రిస్క్‌ తీసుకోవటం ఇష్టమా? | Would you like to risk it? | Sakshi
Sakshi News home page

రిస్క్‌ తీసుకోవటం ఇష్టమా?

Published Fri, Oct 6 2017 11:42 PM | Last Updated on Sat, Oct 7 2017 10:35 AM

 Would you like to risk it?

సాహసాలు చేయటం గొప్పే... రిస్క్‌ తీసుకుంటేనే జీవితంలో థ్రిల్‌ ఉంటుంది. ఇది అలవాటుగా మారితే?  ప్రతిదానికీ రిస్క్‌ చేయాలనుకుంటే? అతివిశ్వాసం మిమ్మల్ని నడిపిస్తే? ఫలితం...  పాజిటివ్‌ రిజల్ట్స్‌ కంటే నెగెటివ్‌ రిజల్ట్సే ఎక్కువ రావచ్చు, ఎన్నో అనర్థాలకు కారణం కావచ్చు.  కొన్ని విషయాల్లో రిస్క్‌ అవసరమైనా ఇది శృతి మించటమే మంచిది కాదు. మీరూ రిస్క్‌ బీయింగేమో ఒకసారి చెక్‌ చేసుకోండి.

1.    పదిమంది ఒక్కమాటపై ఉన్నా మీరు మాత్రం వారికి వ్యతిరేకంగా ఉంటారు.
    ఎ. అవును     బి. కాదు

2.     మీరు చేసే పని ఒప్పు అవుతుందనే నమ్మకం మీలో బలంగా ఉంది.
    ఎ. అవును     బి. కాదు

3.    ఏ పనైనా డెడ్‌లైన్‌ వచ్చేదాకా పూర్తిచేయరు.
    ఎ. అవును     బి. కాదు

4.    ప్రమాదకరమైన పందాలు (బంగీ జంప్, బైక్‌ వీలింగ్‌ మొదలైనవి) నిర్వహించేటప్పుడు, వాటిలో కచ్చితంగా పాల్గొనాలనుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు

5.    మీకు అనుభవంలేని వ్యాపారాలు/ ఇతర ఆదాయ మార్గాల్లో పెట్టుబడి పెడుతుంటారు.
    ఎ. అవును     బి. కాదు

6. ప్రమోషన్‌పై చాలా దూరంగా మీ కంపెనీ మిమ్మల్ని బదిలీ చేసినా, (బంధువులు, స్నేహితులు, తెలిసినవారు లేనిచోటికి) ప్రమోషన్‌ను స్వీకరిస్తారు.
    ఎ. అవును     బి. కాదు

7.    మీ స్నేహితులంతా కలిసి టూర్‌ వెళ్లే సమయంలో మీ ఆరోగ్యం సరిగా లేకపోయినా కార్యక్రమాన్ని వాయిదా వేయరు.
    ఎ. అవును     బి. కాదు

8.    ముఖ్యమైన నిర్ణయాలను తక్షణమే తీసుకుంటారు (ఆలోచించకుండా)
    ఎ. అవును     బి. కాదు

9.    ఇతరులను కామెంట్‌ చే స్తూ ఆనందిస్తారు.
    ఎ. అవును     బి. కాదు

10.     మేనేజర్‌తో మీటింగ్‌ జరుగుతున్నప్పుడు, సుపీరియర్స్‌ తీసుకున్న నిర్ణయం మీకు నచ్చకపోతే అక్కడే దానిని ఖండిస్తారు.
    ఎ. అవును     బి. కాదు

‘ఎ’ లు ఏడు దాటితే మీలో చాలెంజింగ్‌ స్పిరిట్‌ ఎక్కువపాళ్లలో ఉంటుంది. దీనివల్ల కొన్ని సార్లు ప్రమాదాలు మీ దరి చేరతాయి. అన్ని విషయాల్లో రిస్క్‌ తీసుకోకపోవటమే మంచిది. ‘బి’లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే మీరు రిస్క్‌ తీసుకోవటానికి దూరం. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు మీరు గురికారు. ‘ఎ’ లు నాలుగు లోపు వస్తే అవసరమైన విషయాల్లో మాత్రమే రిస్క్‌ తీసుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement