బాధితులను పరామర్శించిన నేతలు
సోమందేపల్లి: పెనుకొండ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పరామర్శించారు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పెనుకొండ ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చి బాధితులను ఓదార్చారు. గాయపడినవారికి వెంటనే చికిత్సలు అందచేయాలని వైద్యులను కోరారు. మార్చురీ వద్ద మృతదేహాలను చూ సి ఆయన చలించిపోయారు. రోధిస్తున్న బంధువులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పెనుకొండ కాంగ్రెస్ పార్గీ ఇన్‌చార్జ్ కెటి శ్రీధర్, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఇంటిలిజెన్స్ డీఎస్పీ కోలార్‌కృష్ణ, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గం వైఎస్సార్ సీపీ, తేదేపా, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. హిందూపురం రూరల్ ఎస్ ఐ, మడకశిర ఎస్‌ఐ, పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్ యాద వ్, మడకశిర సిఐ హరినాథ్, పెనుకొండ, సోమందేపల్లి, రొ ద్దం, పరిగి, హిందూపురం రూరల్ ఎస్‌ఐలు శేఖర్, నారాయణ, హరున్‌బాషా, రంగడు, ఆంజనేయులు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరవేశారు.
ఇలాంటి ఘటనలు బాధాకరం: బస్సు ప్రమాదం అత్యంత బాధకరమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల కిందట జరిగిన రైలు ప్రమాదాన్ని మరచిపోకముందే మరోసారి బస్సు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం మరచిపోలేనిదన్నారు. కండీషన్ లేని బస్సులు, ప్రమాదం స్థలం వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటనకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
బాధితులను ఓదార్చిన పీసీసీ అధ్యక్షుడు : పీసీసీ అధ్య క్షుడు రఘువీరారెడ్డి బుధవారం బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మావటూరు, బండపల్లి, నాగలూరు గ్రామాలకు వెళ్లి మృతదేహాలను సందర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన హిందూపురంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.