కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) చిన్న వయసులోనే అకాల మరణం పొందారు. కుటుంభ సభ్యుల సమాచారం ప్రకారం..శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని వెల్లడించారు. 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడ బాధకరం. అస్సలు గుండెపోటు వస్తే ఇక అంతేనా?..ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? బయటపడలేమా అంటే..
చాలా ఘటనల్లో గుండెపోటు రావడం ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోవడం జరగుతుంది. కానీ ఇలా గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. వాటిని పట్టించుకోకపోవడంతోనే సమస్య తీవ్రమై ఆస్పత్రికి తరలించే వ్యవధి సరిపోక చనిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఎలాంటి వారికి వస్తుందంటే..
మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది.
ముందుగా వచ్చే సంకేతాలు..
- ఛాతి నొప్పి
- శ్వాస ఆడకపోవడం
- కుడి లేదా ఎడమ చేయి లాగడం
- ఛాతీ అసౌకర్యం
- ఆ నొప్పి 20 నిమిషాలకు పైనే ఉన్నా..
- వికారం
- కష్టపడు, చేమాటోర్చు
- గుండెల్లో మంట
- అజీర్ణం లేదా కడుపు నొప్పి
- అలసట మరియు వాపు
- మైకము
ఆ టైంలో ఏం చేయాలంటే..
ఈ సంకేతాలు కనిపించిన వెంటనే సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా పరిగణించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ), అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. అయితే వీటిని పరిస్థితి క్రిటికల్ అనిపించినప్పుడే ఇవి వేసుకోవాలి.
అలాగే వైద్యుని వెంటనే సంప్రదించి తాను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో? వివరించాలి. ఇక్కడ ఇలాంటి లక్షణాలు కనిపించిన.. 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం వల్ల ప్లేట్‌లెట్ అభివృద్ధిని నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడాని ఆలస్యం చేస్తుంది. కొంతమంది రోగులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల విపరీతమైన చెమట, మైకం వచ్చిందని చెబుతారు. అలాంటప్పుడూ రోగికి సార్బిట్రేట్ ట్యాబెలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే..? ఇది బీపీను మరింత తగ్గిస్తుంది.
ఈ విషయంపై పూర్తి అవగాహన ఉండి.. అవతలి వ్యక్తి పరిస్థితిని క్షణ్ణంగా తెలుసుకున్నాక ఇలాంటి ప్రథమ చికిత్సలను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్యాబ్లెట్‌లు వేసుకున్నాం కదా!.. గుండె నొప్పి తగ్గిందని వైద్యుని వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా అస్సలు వ్యవహరించొద్దు. ఇది కేవలం అంబులెన్స్ లేదా ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ప్రాణాలను కాపాడుకోవడానికే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి.
గోల్డెన్ అవర్‌లోపు తరలించాలి..
అంతేగాదు మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు.
ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment