పల్లీలు లేదా వేరుశెనగలో ప్రోటీన్‌లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తాయి. బరువు కూడా తగ్గుతారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివైనప్పటికీ.. కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయిని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ వేరుశెనగ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అలాంటప్పుడూ దీన్ని తినొచ్చా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంత వరకు మంచిది? ఆరోగ్య నిపుణులేమంటున్నారు తదితరాల గురించే ఈ కథనం!.
భారతదేశంలో ప్రజలు వేరుశెనగ కాయల్ని వేయించి లేదా ఉకడబెట్టి కచ్చితంగా తీసుకుంటారు. కాలక్షేపం కోసం లేదా స్నాక్స్ మాదిరిగానైన తమ ఆహారంలో వీటిని తప్పనిసరిగా భాగం చేసుకుంటారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) తక్కువుగా ఉండి, ప్రోటీన్‌లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పు, జీడిపప్పు వంటి ఖరీదైన నట్స్ తినలేకపోయిన కనీసం వేరుశెనగకాయలను కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుని మరీ తింటారు. అలాంటి వేరుశెనగ తింటే కొన్ని ప్రయోజనాల తోపాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముందుగా దీని వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యంగా..ఈ పల్లీలు డయాబెటిస్ పేషంట్లకు మంచి ఆహారం అని ధీమాగా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు.
ఎలా అంటే..?
ఇవి తింటే టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుందనేది నిజమే! రక్తంలోని చక్కెరని ప్రభావితం చేసి ఇన్సులిన్ పెరగకుండా చేస్తుంది. తత్ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవని అంటున్నారు. ఈ వేరుశెనగలో ఉండే గ్లూకోజ్ ఇండెక్స్(జీఐ) విలువ 13 ఉంటుంది. అందువల్ల చక్కెర కచ్చితంగా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు ఉదయాన్నే వేరుశెనగ లేదా సంబంధిత ఉత్పత్తులను తినడం వల్ల రోజంతా రక్తంలోని చక్కెరని స్థాయిని పెరగకుండా నియంత్రిస్తుంది. ఒక వేళ అధిక జీఐ స్థాయిలున్నా ఆహారాన్ని తిన్నప్పుడూ.. తప్పనిసరిగా ఈ వేరుశెనగను కూడా ఆహారంలో జతచేస్తే శరీరంలో గ్లూకోజ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
ఇది చక్కెర స్థాయిని తగ్గించడాని ప్రధాన కారణం దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే మెగ్నీషియమే. ఈ వేరుశెనగలో సుమారు 12% మెగ్నీషియం ఉంటుంది. ఇది గ్లూకోజ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే దీనిలో అసంతృప్త కొవ్వులు, ఇతర పోషకాలు అధికంగా ఉన్నందున ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక శరీర సామర్థ్యాన్ని పెంచేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయిని అధ్యయనంలో వెల్లడైంది.
సంభవించే ప్రమాదాలు..
- ఇందులో అధికంగా ఉండే ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు వల్ల శరీరంలో కొన్ని రకాల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
- ఈ ఒమెగా వల్లే మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు తన పరిశోధనలో తేలిందన్నారు.
- మార్కెట్లో వేరుశెనగలు వేయించి ఉప్పు, పంచదార కలి ఉంటాయి. ఇలాంటవైతే మరితం ప్రమాదమని చెబుతున్నారు.
- అంతేగాక దీనిలో అధికంగా ఉండే క్యాలరీలు కారణంగా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏదీఏమైనా ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనా దాన్ని తగు మోతాదులో తినడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు
(చదవండి: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు)
Comments
Please login to add a commentAdd a comment