ప్రొడక్ట్ బిజినెస్‌ను విడదీసిన పొలారిస్ | Polaris Financial Technology shares up 15 per cent on demerger of products business | Sakshi
Sakshi News home page

ప్రొడక్ట్ బిజినెస్‌ను విడదీసిన పొలారిస్

Published Wed, Mar 19 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM

Polaris Financial Technology shares up 15 per cent on demerger of products business

 న్యూఢిల్లీ: ప్రొడక్ట్ బిజినెస్‌ను విడదీసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ పొలారిస్ ఫైనాన్షియల్ టెక్నాలజీ వెల్లడించింది. తద్వారా తదుపరి దశ వృద్ధిని అందుకోలగమని భావిస్తున్నట్లు తెలిపింది. అన్ని అనుమతులూ లభిం చాక ప్రొడక్ట్ విభాగాన్ని ‘ఇంటలెక్ట్ డిజైన్ ఏరీనా’గా పిలవనున్నట్లు పేర్కొంది. గ్లోబల్ యూనివర్సల్ బ్యాంకింగ్, రిస్క్ అండ్ ట్రెజరీ మేనేజ్‌మెంట్, గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లు ఇంటలెక్ట్‌లో భాగంగా ఉంటాయని వివరించింది. ఈ చర్య కస్టమర్లు, ఉద్యోగులతోపాటు, ఇన్వెస్టర్లకు కూడా లబ్దిని చేకూర్చగలదని పొలారిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అరుణ్ జైన్ పేర్కొన్నారు. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో పొలారిస్ షేరు దాదాపు 12% దూసుకెళ్లి రూ. 153 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement