
నార్త్ కరోలినా : అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో భారతసంతతికి చెందిన ఓ మహిళ మృతిచెందారు. మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్ పోలీసుల కథనం ప్రకారం.. మిన్నెసొటాలోని ఎడెన్ ప్రైరీకి చెందిన బాబు సెల్వం తన భార్య, కూతురుతో కలిసి నిస్సాన్ రోగ్ కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా నడపడం వల్ల కారు అదుపుతప్పి ఎమర్జెన్సీ క్రాస్ ఓవర్‌ను ఢీకొట్టి గాల్లో ఎగిరి పల్టీలు కొట్టింది.
ఈ ఘటనలో బాబు సెల్వం భార్య రమ్యభారతి మోహన్(34) మృతిచెందారు. సీటు బెల్టు ధరించకపోవడం వల్ల పల్టీలు కొడుతున్న కారులో నుంచి బయట పడటంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందారు. కెమెరూన్‌కు 11 మైళ్ల దూరంలోని డేవీస్ కౌంటీలో ఇంటర్‌స్టేట్ 35 (ఐ-35) జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వల్పగాయాలైన తియారా(1)ను కాన్సాస్‌లోని చిల్డ్రన్స్ మెర్సీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment