car turns turtle
-
కారు బోల్తా.. భారతసంతతి మహిళ మృతి
నార్త్ కరోలినా : అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో భారతసంతతికి చెందిన ఓ మహిళ మృతిచెందారు. మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్ పోలీసుల కథనం ప్రకారం.. మిన్నెసొటాలోని ఎడెన్ ప్రైరీకి చెందిన బాబు సెల్వం తన భార్య, కూతురుతో కలిసి నిస్సాన్ రోగ్ కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా నడపడం వల్ల కారు అదుపుతప్పి ఎమర్జెన్సీ క్రాస్ ఓవర్‌ను ఢీకొట్టి గాల్లో ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బాబు సెల్వం భార్య రమ్యభారతి మోహన్(34) మృతిచెందారు. సీటు బెల్టు ధరించకపోవడం వల్ల పల్టీలు కొడుతున్న కారులో నుంచి బయట పడటంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందారు. కెమెరూన్‌కు 11 మైళ్ల దూరంలోని డేవీస్ కౌంటీలో ఇంటర్‌స్టేట్ 35 (ఐ-35) జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వల్పగాయాలైన తియారా(1)ను కాన్సాస్‌లోని చిల్డ్రన్స్ మెర్సీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ఫ్లైఓవర్‌పై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న కారు రాయగిరి ఫ్లైఓవర్‌పైకి రాగానే అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన వాహనదారులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
జూబ్లీహిల్స్‌లో కారు బోల్తా
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బోల్తాకొట్టింది. ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చెట్టును ఢీకొట్టిన కారు.. డ్రైవర్ మృతి
కొనకనమిట్ల(ప్రకాశం): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినమనగుండం గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా నుంచి ఒంగోలుకు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారుడ్రైవర్ అఫ్జల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులు ఒంగోలులో జరుగుతున్న ఓ వివాహానికి వెళ్తున్న కడప వాసులుగా గుర్తించారు. -
చెట్టును ఢీకొని కారు బోల్తా
ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు మంచాల: వేగంగా వస్తూ.. అదుపుతప్పి కారు చెట్టును ఢీకొని బోల్తా పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి మండలంలోని ఆగాపల్లి సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజు పేట్ తండాకు చెందిన కొర్ర శ్రీను (32), నాంపల్లి మండలం ముర్షపల్లి తండాకు చెందిన బిచ్చు నాయక్ కలిసి గురువారం రాత్రి దేవరకొండ నుంచి (ఏపీ 24 ఏవై 1244) కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే నాగార్జున సాగర్ రహదారి మండలంలోని ఆగాపల్లి గ్రామం దాటగానే జాలి గుట్ట సమీపంలోకి రాగానే వేగాన్ని నియంత్రించలేక అదుపు తప్పి రోడ్డుపక్కనే గల చెట్టుకు ఢీకొంది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. బిచ్చా నాయక్ తీవ్ర గాయాలతో నగరంలోని అవేర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. -
కారు బోల్తా.. హైదరాబాదీ మృతి
పామిడి (అనంతపురం): అనంతపురం జిల్లాలోని పామిడి-కల్లూరు మధ్య జాతీయ రహదారిపై మంగళవారం కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన హరికుమార్(43) అనే వ్యక్తి మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు... భూభారత్ అనే ప్రైవేటు సంస్థలో హరికుమార్ పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సొంత కారులో స్నేహితుడు శ్రీధర్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి కదిరిలో నిర్వహిస్తున్న రైతు క్షేత్ర అవగాహన సదస్సుకు వెళ్లారు. అక్కడ రైతులతో సమీక్ష అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. పామిడి- కల్లూరు మధ్య గడ్డిమోపుతో వెళ్తున్న మోపెడ్‌ను తప్పించబోయిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ముందు సీట్లో బెల్టు లేకుండా ప్రయాణిస్తున్న హరికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడుపుతున్న శ్రీధర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో సురక్షితంగా బయట పడ్డాడు. -
తిరుమల ఘాట్‌రోడ్డులో కారు బోల్తా
చిత్తూరు: శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు భక్తులు ఆదివారం శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని తమ ఏపీ 03 బీహెచ్ 5918 నెంబరు గల వాహనంలో తిరుగు పయనమయ్యారు. మార్గ మధ్యంలోని వినాయకస్వామి ఆలయం సమీపంలో వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాకొట్టింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.