the victims
-
గల్ఫ్ ఏజెంట్ మోసం
కామారెడ్డి : పట్టణంలోని అశోక్‌నగర్ ప్రధాన రోడ్డులో కార్యాలయాన్ని నిర్వహిస్తూ గల్ఫ్ ఏజెంట్‌గా చెలామణి అయిన దోమకొండ మండలానికి చెందిన ఒకరు 60 మందిని మోసగించిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది నుంచి గల్ఫ్ దేశాలకు పంపించేందుకు రూ. 40 లక్షల వరకు వసూలు చేశాడు. ఏడాది కాలంగా ఏజెంట్ చుట్టూ తిరిగిన బాధితుల్లో 16 మందిని రష్యా దేశానికి పంపించాడు. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడి వెనుదిరిగిన బాధితులు ఏజెంట్‌ను నిలదీయగా డబ్బులు ఇస్తానని మభ్యపెట్టాడు. చివరకు ఐపీ నోటీసులు పంపించడంతో బాధితులు లబోదిబోమన్నారు. శుక్రవారం కామారెడ్డి కోర్టుకు హాజరైన బాధితులంతా తమ గోడును వెల్లబోసుకునేందుకు డీఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడ డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమ సమస్యను విన్నవించారు. బాధితుల వద్ద ఉన్న ఆధారాలతో ఏజెంట్‌పై కేసునమోదు చేస్తామని సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. -
పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు
మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కల్తీకల్లుకు అలవాటు పడిన వ్యక్తులు అది లభించకపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటి వరకూ 32 మంది చేరారు. వీరిలో అమరచింతకు చెందిన మునీశ్వరమ్మ, ఆత్మకూరుకు చెందిన జలీల్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పోలీసులు బాధితులకు బాసటగా నిలవాలి
వరంగల్ క్రైం : పోలీసులు పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు బాసటగా నిలవాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచించారు. భీమారంలోని శ్రీశుభం కళ్యాణ వేదికలో వార్షిక నేర సమీక్షా సమావేశం ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ వాకాటి కరుణ హాజరై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు ప్రశంసనీయమన్నారు. జిల్లా పోలీసులు అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరను విజయవంతం చేశారన్నారు. ప్రత్యేక ఉద్యమంలో కూడా పోలీసులు సంయమనంతో వ్యవహరించారని కొనియాడారు. పట్టణ ప్రాంతంలో ల్యాండ్ మాఫియా జడలు విప్పుతోందని, భూ ఆక్రమణదారులను కట్టడి చేయడానికి రెవెన్యూ అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో గుడుంబా వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత పోలీసు కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు చేసిన వినతిపై కలెక్టర్వాకాటి కరుణ సానుకూలంగా స్పందించారు. ఎస్పీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ పోలీసులు ప్రజల విశ్వాసం పొందేలా పనిచేయాలన్నారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతోపాటు ట్రాన్స్పోర్ట్, ఫారెస్ట్, ఆర్టీసీ, ఆర్ఎఫ్ఎస్ఎల్, ఆర్ఎంఓ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, హౌసింగ్, ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమశాఖ, ఇతర శాఖల సమస్యలపై చర్చించారు. పోలీస్స్టేషన్ల వారిగా నమోదైన కేసులు, పెండింగ్ పిటిషన్లు, ఎంక్వైయిరీ, దర్యాప్తు జరుగుతున్న వివిధ కేసులు, ఆలస్యానికిగల కారణాలు, కేసుల పురోగతిపై జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. ఇటీవల ఉద్యోగవిరమణ పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామాంజనేయరెడ్డిని ఎస్పీతోపాటు జిల్లా పోలీసు అధికారులు ఘనం గా సత్కరించారు. సీఆర్పీఎఫ్ కమాండెంట్ అరవిందకుమార్, రూరల్, అర్బన్ అదనపు ఎస్పీలు కె.శ్రీకాంత్, జాన్ వెస్లీ, యాదయ్య, డిప్యూటీ డెరైక్టర్ ప్రాసిక్యూటర్ సర్ధార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బాధితులను పరామర్శించిన నేతలు
సోమందేపల్లి: పెనుకొండ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు పరామర్శించారు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ పెనుకొండ ప్రభుత్వాసుపత్రి వద్దకు వచ్చి బాధితులను ఓదార్చారు. గాయపడినవారికి వెంటనే చికిత్సలు అందచేయాలని వైద్యులను కోరారు. మార్చురీ వద్ద మృతదేహాలను చూ సి ఆయన చలించిపోయారు. రోధిస్తున్న బంధువులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెనుకొండ కాంగ్రెస్ పార్గీ ఇన్చార్జ్ కెటి శ్రీధర్, అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, ఇంటిలిజెన్స్ డీఎస్పీ కోలార్‌కృష్ణ, సమాచార శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, నియోజకవర్గం వైఎస్సార్ సీపీ, తేదేపా, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. హిందూపురం రూరల్ ఎస్ ఐ, మడకశిర ఎస్ఐ, పెనుకొండ సీఐ రాజేంద్రనాథ్ యాద వ్, మడకశిర సిఐ హరినాథ్, పెనుకొండ, సోమందేపల్లి, రొ ద్దం, పరిగి, హిందూపురం రూరల్ ఎస్ఐలు శేఖర్, నారాయణ, హరున్‌బాషా, రంగడు, ఆంజనేయులు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు చేరవేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం: బస్సు ప్రమాదం అత్యంత బాధకరమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ శంకర్ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల కిందట జరిగిన రైలు ప్రమాదాన్ని మరచిపోకముందే మరోసారి బస్సు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడం మరచిపోలేనిదన్నారు. కండీషన్ లేని బస్సులు, ప్రమాదం స్థలం వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడం ఈ ఘటనకు కారణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితులను ఓదార్చిన పీసీసీ అధ్యక్షుడు : పీసీసీ అధ్య క్షుడు రఘువీరారెడ్డి బుధవారం బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మావటూరు, బండపల్లి, నాగలూరు గ్రామాలకు వెళ్లి మృతదేహాలను సందర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన హిందూపురంలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. -
మీ ఫోన్‌కు లాటరీ తగిలింది
‘హలో సార్.. మీరు లక్కీ ఫెలో.. మా సంస్థ వంద మందికి లక్కీడిప్ నిర్వహించగా అందులో మీ నెంబర్ తగిలింది.. ఇందుకుగాను మీకు *లక్ష పాలసీని మేము ఇస్తాం.. మీరు కేవలం మీ ఫ్యామిలీతో మా ఆఫీస్‌కు వచ్చి అడ్రస్ ప్రూఫ్, ఐడీ, ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇస్తే చాలు..’ అని తరచూ ఫోన్లు చేసి కార్యాలయానికి రప్పిస్తారు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి *లక్ష పాలసీ అటు ఉంచితే వచ్చిన వారి నెత్తిన టోపీ వేసి వారితోనే *పది వేల నుంచి *20వేలు వసూలు చేస్తూ యథేచ్ఛగా దందాను మొదలెట్టారు.. వారి మాటలను నమ్మి డబ్బులు కట్టిన బాధితులంతా అసలు విషయాన్ని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.. ఇది ఎక్కడో కాదు, జిల్లా కేంద్రంలోనే ఇలా మోసం కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. క్లాక్‌టవర్ (మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ పట్టణం పద్మావతీకాలనీలో రెండేళ్ల క్రితం కార్వే అనే సంస్థను ప్రారంభించి జిల్లా వాసులను సిబ్బందిగా నియమించుకున్నారు. ‘ఇక మీరు లక్కీ ఫెలో...’ అంటూ వందల సంఖ్యలో బాధితుల నుంచి *70లక్షలకు పైగా వసూలు చేశారు. అంతలోనే తేరుకున్న బాధితులు అప్పటి కలెక్టర్ పురుషోత్తంరెడ్డికి ఫిర్యాదు చేయడంతో పోలీసులను రంగంలోకి దింపారు. దీంతో సంస్థ అసలు బాగోతం బయటపడింది. అంతా బోగస్సేనని తేలడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి బాధితులరే డబ్బులు తిరిగి ఇప్పించేశారు. ఈ సంఘటన మరువకముందే ఇప్పుడు మరో సంస్థ అదే స్థానంలో వెలసింది. ఈ సంస్థ అన్ని టెలీ కమ్యూనికేషన్లలో ఉన్న వినయోగదారుల నంబర్లను సంపాదించుకుంది. ప్రతిరోజూ వంద మందికిపైగా ఫోన్లు చేస్తూ యథేచ్ఛగా టోకరా వేస్తోంది. ఈ సంస్థ చేతిలో ఇంతవరకు 500మందికిపైగా డబ్బులు చెల్లించి దిక్కుతోచని పరిస్థితిలో ఉండి వాటిని రాబట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో పనిచేసే వారు రోజులో ఎవరికైనా ఫోన్లు చేసి లక్కీ ఫెలో అంటూ మాయమాటలు చెప్పి వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇది జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నా పట్టించుకునే నాథుడు కానీ, చర్యలు తీసుకునే వారే కరువయ్యారు. ఇలా వెలుగులోకి.... ఈనెల 20న ఆత్మకూర్ పట్టణానికి చెందిన ఇసాక్‌కు ఫోన్ చేసి లక్కీ ఫెలోఅంటూ మాయమాటలు చెప్పడంతో అతను భార్య మరియమ్మతో కలిసి కార్యాలయానికి వెళ్లాడు. తమది రిలయన్స్ ఇన్సూరెన్స్ కార్యాలయం అని చెప్పి రకరకాల మాయమాటలు చెప్పారు. *లక్ష మీకు రావాలంటే ముందుగా *పది వేలు చెల్లించాలని పట్టుబట్టారు. దీంతో అతను చేసేదిలేక తన భార్య పేరిట *8,500 చెల్లించగా వారు ‘ఐఐఎఫ్ఎల్’కు చెందిన రశీదును ఇచ్చారు. ఇది చూసిన బాధితులు ‘రిలయన్స్ అన్నారు, ఇదేమిటి..’ అని ప్రశ్నించగా, అంతా నెలరోజులు ఆగితే తమకే తెలుస్తుందని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆయన తనకు తెలిసిన బంధువులను సంప్రదించి సంస్థ ప్రతినిధులను గట్టిగా నిలదీయగా తీసుకున్న డబ్బులను తిరిగిచ్చేశారు. ఇలాంటి మోసపూరిత సంస్థను తనలా ఎవ రూ డబ్బులు కట్టి మోసపోవద్దని, ఇలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.