మహిళలు ప్రసావానంతరం బరువు తగ్గడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు తల్లికి మహాకష్టం. వారు తమ పనులు తాము చేసుకునే స్థాయికి చేరుకునేంత వరకు కూడా పిలల సంరక్షణ తల్లిదే భాద్యత. అందువల్ల ఏ మహిళైన తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారిండం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయినా కొందరూ తగ్గగలుగుతారు. అదేమంతా అసాధ్యమైన విషయం కాదని బరువు తగ్గి మరి చూపించింది బాలీవుడ్ నటి నేహా ధూపియా. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఆమె ప్రసవానంతరం విపరీతమైన బరువు పెరిగిపోయింది. అయితే జస్ట్ ఒక్క ఏడాదిలోనే తన ఫిట్‌నెస్‌పై దృష్టిసారించి మరీ కిలోలు కొద్ది బరువు తగ్గింది. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందో కూడా నెటిజన్లతో షేర్ చేసుకుంది.
బరువు తగ్గడం అనేది అంత సులభమైనది కాదు. అందులోనూ ప్రసవానంతర బరువు తగ్గడం అంటే ఇంకా కష్టం. కానీ నేహా తన సంకలప్పంతో బరువు తగ్గి మరీ చూపించింది. అలా ఆమె ఏకంగా 23 కిలోల వరకు బరువు తగ్గిపోయింది. 43 ఏళ్ల ధూపియా ఇదంతా అంత సులభమైనది కాదంటూ తన వెయిట్ లాస్‌జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ముందుగా బరువు తగ్గేందుకు చేసిన వర్కౌట్లు వంటి వాటితో విపరీతమైన అలసట, వొళ్లు నొప్పులు వచ్చేసేవి. ఆ తర్వాత తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టానంటు చెప్పుకొచ్చింది. తీసుకునే ఆహారంలో గ్లూటెన్ లేకుండా జాగ్రత్త పడింది.
దాదాపు 14 గంటలు ఉపవాసం వంటివి చేసి 23 కిలోలు మేర బరువు తగ్గినట్లు తెలిపింది. అయితే ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం,డైట్ విషయంలో నియమాలు పాటించినట్లు వివరించింది. అందువల్ల సులభంగా బరువు తగ్గి, మంచి ఫిట్‌గా ఉండగలిగానని చెప్పింది నేహా. ఇక్కడ ఒక్కోసారి డైట్ లేదా వ్యాయామాలు స్కిప్ అయిన నిరాశపడొపోకుండా..తర్వాత రోజు నుంచి కొనసాగించడమే గాకుండా బరువు తగ్గుతాను అనే పాజిటివ్ ఆటిట్యూడ్‌ని డెవలప్ చేసుకుంటుంటే ఆటోమేటిగ్గా చక్కగా బరువు తగ్గిపోతారని చెబుతోంది నెహా ధూపియా. అంతేగాదు వాకింగ్, జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గాలనుకుంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వమంటూ పలు ఆసక్తికర విషయాలు ూడా చెప్పుకొచ్చింది.
అవేంటంటే..
సమతుల్య ఆహారం తీసుకోండి
అతిగా తినకుండా కొలత ప్రకారం తీసుకునేలా మైండ్ సిద్ధం చేసుకోండి
లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి
నీరు బాగా త్రాగండి
చక్కెర పానీయాలు నివారించండి
జంపింగ్, రన్నింగ్ లేదా డ్యాన్స్ వంటివి చేయండి
పుష్ అప్స్, స్క్వాట్‌ల, ప్లాంక్‌లు వంటి వ్యాయామాలు చేయండి
కాస్త విరామం ఇచ్చి ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వండి.
మైండ్‌ఫుల్ ఈటింగ్ వంటి టెక్నీక్‌లతో ఆకలిని నియంత్రించండి.
తగినంత నిద్రపోండి.
ఇవన్నీ క్రమం తప్పకుండా ఫాలో అయితే ఇంట్లోనే సులభంగా బరువు తగ్గొచ్చని చెబుతోంది నేహా ధూపియా.
(చదవండి: వర్షాకాలం..వ్యాధుల కాలం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!)
Comments
Please login to add a commentAdd a comment