peanuts
-
ఇంట్లోనే పీనట్ బటర్ తయారు చేసుకోండిలా..
పీనట్ బటర్ తయారీకి కావల్సినవి పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ విధానమిలా: స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే పీనట్ బటర్ రెడీ. దీన్ని చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది. -
పల్లీలు తినడం ప్రమాదమా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
పల్లీలు లేదా వేరుశెనగలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని నివారిస్తాయి. బరువు కూడా తగ్గుతారు. అయితే ఇవి ఆరోగ్యానికి మంచివైనప్పటికీ.. కొన్ని దుష్పరిణామాలు ఉన్నాయిని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఈ వేరుశెనగ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అలాగే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అలాంటప్పుడూ దీన్ని తినొచ్చా? మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంత వరకు మంచిది? ఆరోగ్య నిపుణులేమంటున్నారు తదితరాల గురించే ఈ కథనం!. భారతదేశంలో ప్రజలు వేరుశెనగ కాయల్ని వేయించి లేదా ఉకడబెట్టి కచ్చితంగా తీసుకుంటారు. కాలక్షేపం కోసం లేదా స్నాక్స్ మాదిరిగానైన తమ ఆహారంలో వీటిని తప్పనిసరిగా భాగం చేసుకుంటారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) తక్కువుగా ఉండి, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పు, జీడిపప్పు వంటి ఖరీదైన నట్స్ తినలేకపోయిన కనీసం వేరుశెనగకాయలను కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుని మరీ తింటారు. అలాంటి వేరుశెనగ తింటే కొన్ని ప్రయోజనాల తోపాటు ప్రమాదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ముందుగా దీని వల్ల కలిగే ప్రయోజనాల్లో ముఖ్యంగా..ఈ పల్లీలు డయాబెటిస్ పేషంట్లకు మంచి ఆహారం అని ధీమాగా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు. ఎలా అంటే..? ఇవి తింటే టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుందనేది నిజమే! రక్తంలోని చక్కెరని ప్రభావితం చేసి ఇన్సులిన్ పెరగకుండా చేస్తుంది. తత్ఫలితంగా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవని అంటున్నారు. ఈ వేరుశెనగలో ఉండే గ్లూకోజ్ ఇండెక్స్(జీఐ) విలువ 13 ఉంటుంది. అందువల్ల చక్కెర కచ్చితంగా అదుపులో ఉంటుందని చెబుతున్నారు. అంతేగాదు ఉదయాన్నే వేరుశెనగ లేదా సంబంధిత ఉత్పత్తులను తినడం వల్ల రోజంతా రక్తంలోని చక్కెరని స్థాయిని పెరగకుండా నియంత్రిస్తుంది. ఒక వేళ అధిక జీఐ స్థాయిలున్నా ఆహారాన్ని తిన్నప్పుడూ.. తప్పనిసరిగా ఈ వేరుశెనగను కూడా ఆహారంలో జతచేస్తే శరీరంలో గ్లూకోజ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది చక్కెర స్థాయిని తగ్గించడాని ప్రధాన కారణం దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే మెగ్నీషియమే. ఈ వేరుశెనగలో సుమారు 12% మెగ్నీషియం ఉంటుంది. ఇది గ్లూకోజ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే దీనిలో అసంతృప్త కొవ్వులు, ఇతర పోషకాలు అధికంగా ఉన్నందున ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడమే గాక శరీర సామర్థ్యాన్ని పెంచేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయిని అధ్యయనంలో వెల్లడైంది. సంభవించే ప్రమాదాలు.. ఇందులో అధికంగా ఉండే ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు వల్ల శరీరంలో కొన్ని రకాల అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ ఒమెగా వల్లే మధుమేహం, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా ఉన్నట్లు తన పరిశోధనలో తేలిందన్నారు. మార్కెట్లో వేరుశెనగలు వేయించి ఉప్పు, పంచదార కలి ఉంటాయి. ఇలాంటవైతే మరితం ప్రమాదమని చెబుతున్నారు. అంతేగాక దీనిలో అధికంగా ఉండే క్యాలరీలు కారణంగా చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏదీఏమైనా ఆరోగ్యానికి ఎంత మేలు చేసేదైనా దాన్ని తగు మోతాదులో తినడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు (చదవండి: మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..చిన్నారులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు) -
Kacha Badam Singer: కచ్చా బాదామ్ సింగర్‌కు యాక్సిడెంట్
కచ్చా బాదామ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌తో విపరీతంగా ఆదించారు.. ఇంకా ఆదరిస్తున్నారు జనాలు. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పల్లీల వ్యాపారి జీవితమే మారిపోయింది. అయితే.. తాజాగా ఈ వైరల్ సెన్సేషన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ బద్యాకర్. కచ్చా బాదామ్ పాటతో క్రేజ్‌తో పాటు అవతారమే పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యునరేషన్‌తో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాడు. సోమవారం స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు అతను. ఛాతీలో బలమైన గాయం కావడంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం భూబన్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఇక ‘కచ్చా బాదామ్’ భూబన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్‌స్టా రీల్స్‌తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది. మొదట్లో సాంగ్ వైరల్ అయినప్పుడు.. తనకు క్రెడిట్ దక్కలేదని గోల చేసిన భూబన్, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు. ఇకపై పల్లీలు అమ్ముకోనని, సింగింగ్ కెరీర్లోనే కొనసాగుతానని, ఈ క్రేజ్ కారణంగా తనను కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందంటూ భూబన్ పోలీసులను సైతం ఆశ్రయించాడు. ఆ బిల్డప్ చూసి అప్పటిదాకా అతన్ని మెచ్చుకున్న వాళ్లే.. తిట్టకున్నారు కూడా. తాజాగా కోల్‌కతాలోని ఓ పోష్ క్లబ్లో అతగాడు రాక్‌స్టార్ అవతారంలో ప్రదర్శన కూడా ఇవ్వడం చూసి ముక్కున వేలేసుకున్నారు చాలామంది. సంబంధిత వార్త: కచ్చా బాదామ్ అంటూ ఊపేసిన పోరి గురించి తెలుసా? -
ఇక్రిశాట్లో ఆసక్తికర ఘటన.. శనగకాయలు తిన్న ప్రధాని మోదీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి, రామచంద్రాపురం: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత శాస్త్రవేత్తలతో మాట్లాడారు. ఇక్రిశాట్ పరిశోధనల పురోగతిని వారు ప్రధానికి వివరించారు. సజ్జ, కంది, శనగ, వేరుశనగ, ఇతర చిరుధాన్యాలు, విత్తన రకాలు, నాణ్యతపై ప్రధాని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంట క్షేత్రాలను పరిశీలించారు. అక్కడ సాగవుతున్న శనగ పంటను చూసి కాయలను కోసుకొని రుచి చూశారు. స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. చదవండి: 20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర రూ.100 మాత్రమే! -
పర్సు మర్చిపోయిన మోహన్.. శనక్కాయల సత్తియ్య... ఎక్కడున్నావ్...!
ఆ చిన్న పిల్లల పట్ల ఆ పేదోడు చూపించిన ‘పెద్ద మనస్సు’ 12 ఏళ్ళు గడిచినా సజీవంగా నిలిచింది. చేసేది చిరువ్యాపారమైనా చిన్నారులను చూసి ఆత్మీయతకనబరిచిన అతని తీరుకు ముగ్థుడైన ఓ ఎన్ఆర్ఐ దశాబ్ధాం తరువాత సదరు చిరువ్యాపారి కుటుంబాన్ని వెతికిపట్టుకుని రూ.25వేలు బహుమానంగా ఇచ్చి తన విజ్ఞతను, ఔదార్యాన్ని చాటుకున్నారు. సాక్షి, కాకినాడ: గింజాల పెదసత్తియ్య కాకినాడ బీచ్‌లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. అమెరికాలో స్థిరపడ్డ మోహన్ నేమాని తన పిల్లలతో 2010లో కాకినాడ బీచ్‌కు వెళ్ళారు. అక్కడ పిల్లలు అడగడంతో శనక్కాయలు కొనిచ్చారు. తీరా డబ్బులు ఇచ్చే సమయానికి పర్సు మర్చిపోయిన విషయాన్ని మోహన్ గుర్తించారు. విషయాన్ని గమనించిన పెదసత్తియ్య... పర్వాలేదు సార్, పిల్లలే కదా మరోసారి వచ్చినప్పుడు ఇద్దరుగాని లెండి అంటూ పంపించేశాడు. ఆ తరువాత మోహన్‌కుటుంబం అమెరికా వెళ్ళిపోయింది. అయితే మోహన్‌కుమారుడు ప్రణవ్ బీచ్‌రోడ్డులో ‘శనక్కాయల’ జ్ఞాపకాన్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు తండ్రికి గుర్తుచేస్తూ సదరు చిరువ్యాపారి సత్తియ్యతో దిగిన ఫొటోను అలాగే జ్ఞాపకంగా ఉంచుకున్నారు. పెదసత్తియ్య కుటుంబానికి సహాయం అందిస్తున్న ప్రణవ్, అతని సోదరి సుచిత 12 ఏళ్ళ తరువాత... సదరు చిరువ్యాపారికి ఎంతోకొంత సొమ్ము ఇవ్వాలనుకున్నా అతడు ఎక్కడున్నాడో మోహన్ నేమానికి ఆచూకీ చిక్కలేదు. దీంతో తనకు బాగాప రిచయుస్తులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకురాగా, అతని కుటుంబం నాగులాపల్లిలో ఉంటుందని, రెండేళ్ళ క్రితమే సత్తియ్య చనిపోయాడని తెలుసుకున్నారు. సోంతూరుకు వచ్చిన మోహన్‌నేమాని కుటుంబం గురువారం అతని భార్య గంగ, ఇద్దరు పిల్లలను పిలిపించి నాటి విషయాన్ని జ్జాప్తికి తెచ్చారు. ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం వద్ద పెదసత్తియ్య కుటుంబం సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సమక్షంలో ఆయన నివాసం వద్ద రూ.25వేలు బహుమానంగా ఇచ్చారు. మోహన్కుటుంబాన్ని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అభినందించారు. మోహన్ నేమాని మాట్లాడుతూ తరచూ తన కుమారుడు ప్రణవ్ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుని కాకినాడ వెళ్ళినప్పుడు అతనికి కొంత సొమ్ము ఇద్దామని చెప్పేవాడని, ఈ క్రమంలోనే సొమ్ము అందజేశామని తెలిపారు. -
ఒకటి, రెండు కాదు..శనగ వయసు ఏకంగా 12,600 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: భారత్‌తో పాటు దాదాపు 50 దేశాల్లో విరివిగా వాడే శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తయింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు కలసి నిర్వహించిన ప్రాజెక్టు ఫలితంగా సంపూర్ణ జన్యుక్రమం సిద్ధమైంది. దీంతో అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి మార్గం సుగమైంది. ఇక్రిశాట్ 2013లో ‘కాబూలీ చనా’అని పిలిచే ఒక రకం శనగల జన్యుక్రమాన్ని విజయవంతంగా నమోదు చేసింది. చదవండి: Stress Relief:: నువ్వులు.. గుడ్లు.. శనగలు..షెల్ఫిష్! అయితే మరిన్ని రకాల జన్యుక్రమాలను కూడా నమోదు చేయడం ద్వారా శనగల పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 3,366 శనగ రకాలను ఎంపిక చేసి వాటన్నింటి జన్యుక్రమాలను నమోదు చేసి, విశ్లేషణ జరిపింది. ఫలితంగా శనగల్లో దాదాపు 29,870 జన్యువులు ఉంటాయని స్పష్టం కాగా ఇందులో 1,582 జన్యువులను మొదటిసారి గుర్తించారు. చదవండి: ఇక్రిశాట్ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా.. మధ్యధరా ప్రాంతంలో పుట్టుక.. ‘సిసెర్ రెటిక్యులాటమ్’అనే అడవిజాతి మొక్క నుంచి దాదాపు 12,600 ఏళ్ల కింద శనగలు పుట్టుకొచ్చాయని ఇక్రిశాట్ సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా తేలింది. ఫర్టైల్ క్రెసెంట్‌గా పిలిచే ప్రస్తుత ఇజ్రాయెల్, ఇరాక్, సిరియా ప్రాంతంలో పుట్టిన ఈ పంట కాలక్రమంలో టర్కీ మీదుగా మధ్యధరా ప్రాంతానికి, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు రెండు మార్గాల్లో విస్తరించింది. ప్రయోజనాలేమిటి? శనగల సంపూర్ణ జన్యుక్రమం నమోదు కారణంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ప్రొటీన్ వనరుగా శనగల కోసం డిమాండ్ పెరగనుంది. వేర్వేరు రకాల జన్యుక్రమాలను ఈ సంపూర్ణ జన్యుక్రమంతో పోల్చి చూడటం ద్వారా పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతున్న జన్యువులను గుర్తించడం సులువు కానుంది. చెడు జన్యువులను తగ్గించి.. మంచి జన్యువుల పనితీరును మెరుగుపరిస్తే మంచి లక్షణాలున్న శనగల వంగడాలను అభివృద్ధి చేయొచ్చు. మంచి జన్యువులను చొప్పిస్తే కొత్త వంగడాల్లో వచ్చే తేడాను కంప్యూటర్ మోడలింగ్ ద్వారా పరిశీలించారు. దీని ప్రకారం శనగల దిగుబడికి కొలమానంగా చూసే వంద విత్తనాల బరువు 12 నుంచి 23 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పుష్టికరంగా మార్చేందుకు ‘శనగ పంట దిగుబడిని పెంచేందుకు మాత్రమే కాదు. శనగలను మరింత పుష్టికరంగా మార్చేందుకు ఈ సంపూర్ణ జన్యుక్రమం చాలా ఉపయోగపడుతుంది.’ – ప్రొఫెసర్ రాజీవ్ వార్ష్నీ, రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇక్రిశాట్ పరిశోధనలు కొనసాగిస్తాం ‘దశాబ్ద కాలంలో శనగలకు సంబంధించిన పలు జన్యుపరమైన వనరులను ఇక్రిశాట్ అందుబాటులోకి తెచ్చింది. రైతులు, వినియోగదారులు, దేశాలకు ఎంతో ప్రయోజనకరమైన శనగ పరిశోధనలను కొనసాగిస్తాం’. –డాక్టర్ జాక్వెలీన్ హ్యూగ్స్, డైరెక్టర్ జనరల్, ఇక్రిశాట్ -
నూతన శనగ విత్తనం విడుదల
నంద్యాల అర్బన్: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి బుధవారం నూతన శనగ రకం విడుదలైంది. మంగళవారం అఖిల భారత శనగ సమన్వయ పథకం కాన్పూర్ వారు నిర్వహించిన పప్పు దినుసుల వార్షిక సమావేశంలో నంద్యాల గ్రామ్ (ఎన్‌బీఈజీ) 857 దేశవాళి శనగ రకాన్ని నిర్ధారించారు. పరిశోధన స్థానం సహ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రధాన శాస్త్రవేత్త వీరజయలక్ష్మి ఈ రకంపై పరిశోధనలు జరిపారు. అధిక దిగుబడులనిస్తూ పురుగులు, తెగుళ్లను తట్టుకొనే కొత్త నంద్యాల గ్రామ్ 857 దేశవాళీ రకాన్ని అభివృద్ధి చేశారు. పంట కాలం 95 నుంచి 100 రోజులు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో సాగుకు అనుకూలమైనదని ప్రధాన శాస్త్రవేత్త వీరజయలక్ష్మి తెలిపారు. -
పల్లీల్లో పచ్చనోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు సీఐఎస్ఎఫ్ బలగాలు బుధవారం చెప్పాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్–3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి. అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ ప్యాకెట్లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు. -
మైమిర్చి తినండి
వంటలో ఈ మంట లేకపోతే రుచి ఉండదు. ఘాటు నషాళానికి అంటితే తప్ప తృప్తి కలగదు. కారం భోజనానికి అలంకారం. పచ్చి మిర్చిది అందులో ప్రథమ భాగం. సాధారణంగా మిరపకాయను ఒక కాయగూరగా చూడరు. చూస్తే ఇన్ని వండచ్చు. మైమిరిచి తినొచ్చు. షాహీ హరీ మిర్చి కావలసినవి: పచ్చి మిర్చి – 8 (పెద్దవి); వేయించిన పల్లీలు – అర కప్పు; వేయించిన నువ్వులు – పావు కప్పు; వేయించిన కొబ్బరి ముక్కలు – అర కప్పు; నూనె – పావు కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; పచ్చి మిర్చి – 3; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం ముద్ద – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 కప్పులు; పెరుగు – ఒక కప్పు; చింత పండు గుజ్జు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – చిన్న కట్ట. తయారీ: ►పచ్చి మిర్చిని మధ్యకు చీల్చి పక్కన ఉంచాలి ►వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, వేయించిన కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక మిరప కాయలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద మరొక బాణలిలో పావు కప్పు నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాక, పసుపు, మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి, తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని జత చేసి కలియబెట్టాలి ►ఉప్పు, మూడు కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి ఉడికించాలి ►కొద్దిగా చిక్కబడిన తరవాత, కప్పు పెరుగు జత చేసి రెండు నిమిషాల పాటు మూత ఉంచి ఉడికించాలి ►చింతపండు గుజ్జు, బెల్లం పొడి, కొత్తిమీర తరుగు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►మిశ్రమం చిక్కబడుతుండగా, వేయించి పెట్టుకున్న మిర్చి జత చేసి, కలియబెట్టి మరోమారు మూత ఉంచాలి ►సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాక, ఒక ప్లేటులోకి తీసుకోవాలి. గ్రీన్ చిల్లీ వెజిటబుల్ రెసిపీ కావలసినవి: పచ్చి మిర్చి – 200 గ్రా.; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – అర టేబుల్ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; సోంపు పొడి – అర టేబుల్ స్పూను; ధనియాల పొడి – అర టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; పంచదార – అర టీ స్పూను తయారీ: ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►పచ్చి మిర్చి తరుగు జత చేసి వేయించాలి ►పసుపు, ఉప్పు, మిరప కారం, సోంపు పొడి, ధనియాల పొడి జత చేసి బాగా కలిపి, ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిందనిపించాక నిమ్మ రసం, పంచదార జత చేసి, మరో రెండు నిమిషాల పాటు ఉడికించి, దింపేయాలి ►వేడి వేడి చపాతీలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మిర్చి – సెనగ పిండి కూర కావలసినవి: లేత పసుపు రంగులో ఉండే పచ్చి మిర్చి తరుగు – అర కప్పు; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు; ముదురు ఆకు పచ్చ రంగు పచ్చి మిర్చి తరుగు – పావు కప్పు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన అల్లం ముక్కలు – అలంకరించడానికి తగినన్ని. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి తరుగులు జత చేసి బాగా వేయించాలి ►లేత రంగు పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలియబెట్టాక, ముదురు రంగు పచ్చి మిర్చి తరుగు వేసి మరోమారు కలపాలి ►సోయా గ్రాన్యూల్స్, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ►మిగిలిన నూనె, సెనగ పిండి వేసి బాగా కలిపాక, ఆమ్చూర్ పొడి వేసి కలిపి, మూత ఉంచాలి ►సెనగ పిండి గోధుమరంగులోకి వచ్చిన తరువాత దింపేసి, ఒక ప్లేట్లోకి తీసుకుని, అల్లం ముక్కలతో అలంకరించాలి ►అన్నంలోకి, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ పచ్చిమిర్చి కూర కావలసినవి: పచ్చిమిర్చి – 7 (పెద్దవి); జీలకర్ర – 4 టీ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – రెండు టీ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి ►మిరప కారం, ఆమ్ చూర్ పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు జత చేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి ప్లేటులోకి తీసుకోవాలి ►పచ్చిమిర్చికి ఒక వైపు గాట్లు పెట్టాలి ∙గింజలు వేరు చేయాలి ►తయారుచేసి ఉంచుకున్న పొడిని అందులో స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారు చేసి ఉంచుకున్న పచ్చి మిర్చిని అందులో వేసి వేయించి, మూత ఉంచాలి ►కాయలు బాగా మెత్తగా వడలినట్లు అయ్యేవరకు నూనెలో వేయించాలి ►నిమ్మ రసం జ చేసి దింపేయాలి ►రోటీలలోకి, అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది. రాజస్థానీ మలై మిర్చి కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; నూనె – 2 టేబుల్ స్పూన్లు; తాజా క్రీమ్ – 100 గ్రా.; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను. తయారీ: ►పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, తడి ఆరాక, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక జీలకర్ర, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి, ఉప్పు, పసుపు, వేసి దోరగా వేయించాలి ►తరిగిన పచ్చి మిర్చి ముక్కలు జత చేసి బాగా వేయించి, మూత పెట్టాలి ►క్రీమ్ వేసి బాగా కలియబెట్టి, బాగా ఉడికిన తరవాత దింపేయాలి ►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది. గ్రీన్ చిల్లీ సాస్ కావలసినవి: పచ్చి మిర్చి – 100 గ్రా.; అల్లం తరుగు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – చిటికెడు; అజినమోటో – 2 టీ స్పూన్లు; వైట్ వెనిగర్ – 4 టేబుల్ స్పూన్లు; కార్న్‌ఫ్లోర్ – 2 టీ స్పూన్లు. తయారీ: ►పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►మిక్సీలో... వెల్లుల్లి తరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తగినన్ని నీరు పోసి మెత్తగా చేసి, ఒక కుకర్లోకి తీసుకుని, స్టౌ మీద ఉంచి, ఈ మిశ్రమానికి చిటికెడు ఉప్పు జతచేసి మూత పెట్టి, మీడియం మంట మీద ఉంచి, రెండు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►విజిల్ తీసి పచ్చిమిర్చిని చల్లారబెట్టాలి ∙రెండు చిటికెల అజినమోటో జత చేయాలి ►4 టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ జత చేయాలి ►మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►రెండు టీ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ తీసుకుని, నీళ్లలో కలిపి, ఉడుకుతున్న సాస్‌లో వేయాలి ∙బాగా ఉడికిన తరవాత, స్టౌ మీద నుంచి దింపేసి చల్లారనివ్వాలి ►బాగా చల్లారాక ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. పచ్చి మిర్చి ఊరగాయ కావలసినవి: పచ్చి మిర్చి – అర కేజీ; మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – 100 గ్రా.; ఇంగువ – ఒక టేబుల్ స్పూను; నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ►తొడిమలు వేరు చేసి, పచ్చి మిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద బాణలిలో ఒక టీ స్పూను నూనె వేసి కాగాక, ఆవాలు, మెంతులు వేసి సన్నని మంట మీద దోరగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారబెట్టాక, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పాత్రలో మిరప కారం, మెత్తగా చేసిన ఆవపొడి, మెంతి పొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టాలి ►తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను అందులో వేసి కలియబెట్టాలి ►కాచి చల్లారబెట్టిన నూనె, నిమ్మరసం రెండూ ఒకదాని తరవాత ఒకటి ఇందులో పోస్తూ, కలుపుతుండాలి ►ఒక గంట తరవాత ఈ మిశ్రమాన్ని గాలిచొరని జాడీలోకి తీసుకోవాలి ►ఈ ఊరగాయ సుమారు పదిరోజుల వరకు నిల్వ ఉంటుంది. (నూనె పైకి తేలుతూంటే, ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది). -
యూరప్‌కు తెలంగాణ వేరుశనగ విత్తనాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి యూరప్‌కు వేరుశనగ విత్తనాలు ఎగుమతి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జర్మనీ – నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో వేరుశనగ దిగుమతిదారులు, కూరగాయల విత్తనోత్పత్తి చేసే కంపెనీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..దేశంలోనే వేరుశనగ ఉత్పత్తిలో ఉమ్మడి పాలమూరుది ప్రథమస్థానమని, గత మూడేళ్లుగా దేశంలో వేరుశనగ ఉత్పత్తిలో రికార్డు సాధిస్తున్నామని తెలిపారు. నెదర్లాండ్స్‌లో అధిక వినియోగం నెదర్లాండ్స్‌లో వేరుశనగ వాడకం అధికమని, ఆ దేశానికి ఆస్ట్రేలియా నుంచి అధికంగా దిగుమతి అవుతుందన్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వేరుశనగ ముంబయి, ఢిల్లీల్లో ఉండే దళారులు, మధ్యవర్తుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. దీంతో రైతుకు సరైన లాభం రావడం లేదన్నారు. ఇలా కాకుండా నేరుగా విదేశాలకు వేరుశనగ ఎగుమతి చేస్తామన్నారు. వేరుశనగను యూరోపియన్ యూనియన్ దేశాలు, ఇండోనేసియా, కెనడా, సింగపూర్, మలేసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. డిసెంబరులో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సందర్శించి వేరుశనగ ఉత్పత్తికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ తో సమావేశం అవుతామని నెదర్లాండ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
పల్లీ ఫుల్ బెల్లీ ఫుల్
చెనక్కాయలన్నా, పల్లీలన్నా ప్రాణం లేచివస్తుంది అందరికీ. ఉడకబెట్టి తినడం, వేయించి పంటి కింద పటపటలాడించడమూ మామూలే! ఇక్కడ చూడండి. గోంగూరని పల్లీలతో మిక్స్ చేయండి. పల్లీలతో మురుకులు ఎలా చేయొచ్చో చూడండి. పల్లీతో పచ్చిపులుసు చేయండి. నాలుగు టొమాటోలు వేసి పచ్చడి నూరండి.ఇది వానల సమయం.వేడివేడి అన్నంలోకి లేదా వేడివేడి చిరుతిండి గానూ ఇవి వెంటనే ట్రై చేయండి. పీనట్ బటర్ కావలసినవి: పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ∙ఈ బటర్ చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది. పల్లీ గోంగూర పచ్చడి కావలసినవి: గోంగూర ఆకులు – మూడు కట్టలు; పల్లీలు – ఒక కప్పు; ఎండు మిర్చి – 10; ధనియాలు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 4; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; చింతపండు – నిమ్మకాయంత; పచ్చి మిర్చి – 4; నూనె – రెండు టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఎండు మిర్చి, ధనియాలు వేసి వేయించాలి ∙వెల్లుల్లి రేకలు, పల్లీలు వేసి పల్లీల పచ్చి వాసన పోయేవరకు బాగా వేయించాలి ∙ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి మిర్చి వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఆ బాణలిలోనే మరి కాస్త నూనె వేసి కాగాక గోంగూర ఆకులు వేసి వేయించాలి కొద్దిగా వేగాక చింతపండు జత చేసి మరోమారు వేయించాలి ∙ఆకు బాగా మెత్తబడ్డాక దింపి చల్లార్చాలి ∙మిక్సీలో పల్లీలు వేసి మెత్తగా చేయాలి ∙పచ్చి మిర్చి, గోంగూర, ఉప్పు జత చేసి మెత్తగా మిక్సీ పట్టాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించి, తయారుచేసి ఉంచుకున్న పచ్చడికి జతచేయాలి. పల్లీ మురుకులు కావలసినవి: బియ్యప్పిండి – 4 కప్పులు; పల్లీల పొడి – ఒక కప్పు; నువ్వులు – 3 టీ స్పూన్లు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, పల్లీల పొడి, నువ్వుల పొడి, మిరప కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి ∙2 టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె జత చేయాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ మురుకుల పిండిలా కలుపుకోవాలి ∙మురుకుల మౌల్డ్‌కి నూనె పూయాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుని మౌల్డ్‌లో ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పిండిని మురుకులాగ నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిదే. బీరకాయ పల్లీల కూర కావలసినవి: వేయించిన పల్లీలు – పావు కప్పు; పచ్చికొబ్బరి ముక్కలు – పావు కప్పు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; బీరకాయలు – అర కిలో. తయారీ: ∙బీరకాయల చెక్కు తీసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి ∙మిక్సీలో పల్లీలు, కొబ్బరి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙కరివేపాకు, పసుపు జత చేసి వేయించాలి ∙ఇంగువ, ఉల్లి తరుగు జత చేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙ధనియాల పొడి, మిరప కారం, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు వేసి మసాలా వేగేవరకు ఉంచాలి ∙బీరకాయ ముక్కలు వేసి బాగా కలిపి, కప్పుడు నీళ్లు పోసి మరోమారు బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి ∙మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి, మూత పెట్టి ఉడికించాలి ∙నూనె పైకి తేలాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి. పీనట్ బటర్ కావలసినవి: పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను; పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ∙ఈ బటర్ చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది. పల్లీ రైస్ కావలసినవి: అన్నం – రెండు కప్పులు; పల్లీలు – 6 టీ స్పూన్లు; నువ్వులు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; జీడిపప్పులు – 10; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఎండు మిర్చి – 7; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙నాలుగు స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి ∙పల్లీలు సగం వేగాక మినప్పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ∙నువ్వులు వేసి సన్న మంట మీద చిటపటలాడేవరకు వేయించి దింపేయాలి ∙కొబ్బరి తురుము వేసి వేయించి చల్లారాక, మిక్సీ జార్లో వేసి, కొంచెం పలుకులుపలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, రెండు టీస్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి ∙జీడిపప్పు వేసి రంగు మారేవరకు వేయించాక, కరివేపాకు వేసి వేయించాలి ∙చల్లారబెట్టుకున్న అన్నం వేసి, ఆ పైన మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి వేయాలి ∙ఉప్పు కూడా వేసి బాగా కలియబెట్టాలి ∙నిమ్మ రసం, కొత్తిమీర వేసి మరోమారు కలిపి తింటే రుచిగా ఉంటుంది ∙తక్కువ టైమ్‌లో ఎంతో రుచిగా తయారయ్యే ఈ వంటకాన్ని పిల్లలకు లంచ్ బాక్స్‌లో పెడితే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. పల్లీల పచ్చి పులుసు కావలసినవి: చింతపండు పులుసు – ఒక కప్పు; వేయించిన పల్లీలు – 2 టీ స్పూన్లు; ఉల్లి తరుగు – పావు కప్పు; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; వేయించిన నువ్వులు – – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙ముందుగా మిక్సీలో పల్లీలు, నువ్వులు, ఎండు మిర్చి, సగం ఉల్లి తరుగు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి ∙కొద్దిగా చింతపండు రసం జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని చింతపండు రసంలో వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ∙జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ∙మిగిలిన ఉల్లి తరుగు వేసి మెత్తబడేవరకు వేయించాలి ∙పసుపు జత చేయాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙తయారుచేసి ఉంచుకున్న పల్లీ మిశ్రమాన్ని వేసి కలిపి, కప్పుడు నీళ్లు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమషాల పాటు సన్నటి మంట మీద ఉడికించి దింపేయాలి. పల్లీ టొమాటో ఉల్లి చట్నీ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 3; పల్లీలు – అర కప్పు; వెల్లుల్లి రేకలు – 6; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; ఉల్లి తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; చింతపండు రసం – పావు కప్పు; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; మినప్పప్పు – పావు టీ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఎండు మిర్చి, పల్లీలు, వెల్లుల్లి రేకలు వేసి రంగు మారే వరకు వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు జత చేసి దోర గా వేయించాలి ∙టొమాటో తరుగు, ఉప్పు, చింత పండు రసం జత చేసి బాగా కలిపి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించి దింపేసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మినప్పపున్ప, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి దింపేసి, సిద్ధంగా ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ∙ఈ చట్నీ దోసెలలోకి, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. -
మనశ్శాంతి కరువైతే...
సాధారణ జీవితానికి పెద్దగా లోటు లేకపోయినా మనశ్శాంతి కరువవుతుంది కొందరికి. ఫలితంగా నిరంతరం దిగులుగా ఉంటూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఏ పని మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. జీవితంలో ఎదగడానికి ఉపయోగపడే అవకాశాలు వచ్చినా, వాటిని అందిపుచ్చుకోలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి పాటించాల్సిన కొన్ని పరిహారాలు... ► ప్రతిరోజూ ఉదయం స్నానసంధ్యలు ముగించుకున్న తర్వాత స్వహస్తాలతో ఒక రొట్టెను తయారు చేయండి. ఆ రొట్టెను నల్లకుక్కకు తినిపించండి. ఆ తర్వాతే రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించండి. ► మూడంగుళాల పొడవుండే పాదరస శివలింగాన్ని ఇంట్లోని పూజ గదిలో ప్రతిష్ఠించండి. పాదరస లింగానికి ప్రతిరోజూ ధూపదీపాలు సమర్పించి, పంచాక్షరీ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి. ► కోతులు విరివిగా సంచరించే ఆలయానికి మంగళవారం ఉదయంపూట వెళ్లి, అక్కడ ఉండే కోతులకు శనగలు తినిపించండి. ఈ పరిహారాన్ని కనీసం పదహారు వారాలు పాటించాల్సి ఉంటుంది. ►ప్రతిరోజూ రాత్రివేళ చిన్నరాగిపాత్రలో మంచినీటిని నింపి, ఆ నీటిలో కాసిన్ని కృష్ణతులసి దళాలను వేయండి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి నలుమూలలా, ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మిగిలిన నీటిని తీర్థంగా సేవించండి. ►ఏదైనా ఆదివారం రోజున కనీసం ఐదుగురు పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, కలాలు వంటి వçస్తువులను కానుకగా ఇవ్వండి. – పన్యాల జగన్నాథ దాసు -
వేరుశెనగకు డిమాండ్ కొంతే
– ఇప్పటి వరకు పంపిణీ 13065 క్వింటాళ్లు మాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. జిల్లాలో మే 30 నుంచి వేరుశెనగ పంపిణీ చేస్తున్నప్పటికి ఇంతవరకు పంపిణీ అయింది కేవలం 13065 క్వింటాళ్లు మాత్రమే. ఖరీప్ సీజన్ ఈ నెల1వ తేదీతో ప్రారంభమైనా ఇంత వరకు చినుకు జాడ లేకపోవడంతో రైతులు సబ్సిడీ వేరుశనగ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఖరీప్ సీజన్‌కు సంబంధించి రైతులకు సబ్సిడీ వేరుశెనగకు నిర్ణయించిన ధర రూ.7700. ప్రభుత్వం దళారీలకు లబ్ధి చేకూర్చేందుకే ధరను ఇలా నిర్ణయించారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ శాఖ కిలో వేరుశెనగ ధర రూ.77 నిర్ణయించి సబ్సిడీ 40 శాతం ఇచ్చింది. కిలోకు సబ్సిడీ రూ.30.80 ఉండగా రైతులు రూ.46.20 చెల్లించాల్సి ఉంది. మార్కెట్లో వేరుశెనగ క్వింటాం ధర రూ.4000 నుంచి రూ.4500 వరకు ఉంది. మార్కెట్ ధర కంటే సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగ ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ముందుకు రావడం లేదు. మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్, ఆయిల్ఫెడ్లు వేరుశెనగను సరఫరా చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు దళారీలపై ఆధారపడ్డాయి. దీంతో వేరుశెనగ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత లేకపోవడం, ధర ఎక్కువగా ఉండటం, అందులోను వర్షాలు లేకపోవడంతో సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వేరుశెనగకు డిమాండ్ లేకుండా పోయింది. జిల్లాకు వ్యవసాయశాఖ 60,600 క్వింటాళ్లు కేటాయించింది. అయితే 10 వేల క్వింటాళ్లు బఫర్‌లో ఉంచి మిగిలిన 50,600 క్వింటాళ్లను మండలాలకు కేటాయించారు. కర్నూలు, ఆలూరు, మంత్రాలయం సబ్ డివిజన్లలో వేరుశెనగకు డిమాండ్ కనిపించడం లేదు. కాగా పత్తికొండ, ఎమ్మిగనూరుల్లో వేరుశనగ పంపిణీ శనివారం నుంచి మొదలైంది. -
వేరుశెనగ...
గుడ్‌ఫుడ్ వేరుశనక్కాయల్లో ప్రోటీన్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల గింజల్లో 567 క్యాలరీల శక్తి, 25.8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అవి శక్తినివ్వడంలోనూ, గాయాలు మాన్పడంలోనూ బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో కార్పోహైడ్రేట్లు 13 – 16 శాతమే. వంద గ్రాముల్లో 16.1 గ్రాముల పిండిపదార్థాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ రోగులు చిరుతిండిగా నిర్భయంగా తినవచ్చు.100 గ్రాముల్లో 49.2 గ్రాములు కొవ్వుపదార్థాలే. వాటిల్లో మోనో–అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు 24.43 గ్రాములు, పాలీ–అన్‌శాచ్యురేటెడ్ 15.46 గ్రా‘‘, శాచ్యురేటెడ్ కొవ్వులు 6.28 గ్రాములు. కాబట్టి ఇది ప్రధానమైన శక్తివనరు. వీటిల్లో విటమిన్ బి–కాంప్లెక్స్‌లోని ప్రధాన పోషకం బయోటిన్, ఫోలేట్ చాలా ఎక్కువ. గర్భవతులకు మేలుచేస్తాయి. విటమిన్–బి3గా పరిగణించే నియాసిన్ పుష్కలంగా ఉన్నందున ఇది గుండెజబ్బుల ముప్పును నివారిస్తుంది.మ్యాంగనీస్, కాపర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా ఎక్కువ. వాటి కారణంగా మంచి రోగనిరోధక శక్తి లభిస్తుంది. -
సబ్సిడీ శనగల దొంగ దొరికాడు
కోవెలకుంట్ల: గోదాము నుంచి సబ్సిడీ శనగ ప్యాకెట్లను దొంగలించిఽఽన వ్యక్తిని సంజామల పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం సీఐ శ్రీనివాసరెడ్డి నిందితుడు వివరాలను మీడియాకు వివరించారు. సంజామల మండలానికి మంజూరైన సబ్సిడీ శనగ విత్తన ప్యాకెట్లను గ్రామంలోని కో ఆపరేటీవ్ సహకార సంఘ గోదాములో నిల్వ ఉంచారు. గత నెల3వ తేదీ నుంచి అదే నెల 22వ తేదీ వరకు రైతులకు సబ్సిడీ శనగలను పంపిణీ చేశారు. విత్తన పంపిణీ సమయంలో రైతులకు శనగ ప్యాకెట్లను అందజేసేందుకు 20 రోజులపాటు గోదాములో గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య హమాలీగా చేరాడు. హమాలీగా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా తోటి హమాలీలు, గోదాము సిబ్బంది, రైతులు పసిగట్టకుండా గోదాములోని కొన్ని శనగ ప్యాకెట్లను పక్కన దాచిపెట్టి రాత్రి సమయాల్లో ఇంటికి తెచ్చుకునేవాడు. విత్తన పంపిణీ ప్రక్రియ ముగిశాక శనగలకు సంబంధించి రికార్డులు, స్టాక్‌ను పరిశీలించగా 44 శనగ ప్యాకెట్లకు లెక్క తేలకపోవడంతో కో ఆపరేటీవ్ సహకార సంఘం సీఈఓ రవీంద్ర గుప్త హమాలీలను గోదాములకు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ విచారణకు వెంకటసుబ్బయ్య హాజరు కాకపోవడంతో అనుమానం వచ్చి గత నెల 31వ తేదీన సంజామల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విజయభాస్కర్ విచారణకు హాజరుకాని హమాలీ వెంకటసుబ్బయ్య కదలికలపై నిఘా వేశారు. గోదాములో దొంగలించిన శనగ ప్యాకెట్లను హమాలీ ఇదే మండలంలోని కానాల గ్రామానికి చెందిన ఓ రైతుకు రూ. లక్షకు విక్రయించాడు. పోలీస్‌స్టేషన్‌లో హమాలీపై కేసు నమోదు కావడంతో భయాందోళనకు గురైన రైతు శనగలను వెనక్కు తీసుకోవాలని లేకపోతే పోలీసులకు చెబుతానని హమాలీపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో వెంకటసుబ్బయ్య సొంత ఆటో వేసుకుని రైతు వద్ద ఉన్న శనగ ప్యాకెట్లను వెనక్కు తీసుకుని కోవెలకుంట్లలో విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 44 ప్యాకెట్ల శనగలు, ఆటోను సీజ్‌చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!
కెరమెరి(ఆదిలాబాద్): తన చేనులో శెనక్కాయలు తిన్నాడని జరిగిన గొడవ ఒకరి మరణానికి దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం నిశాని గ్రామానికి చెందిన లక్ష్మణ్ తనచేనులో వేరుశెనగ పంట వేశాడు. గురువారం మధ్యాహ్నం గ్రామానికే చెందిన మడావి గంగు (45) ఆ చేనులో వేరుశెనగకాయలు తింటుండగా లక్ష్మణ్ అతనితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన లక్ష్మణ్ రాయితో గంగు తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వారం దాటితే దుర్భిక్షమే
వేరుశెనగ పెట్టుబడి మట్టిపాలే తేల్చిచెప్పిన వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు బి.కొత్తకోట: ‘‘వారం రోజుల్లో వర్షం కురిస్తే సరే.. లేదంటే పడమటి మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు త ప్పవు’’అని తిరుపతి వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. సీనియర్ కీటక శాస్త్రవేత్త టి.మురళీకృష్ణ, జన్యు శాస్త్రవేత్త కె.జాన్, భూసార పరీక్ష శాస్త్రవేత్త టీఎన్వీకే.ప్రసాద్ గురువారం బి.కొత్తకోట మండలంలో పలుచోట్ల వేరుశెనగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ వేరుశెనగ పంటల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పంట ఎండిపోతోందనీ, వారం రోజుల్లో 10 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం కురిస్తేకానీ పంటలను కాపాడుకునే వీలులేదని స్పష్టం చేశారు. వర్షం కురవకుంటే పంటలపై ఆశలు వదులుకోవచ్చని తేల్చారు. పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందే అవకాశాలు ఏమాత్రం లేవన్నారు. ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఎన్నడూ ఎదురు కాలేదని చెప్పారు. కాగా ఈ నెలఖారులోగా రైతులు ప్రత్యామ్నాయ పంటగా కంది సాగుచేయవచ్చని చెప్పారు. వచ్చే నెలలో మొక్కజొన్న సాగు చేసుకునే వీలుందని చెప్పారు. శనివారం విజయవాడలో జరిగే ఉన్నతస్థాయి అధికారిక కార్యక్రమంలో ఇక్కడి దుర్భిక్ష పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా ప్రణాళిక రూపొందించాలని నివేదిక ఇస్తామని చెప్పారు. వీరివెంట బి.కొత్తకోట, మదనపల్లె ఏవోలు ఆర్.ప్రేమలత, నవీన్, ఏఈవో ఫైరోజ్ పాల్గొన్నారు. -
వేరుశెనగలతో గుండెకు మేలు..
మూడు ముచ్చట్లు వేరుశెనగలు తింటే గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేరుశెనగ గింజల్లో దాదాపు 48 శాతం కొవ్వుపదార్థాలు ఉన్నా, వాటిలో గుండెకు మేలుచేసే మోనో శాచ్యురేటెడ్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వేరుశెనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు విటమిన్-బి 1, బి 6, ఫొలిక్ యాసిడ్, విటమిన్-ఇ, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు శరీరానికి చాలా మేలు కలిగిస్తాయని అంటున్నారు. వేరుశెనగలే కాకుండా బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి ఎలాంటి గింజలనైనా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే, గుండెజబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని వివరిస్తున్నారు. అమెరికన్ నిపుణులు, చైనీస్ నిపుణులు నిర్వహించిన వేర్వేరు పరిశోధనల్లో వేరుశెనగలు సహా వివిధ రకాల గింజలు తినడం వల్ల గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు ఇటీవల గుర్తించారు. -
అ(ప)ప్పు శనగ..!
కడప అగ్రికల్చర్...: పెరిగిన పెట్టుబడులు... తగ్గిన దిగుబడులు. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు.. మరోపక్క చిరుజల్లులు వెరసి రబీ పంటలు అన్నదాతకు అప్పులు మిగిల్చారుు. జిల్లాలో ముఖ్యంగా రబీ పంటలు వేసిన పడమటి మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రబీలో అత్యధికంగా సాగు చేసిన పప్పుశనగ (బుడ్డశనగ) పంట... రైతన్న కోలుకోలేని దెబ్బతీసింది. పైరు ఎదుగుదల దశలో వరుణుడు కరుణంచకపోవడం, పూత, పిందెదశలో తుపాను ప్రభావం వల్ల చిరుజల్లులు కురవడంతో పెద్ద నష్టమే జరిగింది. చిరుజల్లులతో పంట దిగుబడిని పెంచే పులుసు పదార్థం కారిపోరుు కాపు పూర్తిగా తగ్గిపోరుుంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడం బాధాకరం. కౌలు రైతు పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా ఉంటోంది. సాధారణంగా ఖరీఫ్ పంటలు దెబ్బతీసినా రబీ మాత్రం రైతన్నకు అనుకూలించి ఎంతో కొంత ఆదాయాన్నిచ్చేది. అయితే ఈ ఏడు ఖరీఫ్‌లో తీవ్రవర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతన్న కుంగిపోయాడు. రబీ సీజను ప్రారంభంలో వర్షాలు ఊరించడంతో ప్రధానంగా పప్పుశనగ(బుడ్డశనగ)తో పాటు జొన్న, పెసర మినుము, పొద్దుతిరుగుడు, ఉలవ, అనప తదితర పంటలు సాగుచేశారు. రబీ పప్పుశనగతో ఖరీఫ్ నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఆశించిన రైతుకు నిరాశే మిగిలింది. 63972 హెక్టార్లలో సాగు....: ఈ రబీలో జిల్లాలో 63972 హెక్టార్లలో బుడ్డశనగను సాగు చేశారు. వర్షాభావం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నష్టపోయిన పప్పుశనగ రైతుకు బీమా అందించి ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పంట సాగు సమయంలో క్వింటా విత్తన ధర రూ. 3500 పలికిందని, అదే నేడు అరకొరగా వచ్చిన పంటకు క్వింటా ధర రూ. 3000 మించి పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా గిట్టని వైనం...: సాధారణంగా బుడ్డశనగ ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఎకరాకు 1 నుంచి 1 1/2 బస్తాలకు మించి రాలేదని రైతులు చెబుతున్నారు. కొందరు రైతులు పంటను పూర్తిగా గొర్రెలకు మేతగా వదిలేశారు. మరి కొందరు అదే పొలంలోనే దున్నేస్తున్నారు. పొలాలను కౌలుకు తీసుకుని బుడ్డశనగను సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంట సాగుకు ముందుగనే భూ యజమానికి ఎకరానికి రూ. 5 వేల నుంచి 8 వేల వరకు చెల్లించారు. తీరా పంట దెబ్బతినడంతో ఎటూ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు...: బుడ్డశనగ పంటను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నాం. కానీ ఇంత అధ్వానంగా ఎప్పుడూ లేదు. పంట సాగుకు పదునుపాటి వర్షాలు కురిశాయి. ఇబ్బంది లేదు అని సాగు చేస్తే తీరా పంట బుడ్డలు వచ్చేటప్పుడు చిరుజల్లులు పడడంతో పంట మొత్తం పోయింది. పెట్టుబడులు కూడా రాకుండా పోయినాయి. -నారాయణరెడ్డి, శనగరైతు, పెద్దపసుపుల గ్రామం, పెద్దముడియం మండలం. రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి రబీలో ప్రధాన పంటగా జిల్లా అధిక మండలాల్లో సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ పోయింది. రబీ కూడా దెబ్బతీసింది. బుడ్డశనగ పంటతోపాటు ఇతర పంటలు కొన్ని మండలాల్లో వర్షాభావంతోను, జిల్లాలోని మరికొన్ని మండలాల్లో తుపాను ప్రభావంతో చిరుజల్లులు కురవడంతో శనగ కు దిఉబడినిచ్చే పులుసు పదార్థం కారిపోవండంతో దిగుబడి తీర్మానంగా పోయింది. ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. -రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం. ఇన్పుట్ సబ్సిడీ...బీమా అందించాలి...: ఖరీఫ్ పంటలు వర్షాభావంతో పంటలు తుడిచిపెట్టుకుపోగా, ఆదుకుంటాయనుకున్న రబీ సీజన్ పంటలు కూడా ఏ మాత్రం రైతుకు మేలు చేయలేకపోయాయి. ఈ తరుణంలో రైతులకు ఇన్పుట్సబ్సిడీతోపాటు పంటల బీమా కూడా అందించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. -సంబటూరు ప్రసాదరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం -
శనగలు ఇచ్చి.. చేరుు కడుక్కున్నారు
శనగలు ఇచ్చినారు సామి బ్యాల్లు ఎట్లా చే సుకోవాల... ఊర్లలో అయితే ఇసుర్రాళ్లు ఉంటాయి... శనగలను బ్యాల్లు చేసుకోవచ్చు.... ఈటౌన్లో ఇసుర్రాల్లు యూడుంటాయి... శనగలు ఎట్లా ఇచ్చారో ఈ గోర్నమెంటోళ్లు... ఈ శనిగలతో ఓలిగెలు ఎట్టా చేసుకునేది.. ఇదేంది సామి యవ్వారం... అంటూ కడప ఎర్రముక్కపల్లెకు చెందిన కార్డుదారు రాములమ్మ ఆవేదన ... ఒక్క రాములమ్మదేకాదు ఈ బాధ జిల్లాలోని 3లక్షలకు పైగా కార్డుదారులది. పండుగ చేసుకోండి అని ప్రభుత్వం చెబుతూనే కొందరికి సరుకులు ఇచ్చి మిగతా వారికి ఎగ్గొడతారా అనే విమర్శలు ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. శనగలు ఇచ్చి....ప్రభుత్వం చేయి కడుక్కుంది. బేడలు ఇచ్చి ఉంటే పండుగ బాగా చేసుకునే వార ం కదా.. అని? కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. కడప అగ్రికల్చర్ : ధనికులతోపాటు పేద, బడుగు, బలహీన వర్గాల వారు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి... అంటూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న సంక్రాంతి కానుకలు కొందరి ఇళ్లకే చేరారుు. అవి తీసుకున్న వారు సైతం వీటితో పండుగ ఎలా చేసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పండుగకు ఒక్కరోజు ముందు పుచ్చిపోరుున ముడి శనగలు ఇస్తే వాటితో ఓలిగెలు ఎలా చేసుకోవాలో చెప్పాలని పలువురు ప్రశ్నించడం కనిపించింది. జిల్లాలో సోమ, మంగళవారాల్లో సరుకుల పంపిణీ తీరును సాక్షి బృందం పరిశీలించింది. ఆరింటిలో కొన్ని సరుకులు బాగున్నా మిగిలినవి నాసిరకంగా ఉన్నారుు. శనగల్లో పుల్లలు, పుచ్చులు ఎక్కువగా ఉండగా, బెల్లం పైన బాగున్నా మధ్యలో నాసిరకంగా ఉంది. గోదుమ పిండి పురుగు పట్టిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు 12లోగా పంపిణీ చేస్తామని మొదట చెప్పినా ఆ సమయూనికి డీలర్లకే పూర్తిగా చేరని పరిస్థితి. వచ్చినవి కూడా బస్తాల రూపేణా రావడంతో వాటిని కేజీ, అరకేజీ ప్యాకింగ్‌లు చేయడం డీలర్లకు తలనొప్పిగా మారింది. ఫలితంగా పలుచోట్ల తూకాల్లో తేడాలు వచ్చారుు. పొంతనలేని ప్రచారం రూ. 240 విలువ చేసే ఆరు రకాల వస్తువులను ఉచితంగా తెల్లరేషన్‌కార్డు దారులందరికీ అందజేస్తామని శాసనసభ సాక్షిగా సీఎం నారా చంవ్రబాబునాయుడు గతనెల 23వ తేదీన ప్రకటించారు. మాటలకు చేతలకు పొంతన ఉండదని సీఎం మరోసారి నిరూపించుకున్నారు. గతనెల నుంచి నేటి వరకు అధికార యంత్రాంగం, ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా ఇప్పటికీ ఆయా సరుకులు పూర్తిగా కార్డుదారులకు చేరలేదు. ఉచితంగా ఇస్తున్నాం కదా?అని ఏవి బడితే అవి ఇస్తే సరిపోతోందా? అని పలువురు కార్డుదారులు వాపోతున్నారు. పండుగకు అన్ని సరకులు ఇస్తున్నామంటూనే బుడ్డశనగల్లో పుల్లలు, నుసి, మట్టి, చెత్తాచెదారాలు అధికంగా ఉన్నాయని చింతకొమ్మదిన్నె, మైదుకూరు, రాయచోటిలో సరుకులు పొందిన వారు విమర్శిస్తున్నారు. బద్వేలు, పులివెందుల, రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల్లో గోధమ పిండి, పామాయిల్ కొరత వచ్చింది. ప్రొద్దుటూరు నియోజక వర్గంలో చాలా రేషన్‌షాపులకు గోధుమ పిండి తీవ్ర కొరత ఏర్పడిందని, మంగళవారం సాయంత్రం వరకు కూడా చేరలేదని కొందరు షాపుల యజమానులు తెలిపారు. అలాగే తూకాల్లో కూడా కొందరు డీలర్లు తక్కువగా ఇచ్చారని కార్డుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైనా ఇచ్చేటప్పుడు నాణ్యతతో ఇస్తే ప్రభుత్వ సొమ్ము పోతుందా....అని కార్డుదారులు దుయ్యబడుతున్నారు. సోమవారం, మంగళవారం ఉదయం 7 గంటలకే చౌకదుకాణాల వద్ద జనం బారులు తీరారు. జిల్లాలోని అన్ని చౌకదుకాణాల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో తెల్లకార్డులు 6,42,726, ఏఏవై కార్డులు 59,573, అన్నపూర్ణ కార్డులు 815, మొత్తం కలిపి 7,03,114 ఉన్నాయి. ఈ కార్డులన్నింటికి కలిపి కందిబేడలు 351.557 మెట్రిక్ టన్నులు, శనగలు 708.114 టన్నులు, బెల్లం 31.551 టన్నులు, పామాలిన్ 351.557 మెట్రిక్ టన్నులు, నెయ్యి 70.3114 మెట్రిక్ టన్నులు, గోధుమ పిండి 703.114 మెట్రిక్ టన్నులలో 75 శాతం మాత్రమే జిల్లాకు చేరినట్లు సమాచారం. పండుగ రోజు కూడా సరుకులు అందిస్తే ఆయా ముడి సరుకులను సిద్ధం చేసుకునేదెప్పుడు....పండుగ చేసుకునేదెప్పుడు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి మొత్తం కార్డుదారులందరికీ సరుకులు అంది ఉంటాయా అన్న ప్రశ్న అధికారులను కూడా వేదిస్తోంది. సరిపడా సరుకులు వచ్చారుు.....నేడు కూడా పంపిణీ చేస్తాం... జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న సంక్రాంతి సరుకుల కానుకలోని సరకులన్నీ జిల్లాకు చేరాయి. ప్రొద్దుటూరు ప్రాంతంలోని రేషన్‌షాపులకు గోధుమ పిండి కొరత వచ్చిన మాట వాస్తమే దాన్ని కర్నూలు జిల్లా నుంచి తెప్పించాం. బుధవారం కూడా ఎక్కడెక్కడ అందలేదో అక్కడి వారితో మాట్లాడి సరకులు అందజేస్తాం. - బుళ్లెయ్య, డీఎం, జిల్లా పౌరసరఫరాల శాఖ. -
వేరుశెనగ పోయినట్టే
మదనపల్లె డివిజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌లో సాగుచేసిన వేరుశెనగ పంట దెబ్బతింది. పెట్టుబడులూ చేతికందక రైతులు పుట్టెడు అప్పుల్లో కూరుకుపోయారు. డివిజన్ పరిధిలో రూ.280 కోట్ల వరకు నష్టాలు వాటిల్లినట్టు అంచనా. 70 వేల హెక్టార్లలో పంట నష్టం ఖరీఫ్‌లో రెండు విడతలుగా జూన్, జూలై నెలల్లో రైతులు 70 వేల హెక్టార్ల (1.75 లక్షల ఎకరాలు)లో వేరుశెనగను సాగుచేశారు. మూడు నెలల కాలంలో 20 రోజుల పాటు పూర్తిగా డ్రైస్పెల్ వచ్చాయి. పూత, ఊడ, గింజ పట్టే దశలో వర్షం కురవక పంట దెబ్బతింది. డివిజన్లో సాధారణ వర్షపాతం 480 మి.మీ కాగా, ఈ సీజన్లో 40 శాతం తక్కువ కురిసింది. దీంతో వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతింది. ఎకరా సాగుకు రూ.15 వేల ఖర్చు ఎకరా పొలంలో వేరుశెనగను సాగుచేసి ఒబ్బిడి చేయాలంటే రైతులకయ్యే ఖర్చు రూ.15 వేలు. వర్షాలు బాగా కురిసుంటే ఎకరాకు 15 బస్తాలు (బస్తా 40 కిలోలు)తో ఆరు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఆ లెక్కన ఎకరాకు ప్రస్తుతమున్న ధర ప్రకా రం క్వింటాళ్ రూ.5 వేలు చొప్పున రూ.30 వేలు వచ్చేది. పెట్టుబడి రూ.15 వేలు పోను రూ.15 వేలు చేతికందేది. కానీ ఈ దఫా పూర్తిగా పంట నష్టం కావడంతో రైతులకు పది కిలోల కాయలు కూడా దొరకడం లేదు. మరోవైపు ఎండిన వేరుశెనగను రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీతో ఆదుకోవాల్సిందే నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో వేరుశెనగ రైతులకు సక్రమంగా ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. గ త ఏడాది సైతం వేరుశెనగ తీవ్రంగా దెబ్బతింది. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. జిల్లా అధికారులు హెక్టారుకు రూ.10 వేల చొప్పు న ఇన్పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి అంచనాలు పంపి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు రైతులకు పైసా అందలేదు. ఈ ఏడాది వేరుశెనగ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. రైతులకు నష్టపరిహారం అందితే గానీ కోలుకోలేని పరిస్థితి. -
వంటతో తంటాలెందుకు?!
వాయనం: వంట... అలవాటైన వారికి చాలా చిన్న పని. కానీ ఉద్యోగినులకు అది చాలా పెద్ద పని. ముఖ్యంగా వంట చేసేటప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు, తెలియనితనం వల్ల జరిగే జాప్యాలు విసిగిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి చిట్కాలు చాలా ఉపకరిస్తాయి! - రోజూ కరివేపాకును తీసి, కడిగి కూరలో వేసేబదులు... ఇంట్లో ఉన్న రోజున ఎండబెట్టి, పొడి చేసి, డబ్బాలో వేసి నిల్వ చేసుకుని వాడుకుంటే సమయం ఆదా అవుతుంది! - బెండకాయ ముక్కలు వేగడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది... దానికుండే జిగురు వల్ల. అదే కోసిన వెంటనే వాటిమీద కాసింత నిమ్మరసం చల్లారనుకోండి... జిగురూ ఉండదు, త్వరగానూ వేగిపోతాయి! - ఉప్మా ఉండ కట్టకుండా ఉండాలంటే... ముందే రవ్వకు కాస్త నూనె పూయండి. నూనె ఎక్కువవుతుందని భయమేస్తే... తాలింపులో తగ్గించుకోండి! - అరటి, బంగాళాదుంపల వేపుళ్లు చేసేటప్పుడు తక్కువ మంట మీద ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. అంత సమయం పట్టకుండా ఉండాలంటే... ముందు ముక్కలమీద ఉప్పునీళ్లు చల్లి, పావుగంట తర్వాత వేయిం చండి... బోలెడు టైమ్ మిగుల్తుంది! - అన్నం వేడిగా ఉన్నప్పుడు పులిహోర చేస్తే ముద్దలా అయిపోతుంది. చల్లార బెట్టేంత సమయం లేకపోతే... అన్నం ఉడికేటప్పుడు ఓ చెంచాడు నెయ్యి కానీ, వెన్న కానీ వేస్తే, పొడిపొడిగా ఉండి ముద్ద అవ్వదు! - కంద, చేమ దుంపలు ఉడికించేటప్పుడు నీటిలో చిన్న బెల్లంముక్క వేస్తే త్వరగా ఉడికిపోతాయి! - ఉల్లిపాయలు వేయించేటప్పుడు కాసింత పంచదార వేస్తే, త్వరగా రంగు మారతాయి! - కూరలో ఉప్పుకానీ పసుపు కానీ ఎక్కువైనప్పుడు ఓ బ్రెడ్ స్లైస్‌ను వేస్తే... ఎక్కువైనదాన్ని పీల్చేసుకుంటుంది. కానీ ఎక్కువసేపు ఉంచితే మెత్తబడి కూరలో కలిసిపోతుంది. కాబట్టి మెత్తబడేలోపే తీసేయండి! - కూరలో పొరపాటున కారం ఎక్కువ పడితే... మళ్లీ నీళ్లు పోసి ఉడికిస్తూ పోకండి. దానివల్ల టైమ్ వేస్ట్ అవుతుంది. కాసిన్ని కొబ్బరిపాలు వేస్తే... కారం తగ్గుతుంది. రుచీ బాగుంటుంది! - టైమ్ తక్కువ ఉంది కదా అని మంట ఎక్కువ పెడితే... వంటకాలు గిన్నెకు అంటుకుని మాడిపోతాయి. అలా జరక్కుండా ఉండాలంటే... ముందు గిన్నెలో చిటెకెడు ఇంగువ వేసి, తర్వాత మిగిలిన దినుసులన్నీ వేయండి! పీనట్ బటర్ కావాలంటే... ఇదే బెటర్! వేరుశెనగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వాటిని తగిన మోతాదులో తప్పక తీసుకొమ్మని సూచిస్తుంటారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో అవసరం. అయితే ఎప్పుడూ మామూలుగానే తినమంటే వాళ్లు ఇష్టపడకపోవచ్చు. అదే బటర్లా చేసి, బ్రెడ్డుకు రాసి ఇవ్వండి... ఎగిరి గంతేస్తారు! నిజానికి మార్కెట్లో రెడీమేడ్ పీనట్ బటర్ దొరుకుతోంది. కానీ రేటు చాలా ఎక్కువ. ఒక డబ్బా 150 నుంచి 200 రూపాయల వరకూ ఉంటోంది. ఒకవేళ కొని తెచ్చుకున్నా... పిల్లలున్న ఇంట్లో నెలకొకటి అయిపోతుంది. ఆ లెక్కన సంవత్సరానికి ఎంత ఖర్చవుతుందో చూడండి! కాబట్టి ఈ పీనట్ బటర్ మేకర్ని కొనుక్కోవడం ఎంతైనా ఉత్తమం. దీని వెల రూ.3700 నుంచి నాలుగు వేల వరకూ ఉంటుంది. కాస్త ఎక్కువనిపించినా ఒక్కసారి కొని పెట్టేసుకుంటే బోలెడు డబ్బులు మిగులుతాయి కదా! -
నేతల గళంపై జనం గంపెడాశ
తాగునీటి కోసం అలమటిస్తున్న జనం వేరుశెనగ ఇన్పుట్ సబ్సిడీ అందలేదు గిట్టుబాటు కూలి దక్కని ఉపాధి హామీ పథకం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలయ్యేదెప్పటికో? రుణమాఫీ ప్రకటనతో రైతులకందని కొత్తరుణాలు 7 గంటల ఉచిత విద్యుత్ హుళక్కేనా నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం చిత్తూరు (టౌన్): జిల్లా ప్రజాపరిషత్ కొత్త పాలకవర్గం తొలి సర్వసభ్యసమావేశం ఆదివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ మీటింగ్ హాలులో జరగనుంది. జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలోని సమస్యలపై గళంవిప్పి పరిష్కారం చూపుతారనే గంపెడాశతో జనం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా జిల్లా ను తాగునీటి సమస్య తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతున్నాయి. గత ఏడాది రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. వేలాది మంది విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇంకా అందలేదు. విభాగాలవారీగా నెలకొన్న సమస్యలు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. గ్రామీణ నీటిసరఫరా జిల్లాలో 1,202 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 1,043గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా 159 గ్రామాల్లో టైఅప్ ద్వారా నీటిని అందిస్తున్నారు.-2014-15కు రూ.268.21కోట్ల అంచనాలతో 6,140 తాగునీటి పనులు మంజూరుకాగా వాటిలో 6,081 పనులను చేపట్టి 4,900 పనులను మాత్రం పూర్తిచేశారు. దీనికోసం రూ.85.38 కోట్లను మాత్రం ఖర్చు చేశారు. ఇంకా 1,181 పనులు ఆగిపోయాయి. దానికోసం రూ.182 కోట్లు మురుగుతున్నాయి. పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ పరిధిలో 2013 జూన్ నుంచి మంజూరైన పనులను ఆపేయాలని ప్రభుత్వం అనధికారికంగా ఆదేశించింది. దీంతో కోట్లాది రూపాయల పనులు జిల్లాలో ఆగిపోయాయి. 2014-15లో పీఎంజెఎస్వై కింద రూ.70.15 కోట్లతో మంజూరైనా 23 పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు ఆర్డీఎఫ్ కింద రూ. 24.75 కోట్లతో గత ఆర్థిక సం వత్సరంలో మిగులు పనులను చేపట్టగా 32 పూ ర్తయి, 27 వివిధ దశల్లో ఉండగా 65 పనులను ఇంకా చేపట్టలేదు. రూ. 2.61 కోట్లతో జిల్లాలో రెండు హెరిటేజ్ కారి డార్ పనులు మంజూరు కాగా వాటిలో ఒకటి ప్రోగ్రెస్‌లో ఉండగా మరొకటి ఇంకా చేపట్టలేదు. రూ.11.25 కోట్లతో 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల్లో ఇంకా 30 చేపట్టలేదు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 971 పనులు చేపట్టగా వాటిలో 314 పనులు వివిధ దశల్లో ఉం డగా 657 పనులు ఇంకా ప్రారంభం కాలేదు రూ.4.58 కోట్లతో మంజూరైన అంగన్వాడీ భవనాల నిర్మాణాల్లో 32 పూర్తి కాగా, 28 ప్రోగ్రెస్‌లో ఉండగా మరో 23 భవనాలను ఇంకా చేపట్టలేదు. రూ.11.40 కోట్లతో మంజూరైన 62 వెటర్నరీ భ వనాల్లో 11 పూర్తికాగా 22 వివిధ దశల్లో ఉండగా 38 భవనాలను ఇంకా చేపట్టలేదు. రూ.4.40 కోట్లతో మంజూరైన గ్రామ పంచాయతీ భవనాల్లో 44 ఇంకా వివిద దశల్లో వున్నాయి. వ్యవసాయశాఖ గత ఏడాది 1.75 లక్షల మందికి వేరుశెనగ ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1.08 కోట్లు రావాల్సివుం డగా ఇంతవరకు విడుదల కాలేదు. గత ఏడాది రైతులకు పంటలబీమా కింద వివిధ కంపెనీలు చెల్లించాల్సిన రూ. 102 కోట్లు ఇంతవరకు అందలేదు. పంటల బీమా పథకంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను రద్దుచేసి సెప్టెంబర్ 15 వరకు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలి. వర్షాభావ కారణంగా పడమటి మండలాల్లో వేరుశెనగ పంట ఎండిపోతోంది. నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందజేయాల్సివుంది. డీఆర్డీఏ జిల్లాలో 55,602 సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ. 41.60 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 61వేల సంఘాలకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ కావాల్సివుంది. మాఫీ అవుతుందని రుణాలను చెల్లించకపోవడంతో 55వేల సంఘాలు రుణ సదుపాయాన్ని పొందే వీలులేకపోయింది. పభుత్వ డెయిరీలు సగటున పాలు లీటరుకు రూ.20-22 మాత్రమే చెల్లిస్తున్నాయి. ప్రైవేటు డెయిరీలు లీటరుకు రూ. 25 నుంచి 27 వరకు చెల్లిస్తున్నాయి. దీంతో బీఎంసీయూల్లో రోజువారీ పాలసేరకణ మూడు నుంచి రెండు లక్షల లీటర్లకు పడిపోయింది. విద్యుత్ శాఖ వ్యవసాయూనికి ఏడు గంటల ఉచిత విద్యుత్ సరఫరా అనేది ఎక్కడా అమలు కావడం లేదు. ఏడు గంటల ఉచిత విద్యుత్ అనేది అధికారుల లెక్కల్లో ఉదయం నాలుగు గంటలు, రాత్రి మూ డు గంటలు సరఫరా ఇస్తున్నామంటున్నారు. కానీ రెండు సార్లుగా ఇచ్చే కరెంటు గంటకోసారి ప్ర కారం నాలుగైదుసార్లు అంతరాయం కలుగుతోం ది. సరిగ్గా అయిదు గంటలు కూడా సరఫరా కావడం లేదు. ఇంకా 67 వేల వ్యవసాయ సర్వీసులకు హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సపరేట్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయలేదు. సంక్షేమం జిల్లాలో మొత్తం 209 హాస్టళ్లుండగా 75 శాతం హాస్టళ్లకు మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. బీసీ సంక్షేమంలో 37,420 మంది బీసీ,ఈబీసీ విద్యార్థులకు గాను గత ఏడాదికి మంజూరు కావాల్సిన రూ.79.28 కోట్ల ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధులు ఇంకా అందలేదు. గత ఏడాదికి సంబంధించిన పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్పుల కింద 44,194 మందికి రూ. 10.93 కోట్లు విడుదల కావాల్సివుంది 2013-14కు బీసీ కార్పొరేషన్లో మార్జిన్‌మనీ పథకం కింద 1,093 మందికి మంజూరైన రూ.3.51 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. రాజీవ్ అభ్యుదయ యోజన కింద 145మందికి రూ. 50.49 లక్షల రాయితీని ప్రభుత్వం నిలిపేసింది. మైనారిటీ సంక్షేమంలో 2012-13కు 2,890 మందికి ఫీజ్ రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు కలిపి రూ. 2.50 కోట్లు, గత ఏడాదికి 12,360 మందికి మంజూరు కావాల్సిన మొత్తం రూ. 20.50 కోట్లు ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఐసీడీఎస్ జిల్లాలో మొత్తం 4,768 అంగన్వాడీ కేంద్రాలుం డగా 1,404కు మాత్రమే సొంత భవనాలున్నా యి. మిగిలినవన్నీ అద్దెభవనాల్లో నడుస్తున్నాయి. బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాల్సిన ఐసీడీఎస్ అధికారులు దాన్ని పూర్తిగా మరిచిపోయారు. డ్వామా ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6,38,637 కుటుంబాలకు జాబ్ కార్డులిచ్చినా ఇప్పటివరకు 1,43,385 కుటుంబాలకు మాత్రమే పని కల్పించారు. కూలి రేటు తక్కువగా ఉండడంతో రోజంతా పనిచేసినా గిట్టుబాటు కాపోవడంతో పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో జిల్లాలో ఈ పనులు దాదాపుగా స్తంభించాయి. రుణమాఫీ జిల్లాలో 8.7 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు కావాల్సివుంది. వీరు తీసుకున్న రూ. 11,180 కోట్లు మాఫీ కావాల్సివుంది. దీనిపై ఇంతవరకు స్పష్టత లేదు. కొత్త రుణాలిచ్చేందుకు ఏ బ్యాంకూ ముందుకు రావడం లేదు. డీసీసీబీ గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పంట రుణాలను ఇవ్వలేదు. -
వేరుశెనగ పంపిణీ నేడే
ఇంకా చాలీచాలని సబ్సిడీ విత్తనాలే కావాల్సింది లక్ష క్వింటాళ్లు వచ్చింది 12వేల క్వింటాళ్లే చిత్తూరు (అగ్రికల్చర్): సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయల ధరలను నిర్ణయించడానికే సమయాన్నంతా వృథా చేసిన అధికారులు వాటిని జిల్లాకు దిగుమతి చేసుకోవడంలో కూడా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఖరీఫ్ సీజనుకు రైతులకు సబ్సిడీపై వేరుశెనగ విత్తనకాయలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం నెల రోజులుగా వాటి ధర నిర్ణరుుంచే విషయంలో మీనమేషాలు లెక్కించింది. ఎట్టకేలకు ఈ నెల 21 తేదీన ధర ప్రకటించింది. కానీ ఇప్పటికి కూడా అవసరమైన మేరకు విత్తనకాయలను దిగుమతి చేసుకోలేకపోరుుంది. ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఈ నెల 25 (బుధవారం)న చాలీచాలని విత్తనాలతోనే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ సీజనుకు వేరుశెనగ సాగు సాధారణ విస్తీర్ణం 1,36,479 హెక్టార్లు. ఇందుకుగాను 1.05 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ కాయలు అవసరం. ఇందులో ఇప్పటికి 12 వేల క్వింటాళ్లు మాత్రమే జిల్లాకు చేరాయి. నెల చివరలోనే వేరుశెనగ కాయలు రైతులకు అందించాల్సి ఉంది. సాధారణంగా జూన్ 15 నుంచి జూలై 15వ తేదీలోగా వేరుశెనగ కాయలు విత్తేందుకు మంచి అదను. ఈ ఏడాది ప్రభుత్వం సీజను దాటిపోయే సమయానికి విత్తనకాయల ధర ప్రకటించింది. దీనికితోడు ఇప్పటికి జిల్లాకు చేరిన 12 వేల క్వింటాళ్ల విత్తనకాయలతో 51 మండలాల్లో అధికారులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. అధికారులు ప్రకటించిన ప్రకారం ఈ నెలాఖరుకుగానీ రైతులకు పూర్తి స్థారుులో విత్తనకాయలు పంపిణీచేసే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. తొలుత 35 వేల క్వింటాళ్లకాయలను జిల్లాకు తెప్పించి పంపిణీ ప్రారంభిస్తామని జిల్లా వ్యవసాయశాఖ జేడీ ప్రకటించారు. కానీ అది నెరవేరలేదు. -
విత్తుపైనా..బెత్తమే
సబ్సిడీ వేరుశెనగ విత్తనాలకు నగదు బదిలీ పూర్తి నగదు చెల్లిస్తేనే వేరుశెనగ విత్తనాలు ఆపై రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదును జమ చేస్తారట 40 శాతం మంది రైతులకుబ్యాంకులో ఖాతాల్లేవు జిల్లాలోని రైతన్నలపై 15 కోట్ల భారం వంట గ్యాస్ సబ్సిడీ పంపిణీలో నగదు బదిలీ అభాసుపాలైనా అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదు. వచ్చే నెల మొదటి వారంలో జిల్లాలో ప్రారంభం కానున్న సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయల పంపిణీ సైతం నగదు బదిలీ ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సం బంధించిన ఉత్తర్వులు జేడీ కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని ఏడీ కార్యాలయాలకు అందాయి. తొలుత ప్రైవేటు మార్కెట్లో ఉన్నంత పూర్తి ధరతో రైతులు నగదు చెల్లించి వేరుశెనగ విత్తన కాయలను పొందాలట. ఆపై రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్ము జమ చేస్తారట. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలమనేరు, న్యూస్‌లైన్: జిల్లాలో 11 వ్యవసాయశాఖ డివిజన్లు ఉండగా ప్రస్తుతం 9 డివిజన్లలో మాత్రం ఈ విత్తన కాయలను జూన్ మొదటి వారంలో అందజేయనున్నారు. సత్యవేడు, శ్రీకాళహస్తి మినహా మిగిలిన 53 మండలాల్లో ఈ పంపిణీ జరగనుంది. ఖరీఫ్‌కు సంబంధించి లక్ష క్వింటాళ్ల విత్తనాలను సుమారు 4 లక్షల మందికి పైగా రైతులకు అందజేయాలని అధికార యం త్రాంగం సిద్ధమవుతోంది. ఈ దఫా కే-6 అనే రకం విత్తనాలను పంపిణీ చేయనున్నారు. 30 కిలోల బస్తాకు సబ్సిడీ రూ.450 ఈ దఫా వ్యవసాయ శాఖ 30 కిలోల వేరుశెనగ బస్తాకు ధర రూ.1380గా నిర్ణయించింది. ఇందులో 33 శాతం (రూ.450) సబ్సిడీతో వీటిని అందజేస్తారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున ఇవ్వనున్నారు. ప్రభుత్వ ధర ప్రకారం ఓ బస్తా రూ.1380 కాగా, మొత్తం ధర చెల్లించి విత్తనాలను పొం దాల్సి ఉంది. ఆపై రైతుల ఖాతాల్లోకి రూ.450 సబ్సిడీని జమ చేయనున్నా రు. అయితే రైతులు పట్టదారు పాసుపుస్తకంతో పాటు బ్యాంకు అకౌంట్‌ను ఇవ్వాల్సి ఉంది. పాసుపుస్తకంలో యజమానిగా ఉన్న వ్యక్తి పేరు మీదనే బ్యాంకు ఖాతా కూడా ఉండాలట. జిల్లాలోని రైతన్నలపై రూ.15 కోట్ల భారం వ్యవసాయ శాఖ లక్ష క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయనుంది. దీనికయ్యే మొత్తం ఖరీదు రూ.46 కోట్లు. ఇందులో సబ్సిడీ రూ.15 కోట్లు. ఈ మొత్తాన్ని రైతులు ఫుల్‌కాస్ట్ రూపేణా ముందుగానే చెల్లించాల్సి ఉంది. అసలే కష్టాల్లో ఉన్న రైతన్నకు మొత్తం ధర చెల్లించడం ఇబ్బందే. దీంతో ఈ దఫా సబ్సిడీ వేరుశెనగ విత్తనాలపై ఆసక్తి చూపరని వ్యవసాయాధికారులే పెదవి విరుస్తున్నారు. నగదు బదిలీలో ఇబ్బందులేమంటే జిల్లాలోని 40 శాతం మంది రైతులకు బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాల్లేవు. ఒకవేళ ఉన్నా పాసుబుక్ కలిగిన వారి పేరిటే ఖాతాల్లేవ్. దీంతో రైతుకు మూడు బస్తాలకందే రూ.1350 కోసం బ్యాంకులో రూ.1000 డిపాజిట్ చెల్లించి ఖాతా పొందడం కష్టంగా మారనుంది. పాసుపుస్తకంలో యజ మానులుగా ఉన్న పలువురు రైతులు మృతిచెందారు. వారి వారసులకు ఇంతవరకు పాసుపుస్తకాలు బదిలీ కాలేదు. ఇలాంటి వారు భూములను ట్రాన్స్ఫర్ చేసుకొనేదెప్పుడు? ఆపై విత్తనాలు పొందేదెప్పుడు? ఒకవేళ ఖాతాలున్న రైతులకు సంబంధిత బ్యాంకుల్లో అప్పులుంటే బ్యాంకర్లు ఆ వచ్చే సబ్సిడీ నగదును రుణానికి జమ చేసుకోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల మధ్య వేరుశెనగ పంపిణీలో నగదు బదిలీ అభాసుపాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రైతులు ఈ పద్ధతిని విమర్శిస్తున్నారు. ఈ విషయమై పలమనేరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు రమేష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సబ్సిడీ విత్తనాల పంపిణీలో నగదు బదిలీ కాస్త ఇబ్బందని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ప్రభుత్వ పాలసీ కాబట్టి తాము ఏమీ చేయలేమన్నారు.