిరిగి వచ్చే క్రమంలో అతనికి పట్టు జారిపోయింది. దీంతో రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. అక్కడి నుంచి బయటపడే మార్గం తోచలేదు. సీఎం చొరవతో.. కొండ అంచు చీలిక భాగంలో రెండు రోజులుగా చిక్కుకుపోయి సోమవారం నుంచి ఆహారం, నీరు లేకుండా అక్కడే చిక్కుకుపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు.. కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన చావు ఇలా రాసి ఉందా? అని యువకుడు అనుకున్నాడు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఆర్మీ సాయాన్ని కోరారు. దీంతో బుధవారం ఉదయానికి రెండు ఆర్మీ బృందాలు చేరాట్ కొండ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇందులో ఒకటి మద్రాస్ రెజిమెంట్ కు చెందిన బృందం. ఇందులో పర్వతాల అధిరోహణలో నైపుణ్యం కలిగిన సైనికులు ఉన్నారు. అలాగే, బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది సైనికుల బృందం అన్ని రకాల ఎక్విప్ మెంట్ తో చేరుకుంది. ముందు తిండి.. ఆపై బాబును సహాయ కార్యక్రమాలు బుధవారం ఉదయం 5.45 గంటలకు మొదలయ్యాయి. డ్రోన్ల సాయంతో బాబు జాడను గుర్తించారు. తొలుత అతడికి తిండి, నీరు అందించారు. ఆపై అతడికి కొంచెం ఓపిక వచ్చాక.. అనంతరం అక్కడి నుంచి క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. కాగా, సురక్షితంగా ఒక ప్రాణం నిలబెట్టిన భారత్ ఆర్మీకి సోషల్ మీడియా సలాం చెబుతోంది. కృతజ్క్షతలు చెప్పినవాళ్లలో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఉన్నారు. Worries have been put to rest as the young man trapped in the Cherad hill in Malampuzha has been rescued. The treatment & care needed to regain his health will be provided now. Thanks to the soldiers who led the rescue operation and everyone who provided timely support. pic.twitter.com/YAwHQOxZAP — Pinarayi Vijayan (@vijayanpinarayi) February 9, 2022 -
కేరళ యువకుడి టాలెంట్ ఇది.. వీడియో వైరల్
తిరువనంతపురం: ఓ కేరళ యువకుడి నైపుణ్యానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఒక్కో వ్యక్తికి ఏదో ఒక పనిలో టాలెంట్ ఉంటుంది. అలాగే ఈ కేరళ యువకుడికి కోల్డ్ కాఫీని తనదైన శైలిలో చేయడం అలవాటుగా మారింది. అతడు కోల్డ్ కాఫీ చేస్తుంటే నాశిక్ కు చెందిన చంద్రశేఖర్ గల్ గాలే తన మొబైల్ లో తీసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. ఈ వీడియోను కొందరు యూట్యూబ్ లో పోస్ట్ చేయగా అక్కడ కూడా యువకుడిపై ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. జేమ్స్ బాండ్ కూడా నీ కోల్డ్ కాఫీని లవ్ చేస్తాడు.. ఏ మాత్రం ఆలోచించకుండా తాగేస్తాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఏం చేసినా సరే మొత్తానికి అద్భుతమైన కోల్డ్ కాఫీని నీ శైలిలో చేశావ్ బాస్.. అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. ట్విట్టర్లో ఈ వీడియో విపరీతమైన లైక్స్ తో పాటు రీట్వీట్లు సంపాదించుకుంది. వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి కాఫీ చేసిన యువకుడి వివరాలు వెల్లడించలేదు. పేరు తెలియకున్నా ఆ యువకుడి నైపుణ్యానికి ప్రశంసలు దక్కేలా చేశాడు చంద్రశేఖర్ గల్ గాలే. -
‘ఆయన భార్యను.. మీ కొడుకు చనిపోయాడు’
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో చేరిన కేరళకు చెందిన మరో యువకుడు చనిపోయాడు. డ్రోన్ జరిపిన దాడిలో అతడు మృత్యువాతపడినట్లు అతడి భార్యే స్వయంగా అతడి తండ్రికి సమాచారం ఇచ్చింది. ‘డ్రోన్ జరిపిన దాడుల్లో మీ కుమారుడు చనిపోయాడు మావయ్య. నేను అతడి భార్యను’ అని ఆమె వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముర్షిద్ మహ్మద్ అనే యువకుడు మొత్తం 17మంది యువకులతో కలిసి గత ఏడాది(2016) జూన్ 1న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా టెహ్రాన్ అక్కడి నుంచి అప్ఘనిస్థాన్ వెళ్లి అక్కడ ఉగ్రవాద సంస్థలో చేరాడు. నంగర్హార్ ప్రావిన్స్‌లో పనిచేయడం ప్రారంభించాడు. అక్కడికి వెళ్లాక ముఘిరా అనే యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల (ఏప్రిల్) 11న ఓ డ్రోన్ విమానం ఉగ్రవాదుల స్థావరంపై దాడి చేసిందని, ఈ దాడిలో ముర్షిద్ చనిపోయాడని వాట్సాప్ ద్వారా కేరళలోని కాసర్ఘడ్కు చెందిన అతడి తండ్రికి 12, 13 తేదీల్లో సమాచారం అందజేసింది. ప్రస్తుతం అమెరికా జారవిడిచిన అతిపెద్ద బాంబు జరిపిన దాడి ప్రాంతంలోనే ముర్షిద్ ఉండేవాడు. అయితే, ఈ దాడికంటే ముందే అతడి భార్య తెలిపిన వివరాల ప్రకారం చనిపోయాడు. మిగతా కేరళ యువకులు కూడా ప్రస్తుతం యూఎస్ దాడి చేసిన ప్రాంతంలోనే ఉన్నారట. అయితే, వారి పరిస్థితి ఏమిటన్నది మాత్రం ఇంకా తెలియరావడం లేదు. -
పోలీసుల వేధింపులు.. ఫేస్బుక్లో లైవ్!
ఇద్దరు పోలీసులు కలిసి తమను వేధిస్తుంటే.. ఆ మొత్తం వ్యవహారాన్ని ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రపంచానికి చూపించి కేరళకు చెందిన ఓ ప్రేమజంట ధైర్యంగా నిలబడింది. ఇంకా పెళ్లి కాని ఆ యువతీ యువకులు.. తిరువనంతపురంలోని మ్యూజియం పార్కులో కూర్చుని ఉండగా.. వాళ్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులు వాళ్లను ప్రశ్నించడం మొదలుపెట్టారు. దాంతో బాగా ఇబ్బంది పడిన వాళ్లు.. పోలీసుల వేధింపులు మొత్తాన్ని ఫేస్బుక్ ద్వారా లైవ్‌లో చూపించారు. తాము అసభ్యంగా ప్రవర్తిస్తున్నామంటూ పో్లీసులు ఆరోపించారని, కానీ తాము కేవలం కూర్చుని మాట్లాడుకుంటున్నామని ఆ యువకుడు చెప్పాడు. తాను కేవలం అమ్మాయి భుజం మీద చేయి వేసుకుని కూర్చున్నానని, అందులో అసభ్యత ఏముందని అతడు ప్రశ్నించాడు. పోలీసులు తమతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంతో.. బాగా ఆందోళనకు గురైన యువతి తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఇలాంటి పరిస్థితి చాలామందికి వస్తోందని, వాళ్లు కూడా బయటకు వచ్చి మాట్లాడాలని ఆమె చెప్పింది. వచ్చిన ఇద్దరు పోలీసులలో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారని, తాము అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వాళ్లు చెప్పినప్పటి నుంచి తాము ఫేస్బుక్ లైవ్ ఆన్ చేశామని యువకుడు తెలిపాడు. వాళ్లిద్దరూ పార్కులో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల వాళ్లను అదుపులోకి తీసుకుని వారిపై ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
జకీర్ నాయక్ ప్రధాన అనుచరుడి అరెస్టు
శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నాంటూ చెప్పుకొనే పీస్ టీవీ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ సన్నిహిత అనుచరుడిని మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. అర్షిద్ ఖురేషీ అనే ఈ యువకుడికి జకీర్ నాయక్ నడిపించే ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, అతడిని నవీ ముంబై ప్రాంతంలో అరెస్టు చేశారని తెలిసింది. కేరళ యువకులను ఇస్లామిక్ స్టేట్‌లో నియమిస్తున్నాడన్న ప్రధాన ఆరోపణతో ఖురేషీని అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తో ంది. ఖురేషి మీద ఐపీసీ సెక్షన్లు 153ఎ, 34లతో పాటు 13యూఏపీఏ కింద కేసులు పెట్టారు. ఖురేషీకి ఐఆర్ఎఫ్తో సంబంధాలు పర్తిగా బయటపడితే.. జకీర్ నాయక్ సంస్థ గుట్టు మొత్తం బయటపడుతుంది. ఖురేషీని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత అతడిని కేరళకు తీసుకెళ్తారు.