
మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు బోల్తా
మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి హెచ్‌పీ గ్యాస్ గోదాం సమీపంలో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో...
డ్రైవర్‌తోపాటు, ఐదుగురు ప్రయాణికులకు గాయాలు
ఇచ్చోడ : మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి హెచ్‌పీ గ్యాస్ గోదాం సమీపంలో శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడ్డ సంఘటనలో బస్సు డ్రైవర్‌తో ఐదుగురు ప్రయాణికులకు గాయూలయ్యాయి. గాయపడ్డ వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక ఎస్సై సంజీవ్, ప్రయాణికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని అకోలా నుంచి నిజామాబాద్ వెళ్తున్న (ఎంహెచ్ 04 5203 నంబర్ గల) బస్సు ఇచ్చోడ బైపాస్ సమీపంలోకి రాగానే డ్రైవర్ నందకిశోర్‌కు ఆకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో బస్సు అదుపుతప్పి గుంతలో పడింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఐదుగురు గాయపడగా వెంటనే 108లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీ : ఇద్దరికి గాయాలు
ఆదిలాబాద్ రూరల్ : మండలంలోని చాంద-టి జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్‌కు మోటార్ సైకిల్ ఢీకొనడంతో మావలకు చెందిన మహేందర్‌తోపాటు మరొకరు గాయపడ్డారు. బైక్‌పై భోరజ్ నుంచి ఆదిలాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చందా-టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ముందు నుంచి వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చి బైక్ ఢీ కొట్టిన్నట్లు తెలుస్తోంది. గమనించిన స్థానికులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహేందర్‌ను హైదరాబాద్ తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులను వివరాలను కోరగా తమ వద్ద కేసు నమోదు కాలేదని ఓ కానిస్టేబుల్ తెలిపారు.