ముంబై: బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. రిలేటెడ్ పార్టీ (బ్యాంకు యాజమాన్యాలతో సంబంధం కలిగిన వారితో లావాదేవీలు) లావాదేవీలు పరంగా ఉండే రిస్క్ నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు ‘‘నా వరకు భారత్ వంటి దేశంలో బ్యాంకులను కలిగి ఉండేందుకు కార్పొరేట్లను అనుమతిస్తే పెద్ద రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన యాజమాన్యాలతో, నిపుణుల ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులే మనకు కావాలి’’ అని సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబినార్‌లో భాగంగా రజనీష్‌కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment