ముంబై: కొంగొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా ఆర్థిక రంగ సంస్థలను తీర్చిదిద్దే దిశగా రిస్కు అధారిత పర్యవేక్షణ (ఆర్‌బీఎస్) విధానాన్ని సమీక్షించాలని, పటిష్టం చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం సాంకేతిక నిపుణులు/కన్సల్టెంట్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బ్యాంకులు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో పాటు దేశవ్యాప్త ఆర్థిక సంస్థల పర్యవేక్షణకు ఆర్‌బీఎస్ విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఉపయోగిస్తోంది. అసెట్ క్వాలిటీ, లిక్విడిటీ, ఆర్థిక సామర్థ్యాలు, గవర్నెన్స్ మొదలైన అంశాలను మదింపు చేసేందుకు ఇది తోడ్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment