నంద్యాల అర్బన్: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి బుధవారం నూతన శనగ రకం విడుదలైంది. మంగళవారం అఖిల భారత శనగ సమన్వయ పథకం కాన్పూర్ వారు నిర్వహించిన పప్పు దినుసుల వార్షిక సమావేశంలో నంద్యాల గ్రామ్ (ఎన్‌బీఈజీ) 857 దేశవాళి శనగ రకాన్ని నిర్ధారించారు. పరిశోధన స్థానం సహ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రధాన శాస్త్రవేత్త వీరజయలక్ష్మి ఈ రకంపై పరిశోధనలు జరిపారు.
అధిక దిగుబడులనిస్తూ పురుగులు, తెగుళ్లను తట్టుకొనే కొత్త నంద్యాల గ్రామ్ 857 దేశవాళీ రకాన్ని అభివృద్ధి చేశారు. పంట కాలం 95 నుంచి 100 రోజులు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో సాగుకు అనుకూలమైనదని ప్రధాన శాస్త్రవేత్త వీరజయలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment