సాక్షి, భువనగిరిఅర్బన్ : కరోనా వైరస్ సోకిందని తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్టు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పట్టణానికి చెందిన మర్రి శివకుమార్, జూపల్లి భరత్‌కుమార్, ఎంకర్ల బాలరాజ్‌లు స్నేహితులు. ఇందులో జూపల్లి భరత్‌కుమార్ గూగుల్ క్రోమ్ ద్వారా ఒక వ్యక్తి ఆస్పత్రి బెడ్ మీద ఉన్న ఫొటోను ఎడిట్ చేసి ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చనిపోయినట్లు అసత్య ప్రచారాన్ని చేశాడు. ఆవ్యక్తిని భువనగిరికి తరలించారని, ప్రజల్లో భయభ్రాంతులు కలిగే విధంగా సోషల్ మీడియాలో కరోనా వైరస్ పోస్టు చేశాడు. విచారణ చేపట్టి వీరిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈవార్త అసత్యమైందని, ఇందులో నిజం లేదని పట్టణ ప్రజలు ఎవరూ కూడా కరోనా వైరస్‌తో చనిపోలేదని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వాటిని నమ్మరాదని, అలాగే వేరే గ్రూపుల్లో కూడా పోస్టు చేయొద్దన్నారు. అలా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment