చైనా పట్ల అమెరికాకు ఉన్న వక్రీకరణ వైఖరిని మార్చుకోవాలి లేదంటే సంఘర్షణ కాస్త ఘర్షణగా మారుతుందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ యద్ధం విషయంలో రష్యాతో గల సన్నిహిత సంబంధాలపై తమ వైఖరిని వక్రీకరించొద్దంటూ ఆయన హెచ్చరించారు. ఎప్పటికీ చైనాను అణిచి వేయడం, అదుపు చేయడం వంటి పనుల్లో యూఎస్ నిమగ్నమవ్వుతోందంటూ క్విన్ గ్యాంగ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీజింగ్‌లోని వార్షిక పార్లమెంటు సమావేశం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా పట్ల యూఎస్ అభిప్రాయాలు, అవగాహనలు వక్రీకరించి ఉన్నాయని అన్నారు. చైనాను యూఎస్ ప్రాథమిక ప్రత్యర్థిగా చేస్తోంది. దీని పర్యవసానం భౌగోళిక రాజకీయ సవాలుగా మారుతుందన్నారు. ఇది చొక్కాలోని మొదటి బటన్‌ని తప్పుగా పెట్టడం లాంటిదని చెప్పారు. యూఎస్ ఎప్పుడూ ఉద్రిక్తతలు, సంక్షోభాలు తలెత్తకుండా ద్వైపాక్షిక సంబంధాలతో రక్షణ కవచాలను ఏర్పరుచుకుంటుందే తప్ప సంఘర్షణ కోరుకోదని వల్లిస్తుంటుంది అన్నారు క్విన్. కానీ ఆచరణ పరంగా అమెరికా భావం ఏంటంటే చైనాపై అపవాదులు, దాడులు చేసినప్పటికీ తమ దేశం స్పందిచకూడదు లేదా దాడి చేయకుండా కట్టడి చేయాలనుకుంటుందన్నారు.
ఇలాంటి వాటికి అమెరికా చెక్‌పెట్టకుండా తప్పుడు మార్గంలో కొనసాగిస్తే పట్టాలు తప్పడమే కాకుండా ఎన్ని రక్షణదారులు ఉన్న వాటిని నిరోధించలేవు అని హెచ్చరించారు. పైగా సంఘర్షణ ఘర్షణగా మారి విపత్కర పరిణామానికి దారితీస్తుందన్న అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్‌కిర్బీ.. క్విన్ విమర్శలను తిప్పికొట్టారు. బీజింగ్‌తో ఘర్షణ పడాలని ప్రయత్నించడం లేదని నొక్కి చెప్పారు. తాము చైనాతో వ్యూహాత్మక పోటీని కోరుకుంటున్నామే గానీ వివాదాన్ని కాదని చెప్పారు. చైనాని ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉంచామని చెప్పారు.
(చదవండి: ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!)
Comments
Please login to add a commentAdd a comment