Attitude
-
‘బాబు.. అధికారులను అవమానించడం సమంజసమేనా?’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అప్పుడే తప్పులు చేయడం ఆరంభించినట్లు అనిపిస్తుంది. వయసు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఈసారి అందరి అభిమానాన్ని చూరగొనేలా ప్రభుత్వాన్ని నడిపితే మంచి పేరు వస్తుంది. టీడీపీ కొద్ది రోజుల క్రితం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అనుసరించిన వైఖరి కానీ, పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరించిన తీరు కానీ చర్చనీయాంశం అవుతున్నాయి.కౌంటింగ్‌లో టీడీపీ గెలుస్తోందన్న సంకేతం వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులకు పైగా పార్టీ శ్రేణులు, గూండాలు విరుచుకుపడ్డ వైనం, చెలరేగిన హింసాకాండ చంద్రబాబుకు అప్రతిష్ట తెచ్చిపెట్టాయి. అయినా ఆయన దానిని లెక్కలోకి తీసుకున్నట్లు కనిపించదు. ఆయన ధోరణి గమనించిన పోలీసు ఉన్నతాధికారులు కొట్టుకు చావండి.. వైఎస్సార్సీపీ వారిని చంపితే చంపండి అన్న రీతిలో ఉదాసీనంగా ప్రవర్తించారు. ఇది దారుణమైన విషయం. వెంటనే అదుపు చేయాలని చంద్రబాబు ఆదేశించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి ప్రభుత్వ విధానం ఏమిటో అర్ధం అవుతుంది.ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కనుక సంప్రదాయం ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంతా వచ్చి ఆయనను కలుస్తారు. కానీ గతంలో తనను ఆయా స్కామ్‌లలో అరెస్టు చేసిన కొందరు అధికారులను తన ఇంటివైపు రానివ్వలేదు. సచివాలయంలో చంద్రబాబు పదవీబాధ్యతలు తీసుకున్న తదుపరి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన అధికారుల పట్ల ఆయన చాలా కఠిన వైఖరి అవలంబించారు. ఈ అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ పాత్ర పోషించారన్నది ఆయన భావన కావచ్చు. వారి నిర్ణయాల వల్ల టీడీపీకి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమో తెలియదు. అయినా తనకు అధికారం వచ్చిన తర్వాత దానిని పట్టించుకోకుండా పాలన సాగించడం సాధారణంగా జరుగుతుంటుంది. అలాకాకుండా పాత విషయాలను గుర్తులో ఉంచుకుని అధికారులను వేధించాలని, అవమానించాలని చంద్రబాబు వంటి సీనియర్ నేత తలపెట్టడం వ్యవస్థలకు మంచిది కాదు.సీనియర్ అధికారులను కిందిస్థాయి సిబ్బందితో చెప్పించి వెనక్కి పంపించడం, పుష్పగుచ్చం ఇవ్వడానికి చొరవ తీసుకుంటే వారికి అవకాశం ఇవ్వకుండా నిరోధించడం వంటివి జరగడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఒక పక్క గత ప్రభుత్వం వ్యవస్థలను ద్వంసం చేసిందని చెబుతూ, ఇప్పుడు అంతకు మించి విద్వంసం చేసేలా ప్రవర్తిస్తే దాని ప్రభావం ఇతర అధికారులపై కూడా పడుతుంది. కీలకమైన బాధ్యతలలో ఉన్న అధికారులు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఎక్కువ సందర్భాలలో పనిచేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అలాగే జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం అయినా అంతే. చంద్రబాబు ఇచ్చే ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏ అధికారి అయినా వెళతారా? ఆ ఆదేశాలు సరికాదని సంబంధిత అధికారి భావించినా, దానిని ఫైల్ మీద రాస్తారేమో కానీ, అంతిమంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వినవలసి ఉంటుంది. దీనిని విస్మరించి చంద్రబాబు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది.పని అప్పగించి సరిగా నెరవేర్చకపోతే అప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తే అదో పద్దతి. అలాకాకుండా వారు కనిపించగానే అవమానించే రీతిలో వ్యవహరిస్తే మిగిలిన ఆఫీసర్లలో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో గుర్తించాలి. ఒకవేళ వారు గత ప్రభుత్వ టైమ్‌లో ఏదైనా తప్పు చేశారని అనుకుంటే వారిపై విచారణకు ఆదేశించి చర్య తీసుకోవచ్చు. అది ఒక సిస్టమ్. కానీ అందరి మధ్యలో వారిపట్ల అమానవీయంగా చికాకు పడితే అది తప్పుడు సంకేతం పంపుతుంది. ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై కక్ష కట్టి అవమానించారన్న అభిప్రాయం ఏర్పడింది. ఆయన సెలవుపై వెళ్లారు. గతంలో ఆయన లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖను పర్యవేక్షించారు. లోకేష్ వద్ద పనిచేశారు కనుక, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఉన్నారా? లేదే! అదే జవహర్ రెడ్డిపై వీరికి ఎందుకో కోపం వచ్చింది.ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట. ప్రవీణ్ ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో విద్యారంగానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకు వచ్చారు. స్కూళ్ల రూపు రేఖలు మార్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సమయంలో టీచర్లతో గట్టిగా పనిచేయించే యత్నంలో కొంత విమర్శకు కూడా గురి అయ్యారు. టీచర్ల సంఘాలు ఆయనపై కక్ష కట్టాయి. ఇందులో ఆయన తప్పులు ఏమున్నాయో తెలియదు. కేవలం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు సన్నిహితంగా మెలిగారన్న కారణంగా ప్రవీణ్ ప్రకాశ్ పట్ల అసహనంగా ఉండడం సరైనదేనా అనే చర్చ వస్తుంది.మరో సీనియర్ అధికారి అజయ్ జైన్ పై కూడా చంద్రబాబు గుర్రుగా ఉన్నారని వార్తలు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ఏర్పాటులో జైన్ ప్రముఖ పాత్ర వహించారు. అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. కాకపోతే ఆయన ఎవరు అధికారంలో ఉంటే వారిని పొగుడుతారన్న భావన ఉంది. 2014లో చంద్రబాబు పాలన టైమ్ లో కూడా ఆయన కీలకంగానే ఉన్నారు. తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. దీనికి అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తారు. ఆ విషయాన్ని విస్మరించి ఆయనపై కూడా ద్వేషం పెట్టుకోవడం సరికాదు. మరో అధికారి శ్రీలక్ష్మి పుష్పగుచ్చం తీసుకు వస్తే ఆమె వైపు చూడడానికి కూడా సుముఖత కనబరచలేదట. ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే.అలాగే సునీల్ కుమార్, రఘురామిరెడ్డి , పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి మరికొందరు అధికారులతో కూడా అలాగే వ్యవహరించారట. ఏ అధికారి అయినా సంబంధిత ప్రభుత్వం ఏమి చెబితే దానికి అనుగుణంగానే పనిచేస్తారు. ఆ ప్రభుత్వ విధానాలతోనే వెళతారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే వారి ఆదేశాలను పాటిస్తారు. ఇది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఒకవేళ ఆ అధికారులపై సరైన అభిప్రాయం లేకపోతే వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వరు. విశేషం ఏమిటంటే ఆయా ముఖ్యమంత్రులు తమకు మొదట ఇష్టం లేరన్న అధికారులు తదుపరికాలంలో వారికి సన్నిహితులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇంకో విషయం చెప్పాలి. చంద్రబాబు వద్ద పనిచేసిన ఒక సీనియర్ అధికారి స్వచ్చంద పదవీ విరమణ చేసి ఆయన కంపెనీలలో సీఈఓ ఉద్యోగంలో చేరారు. అంటే వారి మధ్య అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయనే కదా! మరో పోలీసు అధికారి తెలుగుదేశం పార్టీ అంతరంగిక వ్యవహారాలలో కూడా యాక్టివ్ గా ఉండేవారు. మరి దానిని ఏమంటారు. గత ప్రభుత్వాన్ని తప్పు పట్టి, ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం చంద్రబాబుకు కొత్తకాదు. ఆయన అధికారంలో ఉంటే అధికారులంతా సచ్చీలురుగా ఉన్నట్లు, లేకుంటే పాడైపోయినట్లు చెబుతుంటారు. ఇప్పుడు అదే పంధా అనుసరిస్తున్నట్లుగా ఉంది.ఇంకోరకంగా చూస్తే వారివల్లే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని, తత్పఫలితంగా తాను అధికారంలోకి వచ్చానని ఆయన సంతోషించవచ్చు కదా! అలాకాకుండా కక్ష కట్టడం ఏమిటి! గత ప్రభుత్వంపై ప్రజలలో కసి ఏర్పడడానికి గత ఐదేళ్లలో జరిగిన విద్వంసకర పాలన అని, అందులో ఐఏఎస్, ఐపీఎస్ లకు పాత్ర ఉందని చంద్రబాబు అన్నారు. బాగానే ఉంది. మరి 2014 నుంచి 2019 వరకు పాలన చేసిన తర్వాత టీడీపీకి 23 సీట్లే ఎందుకు వచ్చాయి? అంతకుముందు 2004 ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది? అధికారుల శైలి వల్ల అని ఆయన చెబుతారా! అప్పట్లో కూడా ప్రజలలో అలాంటి అభిప్రాయం ఏర్పడినట్లా?ఉన్నతాధికారులు అప్పుడు కూడా తప్పుగానే ప్రవర్తించినట్లేనా అనే ప్రశ్నకు జవాబు దొరకదు.ఏది ఏమైనా అధికారులను బెదిరించడానికి ఇలా చేస్తున్నారా? లేక వారిపై ఏదైనా చర్య తీసుకోవడానికి ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియదు. కానీ ఇది ఒక చెడు సంప్రదాయం అవుతుందని చెప్పక తప్పదు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూడా చంద్రబాబు అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు అన్నారట. అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పిన అబద్దాలనే ఆయన కొనసాగిస్తున్నారని అనుకోవాలి. అది నిజమే అయితే ఆయన శాసనసభలో ఈ చట్టానికి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలి కదా! పైగా హైకోర్టులో నిలిచిపోయి ఉన్న చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు.కేంద్రం పంపిన ఈ నమూనా చట్టంపై జనంలో అవవగాహన కలిగించకుండా గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనానికి బాగానే వాడుకున్నారని చెప్పాలి. నైపుణ్య గణన అంటూ మరో ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దానిని ఎలా ఆచరణలోకి తీసుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇలా చంద్రబాబు తాను మారానని, ఎవరిపై కక్ష పూననని అంటూనే సీనియర్ అధికారులను అవమానించడంపై విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అధికారం ఎవరికి శాశ్వతం కాదని తెలిసినా, ఒక్కసారి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చాక, తమకు తిరుగులేదని ఎందుకు ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడం మనబోటి సామాన్యులకు కష్టమేనేమో!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తానెంతో జగమంత
ప్రతిమనిషి, సరిగా చెప్పాలంటే ప్రతి జీవి ప్రపంచం అంతా తన వంటిదనే అనుకుంటుంది. తన దృష్టికోణం లోనే చూస్తుంది. అందుకే అబద్ధాలాడేవారికి అందరూ అబద్ధాలు చెపుతారనే అభిప్రాయమే ఉంటుంది. ఎవరి మాటనీ ఒక పట్టాన నమ్మరు. తాను అబద్ధం చెప్పనప్పుడు ఎదుటివారు అబద్ధం చెపుతున్నారేమో అనే అనుమానం ఎందుకు వస్తుంది? పైగా తను చెప్పేది నిజం అని నమ్మమని ఒకటికి పదిసార్లు నొక్కి వక్కాణిస్తూ ఉంటారు. అవతలి వారు నమ్మరేమోననే సందేహం ఎందుకు వస్తుంది? తాను చెప్పే మాట మీద తనకే నమ్మకం లేదు కనుక. ఇతరులని మోసం చేసే గుణం ఉన్నవారు ఇతరులు తమని మోసం చేస్తారేమో నని భయపడుతూనే ఉంటారు. మోసం చేసే బుద్ధి తనకి లేక పోతే ఎదుటివారు తనని మోసం చేస్తారేమో ననే అనుమానం కూడా రాదు. పరాయి ఆడపిల్లలని చెడుదృష్టితో చూసేవారు తమ ఇంటి ఆడవారిని బయటకు పంపటానికి ఇష్టపడరు. దీనికి పెద్ద ఉదాహరణ రావణుడే. కనపడిన ప్రతి స్త్రీని కామదృష్టితో చూసి, చేజిక్కించుకోవా లనుకునే గుణం ఉన్నవాడు కనుకనే తన భార్యలని కట్టడిలో ఉంచాడు. మేలిముసుగు లేకుండా వారిని బయటికి రానిచ్చేవాడు కాదు. ఆ విషయాన్ని రావణ వధానంతరం యుద్ధభూమిలో పడి ఉన్న రావణుణ్ణి చూసి మండోదరి ‘‘మేలిముసుగు లేకుండా నీ భార్యల మైన మేము ఇక్కడికి వస్తే ఏమి అనటం లేదేమి?’’ అని ప్రశ్నించటంలో తెలుస్తుంది. అదే రావణుడు తన చెల్లెలు శూర్పణఖ విషయంలో అవేవీ పాటించ నక్కర లేదని చెప్పి స్వేచ్ఛగా వదిలేశాడు. రాక్షసవంశంలోనే పుట్టిన ప్రహ్లాదుణ్ణి ‘‘కన్నుదోయి కన్యకాంత లడ్డం బైన మాతృభావము చేసి మరలువాడు’’ అని పోతనామాత్యుల వారు వర్ణించారు. స్త్రీల పట్ల సద్భావం కలవాడు కనుక తన తల్లిని, ఇతర స్త్రీలని కూడా గౌరవభావంతో చూడటం తటస్థించింది. జంతువులన్నీ ఇతర జంతువులు, ముఖ్యంగా మనుషుల మీద దాడి చేయటానికి కారణం వాటికి ఉన్న అభద్రతా భావం. అవి ఎదుటి జంతువులని తినటమో, బాధించటమో చేస్తాయి కనుక ఎదుటి జంతువులు కూడా తమని బాధిస్తాయేమోనని ఎదురు దాడి చేస్తాయి. నాగుపాముని చూస్తే ఈ విషయం బాగా అర్థ మౌతుంది. మంచి జాతి సర్పం ఎదురు పడగానే మనిషి భయపడితే అది కూడా భయ పడుతుంది. దాని వంక ప్రేమగా, లేక భక్తితో చూస్తే అది కూడా అదే భావంతో చూసి తొలగిపోతుంది. అందుకే త్రాచుపాము కనపడగానే చేతులు జోడించి నమస్కారం చేసి కదలకుండా ఉండమని చెపుతారు. తేలుకి ఎదుటి ్ప్రాణి తనని బాధిస్తుందనే సందేహం ఉంటుంది కనుక ఏది అడ్డు తగిలితే దానిని కుట్టుకుంటూ పోతుంది. ఇటువంటి లక్షణాలే మనుషులలో కూడా కనిపిస్తాయి. అకారణంగా ఇతరులని బాధించేవారు, భయం వల్లనే బాధిస్తారు. పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది కదా! అదేవిధంగా ‘‘ఆత్మవత్ సర్వభూతాని’’ అని భావించి ఎదుటివారి కష్టం తనది భావించి తదనుగుణంగా స్పందించేవారు, ఎవరికి మేలు కలిగినా తమకే కలిగి నంతగా సంతోషించేవారు ఉన్నారు. ఎవరికి ఆపద కలిగినా వీరి కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎవరికి మంచి జరిగినా వీరు పండగ చేసుకుంటారు. అంటే, ఈ కోవకి చెందిన వారు జంతు ప్రవృత్తి నుండి కొంత ఎదిగినట్టు చెప్పవచ్చు. ఈ విధంగా ఉండి అందరు తన లాగానే ఉంటారు అనుకోవటం వల్ల లౌకికంగా నష్టపోయిన వారూ ఉన్నారు. కాని, మానవతా దృక్పథంలో వారు ఉన్నత స్థానానికి చేరుకున్నారని అర్థం. ప్రతిస్పందన కన్న సహ అనుభూతి ఉత్తమ స్థాయి. – ఎన్. అనంతలక్ష్మి -
వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్‌కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్!
చైనా పట్ల అమెరికాకు ఉన్న వక్రీకరణ వైఖరిని మార్చుకోవాలి లేదంటే సంఘర్షణ కాస్త ఘర్షణగా మారుతుందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ యద్ధం విషయంలో రష్యాతో గల సన్నిహిత సంబంధాలపై తమ వైఖరిని వక్రీకరించొద్దంటూ ఆయన హెచ్చరించారు. ఎప్పటికీ చైనాను అణిచి వేయడం, అదుపు చేయడం వంటి పనుల్లో యూఎస్ నిమగ్నమవ్వుతోందంటూ క్విన్ గ్యాంగ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీజింగ్‌లోని వార్షిక పార్లమెంటు సమావేశం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల యూఎస్ అభిప్రాయాలు, అవగాహనలు వక్రీకరించి ఉన్నాయని అన్నారు. చైనాను యూఎస్ ప్రాథమిక ప్రత్యర్థిగా చేస్తోంది. దీని పర్యవసానం భౌగోళిక రాజకీయ సవాలుగా మారుతుందన్నారు. ఇది చొక్కాలోని మొదటి బటన్ని తప్పుగా పెట్టడం లాంటిదని చెప్పారు. యూఎస్ ఎప్పుడూ ఉద్రిక్తతలు, సంక్షోభాలు తలెత్తకుండా ద్వైపాక్షిక సంబంధాలతో రక్షణ కవచాలను ఏర్పరుచుకుంటుందే తప్ప సంఘర్షణ కోరుకోదని వల్లిస్తుంటుంది అన్నారు క్విన్. కానీ ఆచరణ పరంగా అమెరికా భావం ఏంటంటే చైనాపై అపవాదులు, దాడులు చేసినప్పటికీ తమ దేశం స్పందిచకూడదు లేదా దాడి చేయకుండా కట్టడి చేయాలనుకుంటుందన్నారు. ఇలాంటి వాటికి అమెరికా చెక్‌పెట్టకుండా తప్పుడు మార్గంలో కొనసాగిస్తే పట్టాలు తప్పడమే కాకుండా ఎన్ని రక్షణదారులు ఉన్న వాటిని నిరోధించలేవు అని హెచ్చరించారు. పైగా సంఘర్షణ ఘర్షణగా మారి విపత్కర పరిణామానికి దారితీస్తుందన్న అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్‌కిర్బీ.. క్విన్ విమర్శలను తిప్పికొట్టారు. బీజింగ్‌తో ఘర్షణ పడాలని ప్రయత్నించడం లేదని నొక్కి చెప్పారు. తాము చైనాతో వ్యూహాత్మక పోటీని కోరుకుంటున్నామే గానీ వివాదాన్ని కాదని చెప్పారు. చైనాని ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉంచామని చెప్పారు. (చదవండి: ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!) -
సమంత యాటిట్యూడ్‌కు స్టార్ హీరో ఫిదా.. సినిమాలో అవకాశం!
అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగినవారిలో సమంత ఒకరు. మనోజ్ భాజ్‌పాయ్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత 'పుష్ప: ది రైజ్' చిత్రంలోని 'ఊ అంటావా మావ' సాంగ్‌తో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకుంది. దీంతో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది సామ్. ప్రస్తుతం సామ్ చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్స్ ఉన్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సమంత మరో హిందీ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ పాపులర్ షో 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో సామ్ అందచందాలతో అదరగొట్టడమే కాకుండా, ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన మాటలతో హుషారెత్తించింది. సమంతతోపాటు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా పాల్గొన్నాడు. అయితే ఈ షోలో సమంత యాటిట్యూడ్, మాట విధానం, చమత్కారంతో చెప్పిన సమాధానాలకు అక్కీ ఫిదా అయ్యాడట. దీంతో తన తర్వాతి సినిమాలో సమంతకు అవకాశం ఇచ్చినట్లు హిందీ ఫిల్మీ దునియాలో టాక్ నడుస్తోంది. చదవండి: దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. ఇదివరకే ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో నటించిన సామ్ పాపులారిటీ ఓ రేంజ్‌కు వెళ్లింది. ఒకవేళ అక్షయ్ కుమార్ సినిమాలో సమంత చేయడం నిజమైతే ఆమె మరోస్థాయికి వెళ్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కాగా ప్రస్తుతం హిందీలో వరుణ్ ధావన్‌తో సామ్ సినిమా ఉండనుంది. చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్.. -
విరాట్ కోహ్లిపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
Sourav Ganguly Comments About Virat Kohli.. కోహ్లి వన్డే కెప్టెన్సీ తొలగింపు వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంతవరకు ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. అయితే బోర్డు అంతర్గత విషయాలను కోహ్లి బయటకు చెప్పడం ఏంటని కొందరు గుర్రుగా ఉండగా.. మరికొందరు కోహ్లికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే గంగూలీకి, కోహ్లికి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవలే జరిగిన ఒక మీడియా సమావేశంలోనూ గంగూలీ వద్ద కోహ్లి కెప్టెన్సీ తొలగింపు విషయాన్ని ప్రస్తావించగా.. ''ఇక్కడితో వదిలేయండని.. అంతా బీసీసీఐ చూసుకుంటుందని'' సమాధానమిచ్చాడు. చదవండి: Virender Sehwag: కోహ్లి కెప్టెన్సీ వివాదం: సెహ్వాగ్ భయ్యా ఎక్కడున్నావు!? తాజాగా డిసెంబర్ 18న గురుగ్రామ్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి గంగూలీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో గంగూలీ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి ఈ కార్యక్రమంలో ఏ క్రికెటర్ యాటిట్యూడ్ మీకు బాగా నచ్చిందనే ప్రశ్న గంగూలీకి ఎదురైంది. దీనికి గంగూలీ నోటి నుంచి కోహ్లి పేరు సమాధానంగా రావడం ఆసక్తి కలిగించింది. '' విరాట్ కోహ్లి వైఖరి(యాటిట్యూడ్) నాకు చాలా ఇష్టం. అతను చాలా పోరాటపటిమను చూపిస్తాడు. కానీ కోపం ఎక్కువ.'' అని చెప్పుకొచ్చాడు. ఒక రకంగా కోహ్లీతో ఇటీవల జరిగిన ఘర్షణకు సంబంధించి గంగూలీ నేరుగా ఈ విషయాన్ని చెప్పకపోయినా.. హావభావాల్లో మాత్రం భారత మాజీ కెప్టెన్ కూడా తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇక జీవితంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. “జీవితంలో ఒత్తిడి అనేది ఉండదు. మనకు ఒత్తిడిని భార్య, స్నేహితులు మాత్రమే ఇస్తారు” అని సరదాగా పేర్కొన్నాడు. చదవండి: IND Vs SA: భారత జట్టు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్! ఇక గంగూలీపై కోహ్లి చేసిన వ్యాఖ్యల పట్ల బోర్డు ఏ మేరకు చర్యలు తీసుకుంటుందోనని ఆసక్తి రేకేత్తించింది. అయితే టీమిండియాకు దక్షిణాఫ్రికా పర్యటన ముఖ్యం కావడంతో ఇప్పుడున్న కోహ్లి వివాదాన్ని కొనసాగించడానికి బీసీసీఐ ఇష్టపడడం లేదు. అందువల్ల ఈ విషయంలో బోర్డు ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా పత్రికా ప్రకటనను జారీ చేయడం లేదని సమాచారం. ఇప్పటికే దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్టు ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ గాయంతో దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
టీడీపీ నేతల్లో అంతర్మథనం.. అడకత్తెరలో ‘ఆ ముగ్గురు’!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి(కృష్ణా జిల్లా): మీది తెనాలి, మాది తెనాలి.. మనం మనం బరంపురం.. తెలుగు సినిమాల్లోని పాపులర్ డైలాగ్‌లివి.. మనమంతా ఒకటేనని తెలియజెప్పే సన్నివేశాలకు సంబంధించినవి. తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నేతల తీరు చూస్తే అచ్చం సినిమాల్లోని సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) వ్యవహారశైలిని నిశితంగా గమనిస్తే ఆయనిక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కలవబోరని స్వపక్షీయులు భావించారు. (చదవండి: గెస్ట్ ‘హౌస్’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ) చంద్రబాబు కూడా కేశినేనిని తన దరి చేరనీయబోరని స్పష్టమైన అంచనాలో ఉన్నారు. కానీ ఆ పార్టీలోని ముఖ్య నాయకుల ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కసారిగా తల్లకిందులయ్యాయి. మరీ ముఖ్యంగా విజయవాడ నగరానికి చెందిన మాజీ ఎమ్యెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మరో ముఖ్య నాయకుడు నాగుల్ మీరాలది కక్కలేని మింగలేని పరిస్థితి. పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ముగింపునకు కొన్ని గంటల ముందు నుంచి తాజాగా సోమవారం చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అనంతర పరిణామాలను నిశితంగా గమనిస్తే ఔరా! నాయకుల మాటలకు అర్థాలే వేరులే అన్నది రూఢీ అవుతోంది. చదవండి: ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం.. విజయవాడ టీడీపీలో ముసలం.. సాధారణ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేలుగా వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్‌లు గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ చిరునామా కరువైన పరిస్థితులు.. మున్సిపల్ ఎన్నికల్లో, మరీ ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తీసికట్టే అయ్యింది. కార్పొరేటర్లకు సీట్ల కేటాయింపు, ప్రచార సమయంలో కేశినేని నానికి బొండా, బుద్ధా, నాగుల్‌మీరా వర్గాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. నాని తన కుమార్తె శ్వేతను మేయర్ అభ్యర్థని స్వయం ప్రకటన ఎలా చేస్తారంటూ విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ దుమ్మెత్తిపోశారు. ఇదంతా కూడా చంద్రబాబునాయుడుకు తెలిసే జరిగిందని కేశినేని వర్గం అభిప్రాయపడుతూ వచ్చింది. ♦తానిక పార్టీ కార్యక్రమాలలో పాల్గొనబోనని, ఎన్నికలకు దూరంగా ఉంటానని, కార్పొరేటర్ అయిన తన కుమార్తె శ్వేత పరిస్థితి కూడా అంతేనని ఎంపీ తేల్చి చెప్పేశారు. ఇటీవలే కేశినేని భవన్లో చంద్రబాబు ఫొటోను పీకి పారేయించి అదే స్థానంలో రతన్‌టాటాతో తాను కలిసి ఉన్న ఫొటోను నాని ఏర్పాటు చేయించారు. ♦చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపిన సమయంలో ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు కరకట్ట వెంబడి ఉన్న చంద్రబాబు ఇంటి వద్దకు ప్రశ్నించడానికి వెళ్లారు. ఆ సమయంలోనూ పార్టీకి, చంద్రబాబుకు సానుకూలంగా నోరు విప్పలేదు సరికదా కొందరు ముఖ్యనాయకులు స్టేట్మెంట్ ఇవ్వాలని కోరినా.. ‘ఛత్, నేనా, అతనికి అనుకూలంగా మాట్లాడటమా’ అంటూ కేశినేని ఈసడించుకున్నారని స్వపక్షీయులే గుర్తుచేస్తున్నారు. వారి రాయబారంతో.. పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన నేపథ్యంలో పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. దీనిపై కూడా ఎంపీ స్పందించలేదు. ఉన్నదే ముగ్గురు లోక్‌సభ సభ్యులు. అందులోనూ విజయవాడ, గుంటూరు ఎంపీలు సానుకూలంగా స్పందించకపోతే ఎలాగని పార్టీకి సానుకూలంగా ఉండే సామాజికవర్గం పెద్దలు మదనపడ్డారు. అధినేత సూచనలతో టీడీ జనార్ధన్, ధూళిపాళ్ల నరేంద్రలు కేశినేని వద్దకు రాయబారం నడిపారు. ఆ తర్వాత విజయవాడ, జిల్లాలోని అదే వర్గానికి చెందిన కేశినేనికి సన్నిహితులైన మరికొందరు సముదాయించారని విశ్వసనీయ సమాచారం. బాబు మంతనాలతో.. మొత్తానికి మెత్తబడిన కేశినేనిని బాబు నిరసనదీక్ష వద్దకు తీసుకెళ్లిన రాయబారులు ప్రసగించాలని కోరగా.. తొలుత ససేమిరా అంటూ భీష్మించుకున్నారు. ఆ తరువాత బాబు దీక్ష వద్ద నుంచి బస్సులోకి చేరి కేశినేనితో మంతనాలు జరిపి మాట్లాడేందుకు ఒప్పించడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. వీటన్నింటినీ బొండా, బుద్ధాల బ్యాచ్ నేరుగానే గమనించింది. ‘వాళ్లూ.. వాళ్లు’ ఒక్కటయ్యారా? చంద్రబాబు బస్సులోకి వెళ్లి మంతనాలు జరిపిన తర్వాత కేశినేని వీరావేశంతో దీక్ష వద్ద ప్రసంగించారు. సవాళ్లు విసిరారు. సోమవారం ఢిల్లీలోనూ కేశినేని చురుగ్గా వ్యవహరించిన నేపథ్యంలో తమ పరిస్థితి ఏంటనే మథనం బొండా, బుద్దా, మీరాల్లో మొదలైంది. ‘వాళ్లూ వాళ్లు ఒక్కటయ్యారు. ఆ వర్గం వారందరూ కూడబలుక్కున్నారు. మా విషయంలో కేశినేని డిమాండ్ ఏంటో? అధినేత ఆయనకు ఏం హామీ ఇచ్చారో?’ అంటూ ముగ్గురూ మల్లగుల్లాలు పడుతున్నారనేది సమాచారం. ‘చివరకు అటుఇటూ కాకుండా మధ్యలో నలిగిపోయేది మనమేనా?’ అని ఆ ముగ్గురి ముఖ్య అనుచరులు వాపోతున్నట్లు తెలిసింది. మొన్న ఎన్నికల సమయంలో కార్పొరేటర్ల టిక్కెట్ల కేటాయింపులో కేశినేని వ్యవహారశైలి తేలిపోయిన నేపథ్యంలో తమపట్ల ఇక మౌనంగా ఎందుకు ఉంటారనే అనుమానాలు కూడా వారిలో వ్యక్తమవుతున్నాయి. -
పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా ప్రభుత్వాలు అనేక ఆంక్షలను విధించాయి. ఈ నిబంధనలు వివాహాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా ఎంతో ఆడంబరంగా, బంధువులు, స్నేహితుల సమక్షంలో జరగాల్సిన వేడుక కాస్తా కొద్ది మంది సమక్షంలోనే జరుపుకోవాల్సి వస్తోంది. అయితే, లాక్ డౌన్ పుణ్యామా అని ఇటీవల జరిగిన అనేక పెళ్లిళ్లలో ఏదో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుండగా దానికి సంబంధించిన క్లిప్పింగ్‌లు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇక్కడ చెప్పుకునే పెళ్లి వేడుక కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ పెళ్లిలో వధువు, తన చేతిలో కొన్ని పువ్వులను పట్టుకుని స్టేజీ మీదకు ఎక్కి కాబోయే వరుడి ముందుకు వెళ్లి నిలుచుంది. సాధారణంగా ఆ పువ్వులను వరుడి తల మీద కానీ లేదా పాదాల మీద గానీ వేస్తుందనుకున్నారంతా! కానీ, అనూహ్యంగా ఆమె కోపంతో తన చేతిలోని పువ్వులను వరుడి ముఖం మీదకు విసిరి కొట్టింది. ఊహించని చర్యతో షాకైన వరుడు ఏంచేయాలో అర్థంకాక బిత్తర ముఖం పెట్టుకొని అలాగే నిల్చుండిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఆ అమ్మాయికి పెళ్లంటే ఇష్టం లేదేమో’, ‘అయినా, ఇదేం ఆటిట్యూట్’, ‘ ఇంకా.. నయం వరుడిని కొట్టలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఒక వివాహంలో వరుడు వెరైటీగా వధువు కాళ్లకు దండం పెట్టగా, మరో వివాహంలో వధువు, వరుడు బాటిల్‌తో ఆడుకున్నారు. ఇంకో పెళ్లిలో కొత్త పెళ్లికూతురు ఏకంగా స్టేజీపై తుపాకీని కాల్చడం వంటి ఘటనలు కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే! చదవండి : పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. ఎందుకో తెలుసా -
ట్రంప్ వైఖరి ఇబ్బందికరమే
వాషింగ్టన్: ఎన్నికల్లో ఓడిపోయినా ఆ విషయాన్ని అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఇబ్బందికరమేనని కొత్త అధ్యక్షుడు, డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ తెలిపారు. అధ్యక్షుడిగా ట్రంప్ తప్పుడు సంకేతాలు పంపుతున్నారని పునరుద్ఘాటించారు. అధికార మార్పిడికి సంబంధించిన తన ప్రణాళికలకు అడ్డంకులేవీ రాలేదని, ప్రపంచదేశాల నేతలతో మాటాలు కలపడం మొదలుపెట్టానని బైడెన్ డెలవేర్‌లోని విల్మింగ్టన్లో చెప్పారు. అధికార మార్పిడి ప్రక్రియను మొదలుపెట్టేందకు ట్రంప్ యంత్రాంగం నిరాకరించినా నిష్ప్రయోజనమని, తాము చేయాల్సింది చేస్తామని స్పష్టం చేశారు. జనవరి 20వ తేదీకి అన్నీ సక్రమంగానే పూర్తవుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆరు దేశాల నేతలు తనకు ఫోన్ చేశారని, యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల వారు ఇందులో ఉన్నారని చెప్పారు. బైడెన్ బృందంలో 20 మంది... ప్రస్తుత ట్రంప్ నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వ విభాగాల సమీక్ష కోసం బైడెన్ ఏర్పాటు చేసిన సమీక్ష బృందాల్లో 20 మందికిపైగా భారతీయ అమెరికన్లున్నారు. వీరిలో ముగ్గురు ఆయా బృందాలకు నేతృత్వం వహిస్తున్నారు. అధ్యక్ష మార్పిడి సాఫీగా జరిగేందుకు ఈ సమీక్ష బృందాలు ఉపయోగపడతాయని అంచనా. అమెరికా చరిత్రలో ఇంత వైవిధ్యతతో కూడిన సమీక్ష బృందం ఏదీ లేదని బైడెన్ వర్గం తెలిపింది. ఈ బృందాల్లో సగం మంది మహిళలు. సుమారు 40 శాతం మంది చారిత్రకంగా కేంద్ర ప్రభుత్వంలో తగిన ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందిన వారు. విద్యుత్తు పరమైన అంశాల సమీక్షకు ఏర్పాటు చేసిన బృందానికి స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన అరుణ్ మజుందార్ నేతృత్వం వహిస్తూండగా, మాదకద్రవ్యాల నియంత్రణ బృందానికి రాహుల్ గుప్తా, ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్మెంట్కు కిరణ్ అహూజాలు నేతృత్వం వహిస్తున్నారు. ప్రవీణా రాఘవన్, ఆత్మన్ త్రివేదీ, శుభశ్రీ రామనాథన్, రాజ్ డే, సీమా నందా వంటి వారికీ చోటు దక్కింది. -
బాబుగారు నంది అంటే నంది!
‘‘మా ఇష్టం. మేం చెప్పిందే వేదం. మేం నంది అంటే నంది. కాదంటే కాదు. మేం అన్నట్టే మీరూ అని తీరాలి..’’ ఇదీ ఘనత వహించిన గత సర్కారువారు ఆంధ్రనాటకరంగం యావత్తూ ప్రతిష్టాత్మకంగా భావించే నంది నాటకోత్సవాల విషయంలో వ్యవహరించిన తీరు. చంద్రబాబు చేష్టలతో ఈ ఉత్సవాలు వాసితగ్గి, వన్నె తరిగి చివరకు పూర్తిగా చతికిలబడిపోయాయి. ఆంధ్రనాటకకళకు పూర్వవైభవం సాధించిపెట్టాలని, ఔత్సాహిక నాటకరంగాన్ని జనబాహుళ్యంలో ప్రవర్థమానం చేయాలని తలంచి నంది నాటకోత్సవాలను ఏలికలు ఎన్నో ఏళ్ల కిందటే ప్రారంభించారు. ఏడాదికోమారు ఈ నాటకోత్సవాలను నిర్వహించి ప్రతిభాప్రదర్శనలకు, వ్యక్తిగత నిపుణతకు నంది బహుమతులు అందజేయడం ఆరంభించారు. నంది పురస్కారాలు అందుకున్న నాటక సంఘాలు, నటీనటులు వాటిని కీర్తికిరీటాలుగా తలపోస్తుంటారు. ఒకప్పుడు నంది నాటకోత్సవాలకు దరఖాస్తు చేసుకునే నాటకసంఘాలు ముందుగా పరిశీలక బృందం ఎదుట తమ ప్రతిభా ప్రదర్శన చేస్తుండేవి. పద్యనాటకం, సాంఘిక నాటకం, సాంఘిక నాటిక, బాలల నాటికలుగా విభజితమైన విభాగాల్లో గుణనిర్ణేతలు స్క్రూటినీ చేసేవారు. రాష్ట్రమంతా ఇలాంటి ప్రదర్శనలను తిలకించి నంది నాటకోత్సవాలకు నాటకాలను, నాటికలను ఎంపిక చేసేందుకు న్యాయనిర్ణేతలు స్వయంగా సమాజాల గడపల్లోకే వెళ్లేవారు. తమ నిర్ణయాన్ని వెల్లడించేవారు. ప్రతీ విభాగంలోనూ ఎంపికైన పదో పన్నెండో నాటకాలు, నాటికలు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతంలో ప్రభుత్వం నిర్వహించే నంది నాటకోత్సవాలకు తరలివెళ్లేవి. సుమారుగా పదిరోజులపాటు నాటి కాలాన జరిగే ఈ నాటక మహోత్సవాలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వారికీ కన్నుల పండుగచేసేవి. ఎక్కడెక్కడి వారూ నంది పోటీలకు హాజరయి చక్కని నాటకాలు అద్భుతంగా ప్రదర్శితమవుతుంటే హాయిగా చూస్తుండేవారు. ఇలా సాగుతున్న ఈ వ్యవహారంలోకి ‘తగుదునమ్మా..’ అని చొరబడిపోయిన చంద్రబాబు సర్కారు నంది నాటకాలు నవ్వులపాలయ్యేలా నిర్ణయాలు చేయడమే విషాదం. తమది విశాల హృదయమంటూ ఊదరగొట్టి నంది నిబంధనలను మూడేళ్ల కిందట పాలకులు ఇష్టానుసారం మార్చేశారు. స్క్రూటినీలకు తెరదించేశామని ప్రకటిస్తూ అడ్డదిడ్డమైన నాటక ప్రదర్శనలన్నింటికీ లాకులు ఎత్తేశారు. యువజన నాటకాలను కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పి, పిల్లల నాటికల విభాగంలో వ్యక్తిగత బహుమతులను రద్దు చేశారు. నంది నాటకాలకు స్క్రూటినీలు లేవని ప్రభుత్వమే ప్రకటించడంతో నాటకప్రదర్శనలు వరదలా పొంగు కొచ్చేశాయి. అందరూ అని చెప్పలేం గానీ, కొంతమంది మటుకు ప్రభుత్వ పారితోషికం కోసం తలాతోకాలేని నాటకాలను వేదికకు చేర్చారు. వందల్లో మందల్లో వచ్చిన ఈ నాటకాలను చూడలేక ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. ఇక ‘నంది నాటకాలు ప్రదర్శించే వారికి పారితోషికం ఇస్తున్నాం కదా..’ అనే నెపం చూపించి ఉత్సవాలు జరిగే వేదికల వద్ద కనీస సదుపాయాలు కూడా అధికారగణం కల్పించడం మానేసింది. దీంతో దూరాభారాలనుంచి వచ్చే నటీనటులు ఆకలి బాధలతో, దాహం కేకలతో అల్లాడిపోవడం మొదలైంది. పోనీ అని, కప్పలతక్కెడగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో గెలిచిన వారికయినా గౌరవంగా నంది పురస్కారాలు అందించారా అంటే అదీ లేదు. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక అభివృద్ధి సంస్థ ప్రతినిధులూ బాబు కంటే రెండు ఆకులు ఎక్కువగానే చదివారు. గతేడాది నందులు పొందేందుకు విజేతలందరినీ ఏలూరు రమ్మనమని పిలిచి, వాళ్లకి నిలువ నీడ లేకుండా చేశారు. అందరినీ ఒక హాల్లో పడేసి సాయంత్రం సమావేశం వేళకి తోటకూరకాడల్లా వేళ్లాడిపోయే స్థితి కల్పించారు. అనేకానేక పథకాల పేరిట కోట్లాదిరూపాయల ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టిన బాబు సర్కారు కళాకారుల పట్ల నిర్దయగా వ్యవహరించడాన్ని అప్పట్లో నాటకరంగ ప్రముఖులే ఖండించారు. అయినప్పటికీ చంద్రుడు చలించలేదు. నంది నాటకాలు మళ్లీ గాడిన పడి పూర్వపు జిలుగులతో ఆంధ్రావనిలో విరాజిల్లాలంటే స్క్రూటినీలు నిర్వహించాలని పలువురు సీనియర్లు చెబుతున్న మాట. ఇప్పటి నంది నియమావళిని ప్రక్షాళన చేసి, బాలల క్యాటగిరీలో వ్యక్తిగత బహుమతులను పునరుద్ధరించకపోతే నాటక వికాసం ఒట్టిమాటే అవుతుందని వారంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు హయాంలో బక్కచిక్కిపోయిన నందిని, నటరాజ ప్రాంగణంలో మిలమిల మెరిసే బంగారునందిగా తీర్చిదిద్దవలసిన సమయం ఆసన్నమైంది. నాటకరంగ ప్రముఖుల, దిగ్ధంతుల సూచనలతో కొత్త ప్రభుత్వం తప్పకుండా ఈ దిశలో పయనించాలనేదే నాటకరంగ కళాకారుల కోరిక. అభ్యర్థన. వ్యాసకర్త ప్రసిద్ధ కథ, నవలా రచయిత, నాటక కర్త ‘ మొబైల్ : 88971 47067 డా: చింతకింది శ్రీనివాసరావు -
ఆ కూలీల మృతికి మీ వైఖరే కారణం: హైకోర్టు
* పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటారా? * పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయండి * పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డులకు హైకోర్టు ఆదేశం * తదుపరి విచారణ జూన్ 1కి వాయిదా సాక్షి, హైదరాబాద్: ఇద్దరు వలస కూలీల మృతి ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించారంటే తప్పును ఒప్పుకొన్నట్లేనని, మళ్లీ ఇటువంటి ఘటనలే జరిగితే అప్పుడు కూడా ఇలా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటారా.. అంటూ ప్రశ్నించింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ, సీవరేజీ బోర్డులను ఆదేశించింది. ఆయా శాఖలు చేయాల్సిన పనులను ప్రైవేటు వ్యక్తులు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ నిలదీసింది. డ్రైనేజీలను శుభ్రపరిచే విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటో కూడా స్పష్టంగా వివరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, సుల్తాన్‌బజార్ కాపాడియా లేన్‌లో డ్రైనేజీని శుభ్రపరిచేందుకు మ్యాన్‌హోల్‌లో దిగిన వలస కార్మికులు వీరాస్వామి, సాకలి కోటయ్య ఈ నెల ఒకటిన విషవాయువుల వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. -
మీరెటువంటివారో మీ గోళ్లే చెప్పేస్తాయి!
బాడీ లాంగ్వేజ్ 1. పొడవుగా ఉంటే... వీరు తేలికపాటి స్వభావం కలిగి ఉండి అత్యంత ఊహాత్మకతను, సృజనాత్మకతను కలిగి ఉంటారు. తేలికగా మోసపోగలరు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. 2. వెడల్పుగా ఉంటే... కొంచెం కోప స్వభావం కలిగి ఉంటారు. తమ మనసులోని మాటను సూటిగా స్పష్టంగా చెప్పగలరు. 3. గుండ్రటి లేదా గుడ్డు ఆకారంలో ఉంటే... వీరు స్నేహశీలియై ఉంటారు. తమకు నచ్చిన దారిలో పనులు చేసుకుంటూ వెళ్తారు. చుట్టుప్రక్కల ఏదైనా వాదనలు జరిగినప్పుడు వీరు మధ్యవర్తిగా ఉండి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు. 4. చదరంగా ఉంటే... తీవ్రమైన పట్టుదలను కలిగి ఉంటారు. ఏ పనైనా చేయగల సత్తా ఉంటుంది. వీరిది కొంచెం తీవ్రమైన వైఖరి. వీరిలో ఉండే కాఠిన్యం, గడుసుతనంవల్ల వీరి మంచితనం మరుగున పడిపో తుంది. 5. ముక్కోణ లేదా విలోమ త్రిభుజంలో ఉంటే... వీరు సున్నితమైన మనస్కులు, మేధావులు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇతరులు మరచిన ప్రతి చిన్న విషయాన్ని వీరు నిశితంగా గమనిస్తూ ఉంటారు. 6. బాదంకాయ ఆకారంలో ఉంటే... వీరు విశ్వసనీయులు నిజాయితీపరులు. వీరెంతో దయకలవారు. మరెంతో మర్యాదస్తులు. అయితే సహనం తక్కువ. వీరు ఒప్పుకోలేని విషయాలు ఎదురైనప్పుడు వెంటనే కోపం తెచ్చుకుంటారు. 7. కత్తి ఆకారంలో ఉంటే... వీరు ఆదర్శవాదులు. తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టపడి పని చేయడానికైనా వెనకాడరు. భవిష్యత్తులో ఉపయోగ పడుతుందనుకుంటే తమకు నచ్చని పనిని చేసేందుకు కూడా సిద్ధపడతారు. -
ముస్లింలు మోడీ ప్రభుత్వంపై వైఖరి మార్చుకోవాలి
న్యూఢిల్లీ: ముస్లింలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తమ వైఖరి గురించి పునరాలోచించుకోవాలని భారత ఇస్లాం సాంస్కృతిక కేంద్రం (ఐఐసీసీ) అధ్యక్షుడు సిరాజుద్దీన్ ఖురేషీ పిలుపునిచ్చారు. ముస్లింలు మైనారిటీ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని, దేశాభివృద్ధి కోసం సాయపడేందుకు ముందుకు రావాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వానికే గాక ముస్లిం సమాజానికి మేలు చేసినట్టు అవుతుందని ఖురేషి చెప్పారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖురేషీ మత పెద్దలతో సమావేశమయ్యారు. నరేంద్ర మోడీతో ఇటీవల సమావేశమైన విషయం గురించి చర్చించారు. అనంతరం ఐఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించాలని మోడీని కోరానని, దేశ పౌరులుగా మనం ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కలిగిఉండాలని ఖురేషి పేర్కొన్నారు. -
ప్చ్.. బాగోలేదు
మంత్రుల పని తీరుపై దిగ్విజయ్ పెదవి విరుపు - సోమరితనం వీడండి.. లేకుంటే ఇంటికే - ఆంజనేయ, మహదేవప్ప వైఖరి మార్చుకోండి - అధికారుల బదిలీల్లో ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వండి - మంత్రులు రాష్ర్టమంతటా పర్యటించాలి - సీనియర్ల సలహా మేరకే కీలక నిర్ణయాలు - కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం - రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో కొందరు మంత్రుల పని తీరుపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తీవ్ర అసృతప్తి వ్యక్తం చేశారు. సోమరితనంతో వ్యవహరిస్తున్న మంత్రుల్లో చురుకు పుట్టించాలని, దారికి రాని మంత్రులకు ఇంటి దారి చూపాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయనతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, మంత్రులు డీకే. శివ కుమార్, కేజే. జార్జ్, ఏఐసీసీ కార్యదర్శి చెల్ల కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రుల పని తీరును సమీక్షించారు. విధాన సౌధలో తన గదిలో గోడను కొట్టి వేయించిన మంత్రి హెచ్. ఆంజనేయ, తన బంగళా అలంకారానికి సుమారు రూ.2 కోట్లు వరకు ఖర్చు చేసిన మంత్రి హెచ్‌సీ. మహదేవప్పల వైఖరిని దిగ్విజయ్ తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. అలాగే అధికారుల బదిలీల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని సూచించారు. మంత్రులు తమ జిల్లాలకే పరిమితం కాకుండా రాష్ట్రమంతటా పర్యటించాలన్నారు. ప్రభుత్వం ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ముందు సీనియర్లను సంప్రదించాలని సలహా ఇచ్చారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వదిలి వేయాలని సూచించారు. కాగా కరువును సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని అనేక మంది నాయకులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇన్‌ఛార్జి మంత్రులు తమ జిల్లాల్లో మకాం వేసి కరువు సహాయక పనులు చక్కగా అమలయ్యేలా చూడాలని, ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకాలను చేపట్టాలని సలహా ఇచ్చారు. రాష్ర్టంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుపు సాధించవచ్చనే విషయమై ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. అలాగే సిద్ధరామయ్య ఏడాది పాలనపై సింహావలోకనం చేపట్టారు. తదుపరి సమావేశంలో దీనిపై మరింతగా చర్చించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తినకుండా కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఉత్తమ పాలన రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలన భేషుగ్గా ఉందని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య సర్కారు డిస్టింక్షన్ సాధించిందని కితాబునిచ్చారు. మంత్రి వర్గ విస్తరణ, శాఖల మార్పు, శాసన మండలికి అభ్యర్థుల ఎంపిక లాంటి విషయాలు ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించినవని పేర్కొన్నారు. -
పిఠాపురంలో ‘దేశం’ డబుల్ గేమ్
- దిక్కరించిన వర్మపై.. చంద్రబాబు ఉపేక్ష - అకస్మాత్తుగా యనమలకు కలిగిన ఆపేక్ష - అయోమయంలో చిక్కుకున్న పార్టీ శ్రేణులు - ‘స్థిరమైన వేదిక’కు తరలిపోయే అవకాశం! సాక్షి ప్రతినిధి, కాకినాడ : అటు అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జిల్లాలో అగ్రనేత యనమల రామకృష్ణుడుల వైఖరి జీర్ణం కాక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు జుట్టు పీక్కునే స్థితిలో చిక్కుకున్నాయి. చంద్రబాబు రాష్ట్ర విభజనలో అనుసరించిన రెండుకళ్ల సిద్ధాంతాన్నే తమ నియోజకవర్గం విషయంలోనూ అనుసరించారా అన్న అనుమానం వారిని పీడిస్తోంది. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఎస్వీఎస్ వర్మను కాదని పోతుల విశ్వంను అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. దీంతో వర్మ రెబల్‌గా బరిలో దిగినా, ఇంతవరకూ పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆయనను సస్పెండ్ చేయకపోవడంలో అధినేత ఆంతర్యమేమిటన్న ప్రశ్న పార్టీ శ్రేణులను వెన్నాడుతోంది. అలాగే మొన్నటి వరకూ వర్మకు అవకాశం రాకుండా మోకాలడ్డినట్టు చెపుతున్న యనమల.. ఇప్పుడు రెబల్‌గా ఉన్న వర్మకు తెర వెనుక మద్దతునిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్న ఈ వైఖరులతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నా.. నేతలకు మాత్రం స్పష్టమైన లక్ష్యాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వర్మకు టీడీపీ పెద్దల పరోక్ష మద్దతు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వర్మ గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచీ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని తిరిగారు. తిరిగి టిక్కెట్టు తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే.. అనూహ్యంగా వర్మకు చెయ్యిచ్చి, ఆ స్థానం నుంచి అవకాశాన్ని పోతుల విశ్వంకు కట్టబెట్టారు. దీంతో హతాశుడైన వర్మ రెబల్‌గా బరిలో దిగారు. వర్మ వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలను చించేశారు. పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం, పోతుల అనుచరులతో దుందుడుకుగా వ్యవహరించారు. వర్మ పార్టీకి రాజీనామా చేయకుండానే ప్రచారం చేసుకుంటున్నారు. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామన్నా ససేమిరా అని బరిలో దిగారని ప్రచారం జరిగింది. ఇంత చేసినా వర్మపై అధినేత ఎలాంటి చర్యా తీసుకోకపోవడం పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. కాగా ఇక్కడ నడుస్తున్నది బాబు డబుల్ గేమ్ తప్ప వేరొకటి కాదని టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురం సీటు విశ్వంకు ఇచ్చినా.. పరోక్షంగా వర్మకు మద్దతు ఇవ్వండన్న సంకేతాలు పార్టీ ముఖ్యుల నుంచి అందుతుండడమే ఇందుకు సాక్ష్యమంటున్నారు. కుదిరిన ఒప్పందం..! కాగా మొత్తం వ్యవహారంలో.. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడి పాత్ర ఉందని పార్టీ సీనియర్లు అంటున్నారు. గతంలో యనమల వర్మకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అనంతరం ఆయనకు, వర్మకు మధ్య ఒప్పందం కుదిరిందని అంటున్నారు. దీంతోనే చంద్రబాబు తాడేపల్లిగూడెం పర్యటనకు వచ్చినప్పుడు తుని టిక్కెట్టు తన సోదరుడు కృష్ణుడుకిఇవ్వకున్నా ఫర్వాలేదు, పిఠాపురంలో వర్మకు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని యనమల పట్టుబట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన ప్రమేయం లేకుండా సీటు తెచ్చుకున్న విశ్వంకు వ్యతిరేకంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు యనమల చెపుతున్నట్టు సమాచారం. మొత్తమ్మీద పెద్ద తలకాయల రెండు ముఖాలతో.. తెల్లముఖం వేస్తున్న పిఠాపురం టీడీపీ శ్రేణులు.. ఆ పార్టీని వీడి ‘స్థిరమైన వేదిక’ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. -
కేంద్ర వైఖరి పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం:జగన్
-
టీడీపీ నేతలు వైఖరి ఎందుకు మార్చుకున్నారు:జూపూడి
-
ఆదాయాన్ని తగ్గించుకోండి
నాకు ముప్పైరెండేళ్లు. పెళ్లయి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ ఓ యాభై వేలు అవసరం అయితే సర్దడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. నేను ఇంటివద్దే ‘లేడీస్ నీడ్స్’ దుకాణం నడుపుతున్నాను. నెలనెలా ఏడెనిమిది వేలు మిగులుతాయి. మా ఆయనకు పాతికవేలు వస్తాయి. ఇద్దరు పిల్లల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ మా జీతం కంటే వేగంగా పెరుగుతుండటంతో ఎప్పుడూ మేము పొదుపు చేయలేకపోయాం. ఎల్లైసీలు తప్ప మేము చేసిన వేరే పొదుపు ఏం లేదు. మాకేమైనా సలహా ఇవ్వండి.? - కిరణ్మయి, విజయవాడ పనిచేసేవారికి పని, పనిచేయనివారికి సాకు దొరుకుతుందట. అలాగే పొదుపు చేసేవారికి డబ్బులు, పొదుపు చేయని వారికి ఖర్చులు కనిపిస్తాయి. మీరు నెలకు ఏడెనిమిది వేలు సంపాదిస్తాను అంటున్నారు. మీకు మీ వ్యాపారంలో ఒక వెయ్యి రూపాయల ఆదాయం తగ్గిందంటే ఏం చేస్తారు... ? వెంటనే నెలనెలా ఆ ఖర్చులకు అలవాటు పడ్డారు కాబట్టి తగ్గిన ఆ వెయ్యి రూపాయలు అప్పు చేసి తెస్తారా... లేకపోతే ఉన్నదాంట్లో సర్దుకుంటారా చెప్పండి. కచ్చితంగా ఉన్నదాంట్లోనే సర్దుకుంటారు. ఏ ఇల్లాలు అయినా ఇదే పనిచేస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచనా విధానం పాజిటివ్‌గానే ఉండాలి. మీరు పొదుపు చేయాలనే గట్టి సంకల్పం పెట్టుకోండి. ఇక నుంచి మీకు ఆరువేలు మాత్రమే ఆదాయం వస్తుందని భావించండి. మీ ఖర్చులు ఆ మొత్తానికే సర్దుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బౌండరీ దాటకండి. ఆరువేలకు మించి వచ్చిన ప్రతిపైసా పొదుపులోకే వెళ్లాలి. అలా చేస్తే ఏడాదిలో మీకో నలభై నుంచి యాభైవేల అత్యవసర నిధి ఏర్పడుతుంది. ఇది మీ రకరకాల భవిష్యత్తు అవసరాలను సంతృప్తి పరుస్తుంది. వీలైతే మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో లోపాలు పరిశీలించడం, వినియోగదారులను పెంచుకునే ప్రయత్నాలు చేయడం ద్వారా నెల ఆదాయం కూడా పెంచుకోవచ్చు. అపుడు మీ పొదుపు కూడా పెరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. డబ్బు అవసరాలను తీర్చడమే కాదు, ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. -
విభజన పై స్పష్టత ఇచ్చీ ఇవ్వనట్టున్న కేంద్ర వైఖరి