ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి వాకింగ్ కూడా చేయలేడు. ఎవరో ఒకరు సాయం లేనిదే వాకింగ్ చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ కిలోలు కొద్ది బరువు తగ్గాడు. పైగా 40 ఏళ్లకు మించి బతకడని తేల్చి చెప్పిన వైద్యుల మాటే తప్పు అని ప్రూవ్ చేసి చూపించాడు. ఇంతకీ అతను ఎలా అన్ని కిలోల బరువు తగ్గాడు? అది సరైనదేనా అంటే..
ఒకప్పడూ ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి, పాల్ మాసన్. అతను ఏకంగా 444.5 కిలోల బరువు ఉండేవాడు. అయితే ప్రస్తుతం అతను బరువు కోల్పోయాడు కానీ నడవలేడు. చెప్పాలంటే వాకింగ్ వంటివి చేయకుండానే బరువు తగ్గాడు. డాక్టర్లు సైతం అతడి భారీ కాయాన్ని చూసి మహా అయితే 40 ఏళ్లు బతుకుతాడని తేల్చి చెప్పేశారు. అయితే మాసన్ వైద్యుల అంచనాలను తారుమారు చేస్తూ..ఈ ఏడాది 64వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు మాసన్.
ప్రస్తుతం ఆయన 288 కిలోల బరువు ఉన్నారు. అయితే ఆయన నడవలేరు మంచానికే పరిమితమయ్యారు. నిజానికి మాసన్ అత్యంత స్థూలకాయుడిగా మారడానికి కరోనా మహమ్మారి టైంలో లాక్‌డౌన్ కారణంగా డిప్రెషన్‌కి సంబంధించిన మందులు ఓవర్ డోస్ తీసుకున్నాడు. అదీగాక ఆ టైంలోనే బ్రిటన్లో అత్యంత బరువైన వ్యక్తిగా ఉన్న జాసన్ హోల్టన్ మరణం అతడి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. దీంతో అతడు విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే అను గ్యాస్ట్రిక్ బైపాస్ వంటి సర్జరీలతో 120 కిలోల వరకు బరువు తగ్గించుకోగలిగాడు. ఆ తర్వాత అదనపు స్కిన్‌ని తొలగించుకునేందుకు యూఎస్‌లో మరికొన్ని ఆపరేషన్లు చేయించుకున్నాడు. ఆ సమయంలోనే తన జీవిత భాగస్వామిని కూడా కలుసుకున్నాడు.
అయితే ప్రస్తుతం తాను ఇంకా చాలా శారీరక, మానసిక సమస్యలు ఫేస్ చేస్తున్నాని, తినే ఆహారం క్వాండిటీ పెరుగుతుందే గానీ తగ్గదని చెబుతున్నాడు మాసన్. అంతేగాదు తన అధిక బరువుకు ప్రధాన కారణం మానసిక సమస్యలని కూడా తెలిపాడు. చిన్నతనంలో తన తండ్రి చేతిలో శారీరక వేధింపులకు గురయ్యానని, ఎలాపడితే అలా కొట్టేవాడని చెప్పుకొచ్చాడు. ఆరేళ్ల వయస్సు నుంచే తనని కుటుంబ సభ్యులు దారుణంగా వేధించేవారని చెప్పుకొచ్చాడు.
ఇక్కడ మాసన్ వ్యక్తిగత మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం సాధ్యపడలేదు. దీని కారణంగా మాసన్ ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగ్గా అవ్వలేదు. ఇంకా పలు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లు కూడా వివరించాడు. ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే.. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏ అనారోగ్య సమస్య అయినా నయం అవుతుంది. అందువల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండి ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గేందుకు యత్నించాలి.
ఆరోగ్యకరమైన రీతిలో బరవు తగ్గాలంటే..
బరువు తగ్గడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆహారం, వ్యాయామం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక నియమానుసారంగా చేస్తే..ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం సులభమని అంటున్నారు. అందుకోసం పాటించాల్సినవి ఏంటంటే..
చక్కెరను తగ్గించండి
తాజా, కాలానుగుణ పండ్లు తినడంపై దృష్టి పెట్టండి
ఫైబర్, ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడం
మెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వడం
క్రమం తప్పకుండా వ్యాయామం
ఎక్కవు నీరు త్రాగడం
టైంకి మంచిగా నిద్రపోవడం.
(చదవండి: నవ్వడం' కోసం ఏకంగా చట్టం..! ప్రతిరోజూ..)
Comments
Please login to add a commentAdd a comment