మనశ్శాంతి కరువైతే... | leave to Peace of mind in life | Sakshi
Sakshi News home page

మనశ్శాంతి కరువైతే...

Published Sun, Sep 24 2017 12:20 AM | Last Updated on Mon, Sep 25 2017 3:32 PM

leave to  Peace of mind in life

సాధారణ జీవితానికి పెద్దగా లోటు లేకపోయినా మనశ్శాంతి కరువవుతుంది కొందరికి. ఫలితంగా నిరంతరం దిగులుగా ఉంటూ మానసికంగా కుంగిపోతూ ఉంటారు. ఏ పని మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. జీవితంలో ఎదగడానికి ఉపయోగపడే అవకాశాలు వచ్చినా, వాటిని అందిపుచ్చుకోలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి పాటించాల్సిన కొన్ని పరిహారాలు...

► ప్రతిరోజూ ఉదయం స్నానసంధ్యలు ముగించుకున్న తర్వాత స్వహస్తాలతో ఒక రొట్టెను తయారు చేయండి. ఆ రొట్టెను నల్లకుక్కకు తినిపించండి. ఆ తర్వాతే రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించండి.

► మూడంగుళాల పొడవుండే పాదరస శివలింగాన్ని ఇంట్లోని పూజ గదిలో ప్రతిష్ఠించండి. పాదరస లింగానికి ప్రతిరోజూ ధూపదీపాలు సమర్పించి, పంచాక్షరీ మంత్రాన్ని పదకొండుసార్లు జపించండి.

► కోతులు విరివిగా సంచరించే ఆలయానికి మంగళవారం ఉదయంపూట వెళ్లి, అక్కడ ఉండే కోతులకు శనగలు తినిపించండి. ఈ పరిహారాన్ని కనీసం పదహారు వారాలు పాటించాల్సి ఉంటుంది.
 
►ప్రతిరోజూ రాత్రివేళ  చిన్నరాగిపాత్రలో మంచినీటిని నింపి, ఆ నీటిలో కాసిన్ని కృష్ణతులసి దళాలను వేయండి. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి నలుమూలలా, ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మిగిలిన నీటిని తీర్థంగా సేవించండి.
 
►ఏదైనా ఆదివారం రోజున కనీసం ఐదుగురు పేద విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, కలాలు వంటి వçస్తువులను కానుకగా ఇవ్వండి.
– పన్యాల జగన్నాథ దాసు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement