వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
యాదాద్రి భువనగిరి:
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ఫ్లైఓవర్‌పై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న కారు రాయగిరి ఫ్లైఓవర్‌పైకి రాగానే అదుపుతప్పి బోల్తాకొట్టింది.
దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన వాహనదారులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.