శనగలు ఇచ్చినారు సామి బ్యాల్లు ఎట్లా చే సుకోవాల... ఊర్లలో అయితే ఇసుర్రాళ్లు ఉంటాయి... శనగలను బ్యాల్లు చేసుకోవచ్చు.... ఈటౌన్లో ఇసుర్రాల్లు యూడుంటాయి... శనగలు ఎట్లా ఇచ్చారో ఈ గోర్నమెంటోళ్లు... ఈ శనిగలతో ఓలిగెలు ఎట్టా చేసుకునేది.. ఇదేంది సామి యవ్వారం... అంటూ కడప ఎర్రముక్కపల్లెకు చెందిన కార్డుదారు రాములమ్మ ఆవేదన ... ఒక్క రాములమ్మదేకాదు ఈ బాధ జిల్లాలోని 3లక్షలకు పైగా కార్డుదారులది.
పండుగ చేసుకోండి అని ప్రభుత్వం చెబుతూనే కొందరికి సరుకులు ఇచ్చి మిగతా వారికి ఎగ్గొడతారా అనే విమర్శలు ఎక్కువ మంది నుంచి వినిపిస్తున్నాయి. శనగలు ఇచ్చి....ప్రభుత్వం చేయి కడుక్కుంది. బేడలు ఇచ్చి ఉంటే పండుగ బాగా చేసుకునే వార ం కదా.. అని? కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు.
కడప అగ్రికల్చర్ : ధనికులతోపాటు పేద, బడుగు, బలహీన వర్గాల వారు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలి... అంటూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన చంద్రన్న సంక్రాంతి కానుకలు కొందరి ఇళ్లకే చేరారుు. అవి తీసుకున్న వారు సైతం వీటితో పండుగ ఎలా చేసుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పండుగకు ఒక్కరోజు ముందు పుచ్చిపోరుున ముడి శనగలు ఇస్తే వాటితో ఓలిగెలు ఎలా చేసుకోవాలో చెప్పాలని పలువురు ప్రశ్నించడం కనిపించింది.
జిల్లాలో సోమ, మంగళవారాల్లో సరుకుల పంపిణీ తీరును సాక్షి బృందం పరిశీలించింది. ఆరింటిలో కొన్ని సరుకులు బాగున్నా మిగిలినవి నాసిరకంగా ఉన్నారుు. శనగల్లో పుల్లలు, పుచ్చులు ఎక్కువగా ఉండగా, బెల్లం పైన బాగున్నా మధ్యలో నాసిరకంగా ఉంది. గోదుమ పిండి పురుగు పట్టిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు 12లోగా పంపిణీ చేస్తామని మొదట చెప్పినా ఆ సమయూనికి డీలర్లకే పూర్తిగా చేరని పరిస్థితి. వచ్చినవి కూడా బస్తాల రూపేణా రావడంతో వాటిని కేజీ, అరకేజీ ప్యాకింగ్‌లు చేయడం డీలర్లకు తలనొప్పిగా మారింది. ఫలితంగా పలుచోట్ల తూకాల్లో తేడాలు వచ్చారుు.
పొంతనలేని ప్రచారం
రూ. 240 విలువ చేసే ఆరు రకాల వస్తువులను ఉచితంగా తెల్లరేషన్‌కార్డు దారులందరికీ అందజేస్తామని శాసనసభ సాక్షిగా సీఎం నారా చంవ్రబాబునాయుడు గతనెల 23వ తేదీన ప్రకటించారు. మాటలకు చేతలకు పొంతన ఉండదని సీఎం మరోసారి నిరూపించుకున్నారు. గతనెల నుంచి నేటి వరకు అధికార యంత్రాంగం, ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా ఇప్పటికీ ఆయా సరుకులు పూర్తిగా కార్డుదారులకు చేరలేదు. ఉచితంగా ఇస్తున్నాం కదా?అని ఏవి బడితే అవి ఇస్తే సరిపోతోందా? అని పలువురు కార్డుదారులు వాపోతున్నారు.
పండుగకు అన్ని సరకులు ఇస్తున్నామంటూనే బుడ్డశనగల్లో పుల్లలు, నుసి, మట్టి, చెత్తాచెదారాలు అధికంగా ఉన్నాయని చింతకొమ్మదిన్నె, మైదుకూరు, రాయచోటిలో సరుకులు పొందిన వారు విమర్శిస్తున్నారు. బద్వేలు, పులివెందుల, రాజంపేట, జమ్మలమడుగు ప్రాంతాల్లో గోధమ పిండి, పామాయిల్ కొరత వచ్చింది. ప్రొద్దుటూరు నియోజక వర్గంలో చాలా రేషన్‌షాపులకు గోధుమ పిండి తీవ్ర కొరత ఏర్పడిందని, మంగళవారం సాయంత్రం వరకు కూడా చేరలేదని కొందరు షాపుల యజమానులు తెలిపారు.
అలాగే తూకాల్లో కూడా కొందరు డీలర్లు తక్కువగా ఇచ్చారని కార్డుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైనా ఇచ్చేటప్పుడు నాణ్యతతో ఇస్తే ప్రభుత్వ సొమ్ము పోతుందా....అని కార్డుదారులు దుయ్యబడుతున్నారు. సోమవారం, మంగళవారం ఉదయం 7 గంటలకే చౌకదుకాణాల వద్ద జనం బారులు తీరారు. జిల్లాలోని అన్ని చౌకదుకాణాల వద్ద ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో తెల్లకార్డులు 6,42,726, ఏఏవై కార్డులు 59,573, అన్నపూర్ణ కార్డులు 815, మొత్తం కలిపి 7,03,114 ఉన్నాయి.
ఈ కార్డులన్నింటికి కలిపి కందిబేడలు 351.557 మెట్రిక్ టన్నులు, శనగలు 708.114 టన్నులు, బెల్లం 31.551 టన్నులు, పామాలిన్ 351.557 మెట్రిక్ టన్నులు, నెయ్యి 70.3114 మెట్రిక్ టన్నులు, గోధుమ పిండి 703.114 మెట్రిక్ టన్నులలో 75 శాతం మాత్రమే జిల్లాకు చేరినట్లు సమాచారం. పండుగ రోజు కూడా సరుకులు అందిస్తే ఆయా ముడి సరుకులను సిద్ధం చేసుకునేదెప్పుడు....పండుగ చేసుకునేదెప్పుడు అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి మొత్తం కార్డుదారులందరికీ సరుకులు అంది ఉంటాయా అన్న ప్రశ్న అధికారులను కూడా వేదిస్తోంది.
సరిపడా సరుకులు వచ్చారుు.....నేడు కూడా పంపిణీ చేస్తాం...
జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన చంద్రన్న సంక్రాంతి సరుకుల కానుకలోని సరకులన్నీ జిల్లాకు చేరాయి. ప్రొద్దుటూరు ప్రాంతంలోని రేషన్‌షాపులకు గోధుమ పిండి కొరత వచ్చిన మాట వాస్తమే దాన్ని కర్నూలు జిల్లా నుంచి తెప్పించాం. బుధవారం కూడా ఎక్కడెక్కడ అందలేదో అక్కడి వారితో మాట్లాడి సరకులు అందజేస్తాం.
- బుళ్లెయ్య, డీఎం, జిల్లా పౌరసరఫరాల శాఖ.
శనగలు ఇచ్చి.. చేరుు కడుక్కున్నారు
Published Wed, Jan 14 2015 2:04 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
Advertisement
Advertisement