విశాఖపట్నం: అధికారుల సమాచారలోపం వారికి నరకాన్ని చూపిస్తోంది. రెండో రోజు అదే తీరు. కొలువు కోసం వెళ్లిన నిరుద్యోగిపై లాఠీ విరిగింది. విశాఖలో నిర్వహిస్తున్న ఆర్మీ ర్యాలీకి రెండోరోజు వేలాది మంది అభ్యర్ధులు హాజరయ్యారు. నిజానికి ఇంత మంది అభ్యర్ధులు వస్తారనే అంచనా ముందుగానే అధికారులకు ఉన్నప్పటికీ ఆ మేరకు ఏర్పాట్లు చేయలేకపోయారు. కనీసం తాగునీరు కూడా అందించలేదు. ముందురోజు రాత్రి నుంచే స్టేడియం వద్దకు చేరుకున్న అభ్యర్ధులను విడతల వారీగా టోకెన్లు తీసుకునేందుకు అనుమతించారు.
లాఠీచార్జ్
టోకెన్ల కోసం ముందుకు దూసుకువస్తున్న అభ్యర్ధులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్‌లో అనేక మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలకు అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రాధమిక చికిత్స చేశారు.
రెండో రోజూ విరిగిన లాఠీ
Published Sat, Jul 4 2015 10:22 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement