మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపాలెం పంచాయతి పరిధిలోని లచ్చిరాంతండలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు రవి(33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కరెంటు వైర్లు తాకడంతో.. రైతు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.