buvanagiri
-
కరోనాపై తప్పుడు ప్రచారం.. ముగ్గురి అరెస్టు
సాక్షి, భువనగిరిఅర్బన్ : కరోనా వైరస్ సోకిందని తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్టు చేసినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పట్టణానికి చెందిన మర్రి శివకుమార్, జూపల్లి భరత్‌కుమార్, ఎంకర్ల బాలరాజ్‌లు స్నేహితులు. ఇందులో జూపల్లి భరత్‌కుమార్ గూగుల్ క్రోమ్ ద్వారా ఒక వ్యక్తి ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటోను ఎడిట్ చేసి ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చనిపోయినట్లు అసత్య ప్రచారాన్ని చేశాడు. ఆవ్యక్తిని భువనగిరికి తరలించారని, ప్రజల్లో భయభ్రాంతులు కలిగే విధంగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పోస్టు చేశాడు. విచారణ చేపట్టి వీరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈవార్త అసత్యమైందని, ఇందులో నిజం లేదని పట్టణ ప్రజలు ఎవరూ కూడా కరోనా వైరస్‌తో చనిపోలేదని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని నమ్మరాదని, అలాగే వేరే గ్రూపుల్లో కూడా పోస్టు చేయొద్దన్నారు. అలా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఆ పదవిపై ఆశలేదు : కోమటిరెడ్డి
సాక్షి, భువనగిరి : పీసీసీ పదవిపై తనకు ఆశలేదని, ఆ పదవిపై ఉత్సాహం ఎవరికైనా ఉంటే వారికే ఇవ్వమని చెపుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసీ కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని భువనగిరి ప్రజలు తనకు ఇచ్చారని, వారికి సేవ చేస్తానని పేర్కొన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకోసం పోరాడినట్లుగా ప్రజలకోసం పోరాడుతానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారం అండతో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఉరుకొమని హెచ్చరించారు. -
ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయగిరి ఫ్లైఓవర్‌పై ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న కారు రాయగిరి ఫ్లైఓవర్‌పైకి రాగానే అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన వాహనదారులు తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలి
రాజాపేట : రాజాపేట మండలాన్ని భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం మండల సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో వినాయకుడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం డివిజన్లో ఆలేరు, రాజాపేట మండలాలను కలపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చామకూరు గోపాల్‌గౌడ్, మెండు శ్రీనివాస్‌రెడ్డి, గుంటి కష్ణ, గుర్రాల బాలమల్లు, మర్ల సిద్దిఎల్లయ్య, కోరుకొప్పుల శీరీష, ఉప్పరి లావణ్య, నాయకులు దాచపల్లి శ్రీనివాస్, ఉప్పరి నరేష్, కోరుకొప్పుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భువనగిరిలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
భువనగిరి అర్బన్ వినాయక చవితిని పురస్కరించుకుని భువనగిరిలో ఏర్పాటు చేసిన వినాయకుని మండల పాల వద్ద బుధవారం నల్లగొండ నుంచి వచ్చిన బాంబు, డాగ్ స్క్వాడ్ బందం అకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలోని రైతుబజార్, హన్మాన్‌వాడ, కిసాన్‌నగర్, సమాద్చౌరస్తా, గంజ్మార్కెట్తో పాటు పలు వార్డులలో ప్రధాన చౌరస్తాల వద్ద, రోడ్ల వెంట డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఆలయ మండపాల పరిసరాలను, వీధులను క్షుణంగా పరిశీలించారు. కార్యక్రమంలో బాంబు, డాగ్ స్వా్కడ్ టీం హెచ్‌సీ చిన్నబాబు, నల్లగొండ ఏఆర్ పీసీలు శ్రీకాంత్, రవీందర్, కానిస్టేబుల్లు అక్బర్, వెంకటేశ్ ఉన్నారు.