
పీనట్ బటర్ తయారీకి కావల్సినవి
పల్లీలు – ఒక కప్పు; తేనె – ఒక టేబుల్ స్పూను;
పల్లీ నూనె – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా
తయారీ విధానమిలా:
స్టౌ మీద బాణలి వేడయ్యాక పల్లీలు వేసి బాగా దోరగా వేయించి దింపేయాలి ∙పప్పు గుత్తితో ఒత్తుతూ పైన పొట్టును తీసేయాలి ∙పల్లీలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక టేబుల్ స్పూను పల్లీ నూనె, ఒక టేబుల్ స్పూను తేనె, అర టీ స్పూను ఉప్పు వేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకునే పీనట్ బటర్ రెడీ. దీన్ని చపాతీతో కాని, బ్రెడ్‌తో కాని తింటే రుచిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment