శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు! | Man kills eating peanuts in his crop | Sakshi
Sakshi News home page

శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!

Published Thu, Jan 7 2016 9:21 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM

శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!

శెనక్కాయలు తిన్నాడని చంపేశాడు!

కెరమెరి(ఆదిలాబాద్): తన చేనులో శెనక్కాయలు తిన్నాడని జరిగిన గొడవ ఒకరి మరణానికి దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం నిశాని గ్రామానికి చెందిన లక్ష్మణ్ తనచేనులో వేరుశెనగ పంట వేశాడు. గురువారం మధ్యాహ్నం గ్రామానికే చెందిన మడావి గంగు (45) ఆ చేనులో వేరుశెనగకాయలు తింటుండగా లక్ష్మణ్ అతనితో గొడవపడ్డాడు.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన లక్ష్మణ్ రాయితో గంగు తలపై కొట్టటంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement