అతుక్కుపోయారో.. ఇక అంతే సంగతి!
న్యూయార్క్: ఏదో కాసేపు సరదాకో, లేదా విశ్రాంతిగా ఫీలయ్యేందుకో అలా టీవీ చూస్తే పెద్దగా నష్టం లేదుగానీ, ప్రతి రోజు అదే పనిగా టీవీ చూసేవాళ్లు మాత్రం తమంతట తాము వారి మృత్యురాత రాసుకున్నట్లేనని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు నిద్రాణంగా ఉన్న ఎన్నో రోగాలను కారకమయ్యే కణాలను కూడా నిద్ర లేపినట్లవుతుందని అవి ఒక్కసారి మేలుకున్నాక క్యాన్సర్ తోపాటు గుండె సంబంధమైన ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని మేరీలాండ్ లోగల నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన సరాహ్ కేడల్ అనే పరిశోధనకారుడు ఆయన చేసిన అధ్యయనం వివరాలు వెల్లడించాడు. దీని ప్రకారం రోజూ మూడు నుంచి నాలుగు గంటలు చూసే వారి ఆయుష్షు తరిగిపోతుంది. ఆ అలవాటు నయంకాని ప్రమాదకరమై వ్యాధులను కలిగిస్తుంది. అంతేకాదు, మానసిక స్థితిపైనే తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా శారీరక దారుఢ్యంలో కూడా అమాంతం మార్పుల తీసుకొస్తుంది. ఆసక్తి, ఏకాగ్రత కూడా దెబ్బతిని పూర్తి శరీరం పనిచేసే వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.