గతంలో పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే పెద్దపేగు (కోలన్) కేన్సర్ ఇప్పుడు మన దేశంలోనూ కనిపిస్తుంది. చిన్నపాటి జాగ్రత్తలతోనే దీన్ని నివారించవచ్చు. అవి...
పొద్దున్నే తేలిగ్గా విరేచనమయ్యేలా పీచు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇందుకోసం చిరుధాన్యాలూ, కాయధాన్యాలూ, ఆకుకూరలు, తాజాపండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో కొవ్వులు బాగా తక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇందుకోసం మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవడంతోపాటు అందులోనూ.... కొవ్వు మోతాదులు తక్కువగా ఉండే చికెన్, చేపల వంటి వైట్ మీట్‌ను మాత్రమే తీసుకోవాలి.
వేటమాంసం, రెడ్‌మీట్‌నుంచి దూరంగా ఉండాలి. మంచి ఆరోగ్యకరమైన విసర్జక అలవాట్లు కలిగి ఉండాలి. అంటే రోజూ ఒకేవేళకు మల విసర్జనకు వెళ్లడం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ లేకుండా చూసుకోవడం లాంటివి. మలవిసర్జన సాఫీగా జరగాలంటే దేహానికి తగినంత శారీరక శ్రమ, వ్యాయామం ఉండాలి. పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
(చదవండి: పాజిటివ్ పవర్: హీనాఖాన్ ధైర్యానికి ఎవ్వరైన ఫిదా కావాల్సిందే..! )
Comments
Please login to add a commentAdd a comment