బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి జెన్‌మనీ | ZenMoney ventures into insurance broking services | Sakshi
Sakshi News home page

బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి జెన్‌మనీ

Mar 28 2014 1:33 AM | Updated on Sep 2 2017 5:15 AM

బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి జెన్‌మనీ

బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి జెన్‌మనీ

బ్రోకింగ్‌సహా పలు ఆర్థిక సేవల రంగంలో ఉన్న జెన్‌మనీ తాజాగా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది.

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకింగ్‌సహా పలు ఆర్థిక సేవల రంగంలో ఉన్న జెన్‌మనీ తాజాగా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం జెన్‌మనీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్లు జెన్‌మనీ మేనేజింగ్ డెరైక్టర్ ప్రతాప్ కంతేటి తెలిపారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో బీమా బ్రోకింగ్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవిత, సాధారణ బీమా రంగంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన పాలసీలు విక్రయించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

అధిక కమీషన్ల కోసం ఆశపడకుండా ఖాతాదారులకు అవసరమైన పాలసీలను మాత్రమే అందిస్తామని, ముఖ్యంగా టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాలపై అధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. బీమా రంగంలో విస్తరణకు ఇంకా చాలా అవకాశాలున్నాయని, వచ్చే మూడేళ్ళలో మొత్తం ఆదాయంలో 50 శాతం బీమా బ్రోకింగ్ నుంచే వచ్చే విధంగా చేయాలన్నదే తమ లక్ష్యమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి తెలిపారు. గత ఆరు నెలల నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెరిగాయని, అలాగే రాష్ట్ర విభజన పూర్తి కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విచారణలు మొదలైనట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement