మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కల్తీకల్లుకు అలవాటు పడిన వ్యక్తులు అది లభించకపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటి వరకూ 32 మంది చేరారు. వీరిలో అమరచింతకు చెందిన మునీశ్వరమ్మ, ఆత్మకూరుకు చెందిన జలీల్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.