ముస్లింలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తమ వైఖరి గురించి పునరాలోచించుకోవాలని భారత ఇస్లాం సాంస్కృతిక కేంద్రం (ఐఐసీసీ) అధ్యక్షుడు సిరాజుద్దీన్ ఖురేషీ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: ముస్లింలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తమ వైఖరి గురించి పునరాలోచించుకోవాలని భారత ఇస్లాం సాంస్కృతిక కేంద్రం (ఐఐసీసీ) అధ్యక్షుడు సిరాజుద్దీన్ ఖురేషీ పిలుపునిచ్చారు. ముస్లింలు మైనారిటీ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని, దేశాభివృద్ధి కోసం సాయపడేందుకు ముందుకు రావాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వానికే గాక ముస్లిం సమాజానికి మేలు చేసినట్టు అవుతుందని ఖురేషి చెప్పారు.
68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖురేషీ మత పెద్దలతో సమావేశమయ్యారు. నరేంద్ర మోడీతో ఇటీవల సమావేశమైన విషయం గురించి చర్చించారు. అనంతరం ఐఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించాలని మోడీని కోరానని, దేశ పౌరులుగా మనం ప్రభుత్వం పట్ల సానుకూల దృక్పథం కలిగిఉండాలని ఖురేషి పేర్కొన్నారు.