బాడీ లాంగ్వేజ్
1. పొడవుగా ఉంటే... వీరు తేలికపాటి స్వభావం కలిగి ఉండి అత్యంత ఊహాత్మకతను, సృజనాత్మకతను కలిగి ఉంటారు. తేలికగా మోసపోగలరు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి.
2. వెడల్పుగా ఉంటే... కొంచెం కోప స్వభావం కలిగి ఉంటారు. తమ మనసులోని మాటను సూటిగా స్పష్టంగా చెప్పగలరు.
3. గుండ్రటి లేదా గుడ్డు ఆకారంలో ఉంటే... వీరు స్నేహశీలియై ఉంటారు. తమకు నచ్చిన దారిలో పనులు చేసుకుంటూ వెళ్తారు. చుట్టుప్రక్కల ఏదైనా వాదనలు జరిగినప్పుడు వీరు మధ్యవర్తిగా ఉండి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తారు.
4. చదరంగా ఉంటే... తీవ్రమైన పట్టుదలను కలిగి ఉంటారు. ఏ పనైనా చేయగల సత్తా ఉంటుంది. వీరిది కొంచెం తీవ్రమైన వైఖరి. వీరిలో ఉండే కాఠిన్యం, గడుసుతనంవల్ల వీరి మంచితనం మరుగున పడిపో
తుంది.
5. ముక్కోణ లేదా విలోమ త్రిభుజంలో ఉంటే... వీరు సున్నితమైన మనస్కులు, మేధావులు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇతరులు మరచిన ప్రతి చిన్న విషయాన్ని వీరు నిశితంగా గమనిస్తూ ఉంటారు.
6. బాదంకాయ ఆకారంలో ఉంటే... వీరు విశ్వసనీయులు నిజాయితీపరులు. వీరెంతో దయకలవారు. మరెంతో మర్యాదస్తులు. అయితే సహనం తక్కువ. వీరు ఒప్పుకోలేని విషయాలు ఎదురైనప్పుడు వెంటనే కోపం తెచ్చుకుంటారు.
7. కత్తి ఆకారంలో ఉంటే... వీరు ఆదర్శవాదులు. తమ లక్ష్యాలను సాధించడానికి ఎంత కష్టపడి పని చేయడానికైనా వెనకాడరు. భవిష్యత్తులో ఉపయోగ పడుతుందనుకుంటే తమకు నచ్చని పనిని చేసేందుకు కూడా సిద్ధపడతారు.
మీరెటువంటివారో మీ గోళ్లే చెప్పేస్తాయి!
Published Sun, Oct 5 2014 12:49 AM | Last Updated on Wed, Apr 3 2019 5:44 PM
Advertisement
Advertisement