distorted
-
యుగాంతం వస్తే .. భూమ్మీద నిలిచే సజీవ సాక్ష్యాలివే
-
వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్‌కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్!
చైనా పట్ల అమెరికాకు ఉన్న వక్రీకరణ వైఖరిని మార్చుకోవాలి లేదంటే సంఘర్షణ కాస్త ఘర్షణగా మారుతుందని చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ యద్ధం విషయంలో రష్యాతో గల సన్నిహిత సంబంధాలపై తమ వైఖరిని వక్రీకరించొద్దంటూ ఆయన హెచ్చరించారు. ఎప్పటికీ చైనాను అణిచి వేయడం, అదుపు చేయడం వంటి పనుల్లో యూఎస్ నిమగ్నమవ్వుతోందంటూ క్విన్ గ్యాంగ్ ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీజింగ్‌లోని వార్షిక పార్లమెంటు సమావేశం సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా పట్ల యూఎస్ అభిప్రాయాలు, అవగాహనలు వక్రీకరించి ఉన్నాయని అన్నారు. చైనాను యూఎస్ ప్రాథమిక ప్రత్యర్థిగా చేస్తోంది. దీని పర్యవసానం భౌగోళిక రాజకీయ సవాలుగా మారుతుందన్నారు. ఇది చొక్కాలోని మొదటి బటన్ని తప్పుగా పెట్టడం లాంటిదని చెప్పారు. యూఎస్ ఎప్పుడూ ఉద్రిక్తతలు, సంక్షోభాలు తలెత్తకుండా ద్వైపాక్షిక సంబంధాలతో రక్షణ కవచాలను ఏర్పరుచుకుంటుందే తప్ప సంఘర్షణ కోరుకోదని వల్లిస్తుంటుంది అన్నారు క్విన్. కానీ ఆచరణ పరంగా అమెరికా భావం ఏంటంటే చైనాపై అపవాదులు, దాడులు చేసినప్పటికీ తమ దేశం స్పందిచకూడదు లేదా దాడి చేయకుండా కట్టడి చేయాలనుకుంటుందన్నారు. ఇలాంటి వాటికి అమెరికా చెక్‌పెట్టకుండా తప్పుడు మార్గంలో కొనసాగిస్తే పట్టాలు తప్పడమే కాకుండా ఎన్ని రక్షణదారులు ఉన్న వాటిని నిరోధించలేవు అని హెచ్చరించారు. పైగా సంఘర్షణ ఘర్షణగా మారి విపత్కర పరిణామానికి దారితీస్తుందన్న అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్‌కిర్బీ.. క్విన్ విమర్శలను తిప్పికొట్టారు. బీజింగ్‌తో ఘర్షణ పడాలని ప్రయత్నించడం లేదని నొక్కి చెప్పారు. తాము చైనాతో వ్యూహాత్మక పోటీని కోరుకుంటున్నామే గానీ వివాదాన్ని కాదని చెప్పారు. చైనాని ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉంచామని చెప్పారు. (చదవండి: ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!) -
నా వాంగ్మూలాన్ని సీబీఐ వక్రీకరించింది: పులివెందుల మాజీ ఎంపీటీసీ శశికళ
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లు ఎంపీ అవినాష్రెడ్డిగానీ మరెవరూ గానీ తనతో చెప్పలేదని పులివెందుల మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ స్పష్టం చేశారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఆమె ఖండించారు. కనీసం తనతో సంప్రదించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తన పేరును ఉటంకిస్తూ అవాస్తవాలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించారు. పులివెందులలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ఉదయం తమ స్థలాలకు సంబంధించిన విషయంపై కలిసేందుకు వెళ్లిన మాట వాస్తవమన్నారు. అక్కడ కొంతమంది పనివాళ్లు ఉన్నారని, వివేకానందరెడ్డిని కలవాలని సమాచారం ఇవ్వగా సమాధానం చెప్పలేదన్నారు. దాంతో కాసేపు వేచి చూశానన్నారు. కొద్దిసేపటికి కొన్ని కార్లు వచ్చాయని తెలిపారు. ‘అందులో నుంచి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీకి చెందిన మరికొంతమంది అనుచరులు ఇంటి లోపలికి వెళ్లారు. ఐదు నిమిషాల్లోనే అవినాష్‌రెడ్డి బయటకు వచ్చి ఆందోళనగా వివేకా ఇంటి లాన్లో ఫోన్లో మాట్లాడారు. అక్కడ గుమికూడిన వారు వివేకా సార్ చనిపోయారని మాట్లాడుకోవడం విన్నా. వెంటనే లోపలికి వెళ్లి చూడగా వివేకానందరెడ్డి చనిపోయి కనిపించారు. అక్కడ అంతా రకరకాలుగా మాట్లాడుకోవడం కనిపించింది. కొందరు గుండె నొప్పి అని, మరికొందరు రక్తపు వాంతులతో చనిపోయారని చర్చించుకున్నారు. అనంతరం బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోయా. అంతేకానీ వివేకా ఇంటి వద్ద అవినాష్‌రెడ్డి నాతో మాట్లాడలేదు. నేను కూడా ఆయనతో ఏమీ మాట్లాడలేదు. సిట్, సీబీఐ అధికారులు విచారణకు పిలిచినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పా’ అని శశికళ పేర్కొన్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డేనని తనతో సహా జిల్లాలో అందరికి తెలుసన్నారు. వైఎస్ వివేకాను పని విషయమై కలవడానికి వెళ్లినప్పుడు కూడా ఎంపీగా వైఎస్ అవినాష్‌రెడ్డి అఖండ మెజార్టీతో గెలిచేలా మీరంతా కృషి చేయాలని తమతో చెప్పేవారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ వివేకా ఉంటే అవినాష్‌రెడ్డికి ప్రయోజనమే కానీ ఎలాంటి నష్టం లేదన్నారు. బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్‌పై కాల్పులు ఎందుకు జరిగాయి? దాని వెనుక రహస్యాల గురించి ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు మాట్లాడితే బాగుంటుందన్నారు. -
గన్ షాట్: లేనిది ఉన్నట్టు మాట్లాడే పవన్ కు మతి ఉన్నట్టా లేనట్టా ..!
-
తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది : సీతారాం ఏచూరి
-
చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?
ఎనిమిదేళ్ల ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనా కాలంలో దేశం సాధించిన విజయాలు, వైఫల్యాలపై జరిగే చర్చకంటే... కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వంకరటింకర చేయడం, అలాగే వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ యేతర పార్టీలను బలహీనం చేయడంపైననే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నది. భారతదేశ చరిత్ర సమున్నతమైనది. అందులో స్వాతంత్య్ర సంగ్రామ పోరాటం ప్రధాన మైనది. అలాగే దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు–దేశ విభజన, మత ఘర్షణలు; నెహ్రూ పాలనలో అనుసరించిన ఆర్థిక, సామాజికాభివృద్ధి, విదేశీ విధానాలు తదితర అంశాలు చరిత్రలో ప్రముఖ స్థానం ఆక్రమించాయి. అయితే, పాక్షిక దృష్టితోనో లేక కాంగ్రెస్, వామపక్ష భావజాలాల దృక్కోణం నుంచో సంఘటనలను చరిత్రకారులు చెప్పారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ఇందులో కొంత నిజం ఉండొచ్చు. చరిత్రకు సైద్ధాంతిక ఏకీభావం ఉండదు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర పరిశీలించినా అనేక అంశాలలో భిన్నమైన వాదనలు, వ్యక్తీ కరణలు, అభిప్రాయాలు కనిపిస్తాయి. అయితే, భారత్‌కు సంబంధించినంత వరకు జాతీయవాదం తమ గుత్తసొత్తుగా భావించే బీజేపీ ఇపుడు చరిత్రను సరిచేసే నెపంతో గత చరిత్రను తారుమారు చేసే పనిలో నిమగ్నమైంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నప్పుడు స్వయంగా మోదీ చరిత్ర మసిపూసే పనికి తగిన సహకారం, ప్రోద్బలం అందిస్తున్నట్టు భావించాల్సి వస్తోంది. ముఖ్యంగా, స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడి, స్వాతంత్య్రం లభించినాక దేశానికి 17 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా పనిచేసి... ప్రపంచంలో భారత్‌కు ఓ విశిష్ట స్థానం కల్పించిన పండిట్ నెహ్రూ పాత్రను కుదించే పనిలో నేడు బీజేపీ తలమునకలై ఉంది. దేశ విభజన, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం, చైనాతో యుద్ధం వంటి అంశాలలో ప్రధానమంత్రిగా నెహ్రూ పోషించిన పాత్ర, తీసుకొన్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, కేవలం ఆయన విజయాలను విస్మరించి వైఫల్యాలను సాకుగా చూపి దేశ చరిత్రలో నెహ్రూ పాత్రను తక్కువ చేయడం; పూర్తిగా విస్మరించాలనుకోవడం ఆశ్చర్యకరం. దేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి సోషలిస్ట్ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించిన ఘనత నెహ్రూది. ఆయన ఏర్పరిచిన ‘ప్లానింగ్ కమిషన్’ అటు కేంద్రానికీ, ఇటు రాష్ట్రాలకూ అనేక దశాబ్దాలపాటు దిక్సూచిగా నిలిచింది. అయితే, ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేసి దానిస్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు సంబం ధించిన పాఠ్యాంశాలలో నెహ్రూపై ఉన్న అధ్యాయాలను ఇటీవల తొలగించారు. కర్ణాటక ప్రభుత్వమైతే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వివిధ స్వాతంత్య్ర సమరయోధుల ఫోటోలు వేసి, నెహ్రూ బొమ్మ లేకుండా చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఈ ఏడాదిలోనే ఢిల్లీలోని ఒకప్పటి నెహ్రూ అధికార నివాసమైన తీన్‌మూర్తి భవన్లో నిర్వహిస్తున్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీలకు ప్రాధాన్యం తగ్గించి, అందులో భారత ప్రధానుల జీవితాలను తెలియజెప్పే కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. మాజీ ప్రధానులందరినీ సముచితంగా గౌరవించడంలో తప్పులేదు. కానీ, నెహ్రూ మ్యూజియంను అక్కడి నుండి తొలగించాల్సిన అవసరం ఉందా? ఇక, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన సంఘటన అయిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంపై నేషనల్ ఆర్కైవ్స్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోనూ నెహ్రూ ప్రస్తావన లేకుండా చేశారు. ప్రధాని మోదీ తనకు నెహ్రూపై గల వ్యతిరేకతను బహిర్గత పర్చడానికి ఏమాత్రం సంకోచించరు. పార్లమెంట్‌లోనే ఓ సందర్భంలో ‘భారతదేశానికి స్వాతంత్య్రం నెహ్రూ ఒక్కడి వల్లనే రాలేదు’ అని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఆయన ఒక్కరి వల్లనే వచ్చిందని ఎవరన్నారు? నెహ్రూ పాలనలో జరిగిన వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం; ఏర్పాటైన వివిధ అత్యున్నత విద్యా సంస్థలు, రష్యా సాంకేతిక సహకారంతో నెలకొల్పిన పబ్లిక్ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, విదేశాలతో ఏర్పరచుకొన్న సత్సంబంధాలు, అనుసరించిన అలీన విధానం, పంచవర్ష ప్రణాళికలు; విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి; అనుసరించిన లౌకికవాదం (సెక్యులరిజం), భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు... ఇలాంటివెన్నో పండిట్ నెహ్రూను నవభారత శిల్పిగా నిలిపాయి. ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడానికీ, వ్యక్తి స్వేచ్ఛను కాపాడటానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని చరిత్ర చెబుతోంది. ఆయన విమర్శకులు సైతం ఈ విషయాలను ఒప్పుకోక తప్పదు. (క్లిక్: ఇప్పుడు మతం కాదు... ప్రేమ కావాలి!) నెహ్రూ విమర్శలకు అతీతుడేమీ కాదు. ఆయన చేసిన తప్పుల్ని ఎత్తి చూపవచ్చు. అదే సమయంలో చరిత్రలో ఆయన స్థానం ఆయనకు ఇవ్వాల్సిందే. ఆయనను తక్కువ చేసి చూపడం వల్లా, విస్మరించడం వల్లా బీజేపీకి ఒరిగే లాభం ఏమిటి? (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) - సి. రామచంద్రయ్య ఏపీ శాసన మండలి సభ్యులు -
ఆర్ఎంపీ వైద్యం వికటించి యువకుడి మృతి
సాక్షి, వెల్దుర్తి(కర్నూలు): ఆర్ఎంపీ వైద్యం వికటించి మండల పరిధిలోని గుంటుపల్లెకు చెందిన యువకుడు వడ్డే మణిదీప్ (17) మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పెద్దయ్య నాయుడు తెలిపిన వివరాలు.. ఈనెల 22న మణిదీప్ జ్వరం, కాళ్ల నొప్పులతో బాధ పడుతూ వెల్దుర్తిలోని ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేశ్వర్లు(అనిల్ క్లినిక్)ను సంప్రదించాడు. అతడు కుడికాలి మక్కికి ఇంజక్షన్ వేసి నయమవుతుందని పంపేశాడు. ఇంటి కెళ్లిన తరువాత కాలు వాపు వచ్చింది. మరుసటి రోజు బొబ్బలు వచ్చాయి. మంగళవారం తండ్రితో కలిసి ఆర్ఎంపీ వద్దకు వెళ్లి ప్రశ్నించగా డోనుకు గానీ, కర్నూలుకు కానీ వెళ్లి వైద్యం చేయించుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. డోన్‌లోని వాణి పాలి క్లినిక్‌కు వెళ్లగా ఇంజక్షన్ వికటించిందని, కర్నూలుకు వెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. తన కుమారుడు మృతికి ఆర్ఎంపీ వైద్యుడే కారణమంటూ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
వచ్చీరాని వైద్యానికి చిన్నారి బలి
సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి చిన్నారి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రుల కథనం..చంద్రగిరి కొత్తపేటకు చెందిన లోకనాథం, శాంతమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు. లోకనాథం సీనియర్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేయడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం లోకనాథం కుమార్తెలు విషిక, రిషిక(9) జ్వరం బారిన పడడంతో స్థానిక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ సుధాకర్ వద్దకు తీసుకెళ్లారు. అతను రాసిచ్చిన ప్రిస్కిప్షన్ మేరకు అతని మందుల షాపులోనే మందులు కొని తీసిచ్చారు. తొలుత విషికకు సుధాకర్ చికిత్స చేశారు. అనంతరం రిషికకు వేర్వేరు నడుం దిగువ భాగంలో ఇంజెక్షన్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రిషిక కాలుకు తీవ్రంగా వాపు రావడంతో మరోసారి సుధాకర్‌ను సంప్రదించారు. ఇదేమీ కాదని వారికి ఆయన చెప్పారు. అంతేకాకుండా అతని సూచన మేరకు రిషిక కాలుకు వేడినీటితో కాపడం పెట్టారు. సోమవారం ఉదయం పాప కాలు పూర్తిగా వాచిపోవడంతో పాటు వాంతులయ్యాయి. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు తాటితోపు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వెద్యులు చెప్పడంతో అక్కడి నుంచి తిరుపతిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పాపకు పలు వైద్యపరీక్షలు చేసిన వైద్యులు, చంద్రగిరిలో పాపకు వేసిన ఇంజెక్షన్ వలన కాలుకు ఇన్ఫెక్షన్కు గురైందని, దీనివలన శరీరంలో రక్తం పూర్తిగా గడ్డకట్టడంతో పాటు ప్రాణాపాయ స్థితికి చేరిందని వెల్లడించారు. అనంతరం చికిత్స ప్రారంభించేలోపు పాప కన్నుమూసింది. మృతదేహంతో చంద్రగిరికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి కారణమైన పీఎంపీ సుధాకర్‌ను కఠినంగా శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రిషికకు అంత్యక్రియలు నిర్వహించారు. అనుమతులు లేకున్నా క్లినిక్స్ నిర్వహణ చంద్రగిరిలో అనుమతులు లేకుండా పీఎంపీలు క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. వాస్తవానికి పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని నిబంధన ఉంది. అయితే కొందరు ఏకంగా మెడికల్ షాపులు సైతం అనుబంధంగా పెట్టి, ఆపరేషన్లు సైతం చేస్తుండటం గమనార్హం! మిడిమిడి జ్ఞానంతో రోగుల జీవితాలో చెలగాటమాడుతున్నారు. సుధాకర్ కూడా ఆపరేషన్లు చేసేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. ఇతని సర్టిఫికెట్‌కి వ్యాలిడిటీ లేకపోయినా సంబం«ధిత అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. క్లినిక్‌కు అనుబంధంగా సుధాకర్ ఓ మెడికల్ షాపును సైతం నిర్వహిస్తున్నారు. ఇదలా ఉంచితే, సుధాకర్ రాసిచ్చిన మందుల ప్రిస్కిప్షన్‌ను మండల స్థాయి వైద్యాధికారి దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది.దానిని పరిశీలించిన ఆయన అవి నాసిరకమైన లోకల్ మందులుగా ఉన్నాయని, కంపెనీవి కావని వైద్యాధికారి చెప్పారు. నిద్రావస్థలో వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలో కొన్నిచోట్ల పీఎంపీలు ఎలాంటి అనుమతి లేకుండా చికిత్స, ఆపరేషన్లు చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించడం లేదనే విమర్శలొస్తున్నాయి. దీనిపై డీఎంహెచ్ఓను వివరణ కోరగా అది తమ పరిధిలోకి రాదని, డ్రగ్స్ అధికారులు చూసుకోవాలంటూ ఫోన్ పెట్టేశారు. -
కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరించారు
:సీమాంధ్ర ఉద్యోగులు అక్కడి ప్రభుత్వాన్ని నడిపేందుకు వెళ్లాల్సి ఉంటుందని తమపార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలను వక్రీకరించారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నాడాయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు నడవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేసి తప్పుపట్టడం అర్థరహితమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి మాట్లాడటం అవివేకమన్నారు. పొట్టలుగొట్టే వారిపైనే తమ పోరాటం ఉంటుందని వివరించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే అందరం కలిసే ఉంటామని, సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. బదిలీలు రాజ్యంగబద్ధంగానే జరుగుతాయని తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రకటనతో సమైక్య ఉద్యమం, ఏకపక్ష నిర్ణయమంటూ రాద్ధాంతం చేయడమేమిటని ప్రశ్నిం చారు. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొంది తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనట్లని అన్నారు. 7న టీఆర్ఎస్ సర్పంచ్‌లకు సన్మానం ఈనెల 7న నల్లగొండ నియోజకవర్గంలో గెలిచిన టీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచులను స్థానిక ఎన్జీ కళాశాలలో సన్మానిస్తామని చాడ కిషన్‌రెడ్డి తెలిపారు. అనంతరం భారీ ర్యాలీగా తరలివెళ్లి క్లాక్‌టవర్ సెంటర్లో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాలె శరణ్యారెడ్డి, పున్న గణేష్, అభిమన్యు శ్రీనివాస్, జి.సురేందర్, రవినాయక్, లింగస్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.